Nellore zp chairman
-
విఐపి రిపోర్టర్ - నెల్లూరు జెడ్.పి ఛైర్మన్ బొమ్మిరెడ్డి
-
కారును పోలీసులే తీసుకెళ్లారు: శేషయ్య
న్యాయవాది కిడ్నాప్‌నకు వాడిన కారు యజమాని శేషయ్య సాక్షి, నెల్లూరు: నెల్లూరు జెడ్పీ చైర్మన్ ఎన్నిక ప్రక్రియలో జరుగుతున్న అధికార దుర్వినియోగంపై కోర్టుకెక్కిన న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డిని కిడ్నాప్ చేసే ప్రయత్నంలో వినియోగించిన కారును పోలీసులు తీసుకెళ్లినట్లు దాని యజమాని పబ్బు శేషయ్య ధ్రువీకరించారు. అయితే ‘సాక్షి’ నుంచి వచ్చినట్లు చెప్పగానే లేదు లేదు.. తన స్నేహితులు తీసుకెళ్లారని మాట మార్చారు. ఎవరా స్నేహితులు? అనే ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ఆయన నిరాకరించారు. కారు అక్కడ నిలబెట్టి ఉండగా, న్యాయవాదికి చెందినవారు అనవసర రాద్ధాంతం చేశారని వ్యాఖ్యానించారు. న్యాయవాది సుధాకర్‌రెడ్డిని మంగళవారం హైదరాబాద్‌లో కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించిన విషయం తెలిసిందే. ఇందుకు ఉపయోగించిన ఏపీ26-ఎపి9559 కారు నెల్లూరులోని శ్రీనివాస అగ్రహారానికి చెందిన పబ్బు శేషయ్యది. ఆయన రాజరాజేశ్వరి ట్రావెల్స్‌ను నడుపుతున్నారు. ట్రావెల్స్ ద్వారా కారును నడుపుతున్నా, దానికి టూరిస్టు పర్మిట్ లేదు. సొంత కారుగానే చెప్పుకుంటూ అద్దెకు తిప్పుతున్నాడు. దీన్ని ఆసరాగా తీసుకున్న పోలీసులు కారును బాడుగకు తీసుకున్నట్లు తెలిసింది. కారును హైదరాబాద్‌కు తీసుకెళ్లి పొన్నవోలు సుధాకర్‌రెడ్డిని కిడ్నాప్‌నకు ప్రయత్నించారు. -
'కూర్చోండి.. లేకుంటే బయటకు వెళ్లండి'
నెల్లూరు: తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నడుమ నెల్లూరు జడ్పీ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైంది. వైఎస్ఆర్ సీపీ జడ్పీటీసీ సభ్యురాలు పెంచలమ్మను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై వైఎస్ఆర్సీపీ సభ్యులు అభ్యంతరం తెలిపారు. పెంచలమ్మను సమావేశం హాలుకు తీసుకురావాలని డిమాండ్ చేశారు. తొలగించేందుకు టీడీపీ సభ్యులు యత్నించడంతో నిబంధనలు ఉల్లంఘించొద్దని కలెక్టర్ హెచ్చరించారు. ఆరుగురు వైఎస్ఆర్ సీపీ జడ్పీటీసీ సభ్యులు టీడీపీ వరుసలోకి వెళ్లారు. ఆయా పార్టీ సభ్యులు వారికి కేటాయించిన సీట్లలో కూర్చోవాలని కలెక్టర్ సూచించారు. వారు పట్టించుకోకపోవడంతో బయటకు వెళ్లిపోవాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలతో నలుగురు వైఎస్ఆర్ సీపీ సభ్యులను పోలీసులు బయటకు పంపారు. అయితే ఇద్దరు మాత్రం లోపలే ఉన్నారు. సీక్రెట్ ఓటింగ్ జరిపించాలని టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగడంతో గందరగోళం రేగింది. టీడీపీ సభ్యుల డిమాండ్ ను కలెక్టర్ తిరస్కరించారు. -
నెల్లూరు, ప్రకాశం జెడ్పి ఎన్నికలు నేడే!
-
నెల్లూరు జడ్పీ ఛైర్మన్ ఎన్నికపై హైకోర్టు కీలక ఆదేశాలు
-
నెల్లూరు జడ్పీ ఛైర్మన్ ఎన్నికపై హైకోర్టు కీలక ఆదేశాలు
నెల్లూరు జిల్లా జడ్పీ ఛైర్మన్ ఎన్నికకు ప్రత్యేక పరిశీలకుడిని నియమించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. జడ్పీ ఛైర్మన్ ఎన్నిక స్వేచ్ఛగా, నిర్భయంగా నిర్వహించాలని హైకోర్టు జారీ చేసిన ఆదేశాలలో ఎన్నిక సంఘానికి సూచించింది. ఆ ఎన్నిక ప్రక్రియ మొత్తాన్ని కెమెరాలలో చిత్రీకరించాలని హైకోర్టు ఆదేశాలలో పేర్కొంది. ఈ నెల 5వ తేదీన ఆంధ్రప్రదేశ్ జడ్పీ ఛైర్మన్ల ఎన్నిక జరిగింది. అయితే నెల్లూరు జిల్లాలో ఛైర్మన్ పదవికి ఎన్నిక నిర్వహించే సమయానికి ఆదే జిల్లాకు చెందిన వెంకటగిరి టీడీపీ ఎమ్మెల్యే కె. రామకృష్ణ కలెక్టర్ ఎదుట వీరంగం సృష్టించాడు. దాంతో ఎన్నికలు ఈ నెల 13కు వాయిదా పడింది. జిల్లా జడ్పీ ఛైర్మన్ ఎన్నిక సజావుగా జరిగే పరిస్థితి లేదని.... ఈ నేపథ్యంలో ఆ ఎన్నికకు ప్రత్యేక పరిశీలకుడిని నియమించేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని న్యాయవాది సుధాకర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. అందులోభాగంగా హైకోర్టు గురువారంపై విధంగా స్పంధించింది.