nepal minister
-
మనీషా కోయిరాలా ట్వీట్పై విమర్శలు
న్యూఢిల్లీ: ప్రముఖ బాలీవుడ్ నటి, నేపాల్ పౌరురాలు మనీషా కోయిరాలా చేసిన ఓ ట్వీట్ రాజకీయ ప్రాధాన్యత సంతరించుకోవడంతో ఆమెపై ట్రోల్స్ ప్రారంభమయ్యాయి. కాలాపానీ, లిపులేఖ్ ప్రాంతాలను తమ భూభాగంలో చూపించుకుంటూ నేపాల్ మంత్రి పోస్ట్ చేసిన మ్యాప్ ట్వీట్ను మనీషా కోయిరాలా రీట్వీట్ చేశారు. ‘మన చిన్న దేశ గౌరవాన్ని నిలబెట్టినందుకు ధన్యవాదాలు. మూడు గొప్ప దేశాల మధ్య చర్చలన్నీ ప్రశాంతంగా జరగాలని కోరుకుంటున్నాను’ అంటూ ట్వీట్లో పేర్కొన్నారు. దీంతో భారత్లో ఆమెపై ట్రోల్స్ మొదలయ్యాయి. భారత్ ఆమెకు సినీ జీవితం ప్రసాదిస్తే ఇప్పుడు భారత్ మీదే వివక్ష చూపుతున్నారని, ఆమెను బహిష్కరించాలని ట్రోల్స్ వచ్చాయి. -
కౌగిలించుకున్నాడు.. పదవి ఊడింది!
వరినాట్లు వేసే కార్యక్రమానికి హాజరైన నేపాల్ వ్యవసాయ శాఖ మంత్రి.. అంతటితో ఊరుకోకుండా అక్కడికొచ్చిన మహిళలను కౌగలించుకోవడం, ఆ వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేయడంతో.. చివరకు ఆయన పదవి కాస్తా ఊడిపోయింది. హరిప్రసాద్ పరాజులి అనే ఈ మంత్రి.. మహిళలు వద్దు వద్దంటున్నా వినకుండా వాళ్లను పట్టుకోవడం లాంటి దృశ్యాలు వీడియోలలో కనిపించాయి. తెల్లటి టీషర్టు వేసుకుని, మెడలో వరినారు దండలా ధరించి మరీ ఆయన ఈ కార్యక్రమానికి వెళ్లారు. ప్రతియేటా నేపాల్లో వరినాట్ల ప్రారంభాన్ని ఉత్సవంలా చేస్తారు. దీనికే ఆయన వ్యవసాయ మంత్రి హోదాలో వెళ్లారు. అయితే అక్కడ ఆయన చేసిన ఈ వ్యవహారం సోషల్ మీడియాలో రావడంతో ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి. మీడియాలో కూడా దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగడంతో ఆయన సొంత పార్టీ సీపీఎన్-యూఎంఎల్ నాయకులు కూడా మండిపడ్డారు. ఒక మంత్రి పదవిలో ఉండి ఆయనలా ప్రవర్తించడం సరికాదని పార్టీ అధికార ప్రతినిధి ఒకరు అన్నారు. దాంతో మంత్రి హరిప్రసాద్ పరాజులి రాజీనామా లేఖ సమర్పించగా, దాన్ని ప్రధాని సుశీల్ కొయిరాలా వెంటనే ఆమోదించారు.