పోర్టును సందర్శించిన నేపాల్ బృందం
విశాఖపట్టణం: నేపాల్ ప్రభుత్వ ఆర్థిక మంత్రి కృష్ణ హరి పుష్కర్, రాయబారి కృష్ణప్రసాద్ ఢాకల్, ఇతర సభ్యులతో కలసి మంగళవారం విశాఖ పోర్టు ట్రస్ట్‌ను సందర్శించారు. పోర్టు డిప్యూటీ చైర్మన్ హరనాథ్ వీరికి సాదర స్వాగతం పలికారు.
అనంతరం జరిగిన సమావేశంలో నేపాల్‌కు కంటైనర్ల ద్వారా సరకు ఎగుమతులను ఏవిధంగా చేయవచ్చన్న విషయాన్ని చర్చించారు. విశాఖ పోర్టులో ఉన్న మౌలిక సదుపాయాలను హరనాథ్ నేపాల్ బృందానికి వివరించారు. స్టాక్ హోల్డర్స్, కస్టమ్స్, రైల్వే అధికారులతో జరిపిన చర్చలు తమకు సంతృప్తిని ఇచ్చాయని బృందం తెలియజేసింది.