నెల్లూరు: తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నడుమ నెల్లూరు జడ్పీ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైంది. వైఎస్ఆర్ సీపీ జడ్పీటీసీ సభ్యురాలు పెంచలమ్మను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై వైఎస్ఆర్‌సీపీ సభ్యులు అభ్యంతరం తెలిపారు. పెంచలమ్మను సమావేశం హాలుకు తీసుకురావాలని డిమాండ్ చేశారు.
తొలగించేందుకు టీడీపీ సభ్యులు యత్నించడంతో నిబంధనలు ఉల్లంఘించొద్దని కలెక్టర్ హెచ్చరించారు. ఆరుగురు వైఎస్ఆర్ సీపీ జడ్పీటీసీ సభ్యులు టీడీపీ వరుసలోకి వెళ్లారు. ఆయా పార్టీ సభ్యులు వారికి కేటాయించిన సీట్లలో కూర్చోవాలని కలెక్టర్ సూచించారు. వారు పట్టించుకోకపోవడంతో బయటకు వెళ్లిపోవాలని కలెక్టర్ ఆదేశించారు.
కలెక్టర్ ఆదేశాలతో నలుగురు వైఎస్ఆర్ సీపీ సభ్యులను పోలీసులు బయటకు పంపారు. అయితే ఇద్దరు మాత్రం లోపలే ఉన్నారు. సీక్రెట్ ఓటింగ్ జరిపించాలని టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగడంతో గందరగోళం రేగింది. టీడీపీ సభ్యుల డిమాండ్ ను కలెక్టర్ తిరస్కరించారు.