నేపాల్ బస్సు ప్రమాదంలో 12మంది భారతీయులు మృతి
ఖాట్మాండ్: నేపాల్‌లో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 12మంది భారతీయులు దుర్మరణం చెందారు. కొండప్రాంతంలో యాత్రికులతో వెళుతున్న ఈ బస్సు అదుపుతప్పి 100మీట్లర లోతు గల కొండ ప్రాంతంలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 12 మంది భారతీయ తీర్థయాత్రికులు దుర్మరణం చెందగా, మరో 27మందికి తీవ్రగాయాలయ్యాయి. యాత్రికులతో వెళుతున్న బస్సులో మొత్తం 45మంది యాత్రికులు ఉన్నారు. యాత్రికులు ఖాట్మండ్‌లోని పశుపతినాథ్ ఆలయాన్ని దర్శించుకున్న అనంతరం తిరిగి గుజరాత్‌లోని గోరఖపూర్ ప్రాంతానికి తిరిగివస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
ఈ ప్రమాదంలో మరణించిన యాత్రికులు గుజరాత్‌కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు పోలీసులు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.