వెయ్యి కోట్ల పాత కరెన్సీ తరలింపు..
చెన్నై: నెల్లె ప్రజలు ఇతర ప్రాంతాల ప్రజలతో కలిసి పాత నోట్లను సేకరించారు. ప్రజలు, సంస్థల నుంచి సేకరించిన పాత రూ.500, రూ.1000 నోట్లు బుధవారం తిరుచందూర్ ఎక్స్ప్రెస్ రైలు ద్వారా చెన్నైకు తీసుకు వచ్చారు. తిరునల్వేలి జిల్లా నుంచి ఎక్స్ప్రెస్ రైలు ద్వారా తీసుకువచ్చిన వెయ్యి కోట్ల విలువైన కరెన్సీని భద్రంగా రిజర్వ్ బ్యాంకుకు అప్పగించారు. అందుకోసం ఆ రైలుకు ప్రత్యేక బోగీని జత చేశారు.
ఆ బోగీలో ఒక సహాయ కమిషనర్, ఇద్దరు ఇన్స్పెక్టర్లతో సహా 13 మంది పోలీసుల పహారాతో రైలులో ఎగ్మూర్ రైల్వే స్టేషన్కు చేరుకున్నారు. వెంటనే నగదు ఉన్న బోగీని మాత్రమే విడిగా తీసి పోలీసు అధికారుల సమక్షంలో రిజర్వ్ బ్యాంక్ అధికారులు ఆ నగదును పెట్టెను తెరిచారు. ఆ బోగీ నుంచి 174 క్యాష్ బాక్స్ లను లారీలలో ఎక్కించి భద్రంగా బ్రాడ్వేలో గల రిజర్వ్ బ్యాంకుకు తీసుకెళ్లారు. వాటి మొత్తం విలువ వెయ్యి కోట్లని అధికారులు తెలపారు. మోదీ ప్రభుత్వం చేసిన నోట్ల రద్దు నవంబర్ 8వ తేది నుంచి అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే.