శిఖర్ ధావన్ ధనాధన్ ఇన్నింగ్స్.. సిక్సర్ల వర్షం.. 51 బంతుల్లోనే..
టీమిండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ ప్రస్తుతం నేపాల్ ప్రీమియర్ లీగ్(ఎన్పీఎల్)తో బిజీగా ఉన్నాడు. ఎన్పీఎల్ ఆరంభ ఎడిషన్‌లో కర్నాలీ యాక్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న గబ్బర్.. బుధవారం నాటి మ్యాచ్‌లో సిక్సర్ల వర్షం కురిపించాడు.ధావన్ ధనాధన్ ఇన్నింగ్స్ కీర్తిపూర్ వేదికగా ఖాట్మండూ గుర్ఖాస్తో జరిగిన మ్యాచ్‌లో శిఖర్ ధావన్.. 51 బంతుల్లోనే 72 పరుగులతో అజేయంగా నిలిచాడు. గబ్బర్ ఇన్నింగ్స్‌లో ఐదు సిక్సర్లు, నాలుగు బౌండరీలు ఉండటం విశేషం. తొలుత బ్యాటింగ్ చేసిన కర్నాలీ యాక్స్.. ధావన్ ధనాధన్ ఇన్నింగ్స్ కారణంగా నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది.గబ్బర్ మెరుపుల వీడియో వైరల్అయితే, ఖాట్మండూ గుర్ఖాస్ బ్యాటర్ల విజృంభణ కారణంగా.. కర్నాలీ యాక్స్‌కు మూడు వికెట్ల తేడాతో ఓటమి తప్పలేదు. ఏదేమైనా ఈ మ్యాచ్‌లో శిఖర్ ధావన్ ఇన్నింగ్స్ హైలైట్‌గా నిలిచింది. గబ్బర్ పరుగుల విధ్వంసానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో అభిమానులను ఆకర్షిస్తోంది.ఎనిమిది జట్లుకాగా ఈ ఏడాది మొదలైన నేపాల్ ప్రీమియర్ లీగ్‌లో చిట్వాన్ రైనోస్, జనక్‌పూర్ బోల్ట్స్, సుదుర్పశ్చిమ్ రాయల్స్, ఖాట్మండూ గుర్ఖాస్, లుంబిని లయన్స్, కర్నాలీ యాక్స్, బీరట్‌నగర్ కింగ్స్, పొఖరా అవెంజర్స్ జట్లు పాల్గొంటున్నాయి. కర్నాలీ యాక్స్ ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్‌లలో రెండూ ఓడిపోయింది.ఇదిలా ఉంటే.. ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ నుంచి కూడా రిటైర్మెంట్ తీసుకున్నాడు శిఖర్ ధావన్. అనంతరం లెజెండ్స్ లీగ్‌లో భాగమైన గబ్బర్.. నేపాల్ లీగ్ క్రికెట్లోనూ ఆడుతున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో మూడు ఫార్మాట్లలో కలిపి పదివేలకు పైగా పరుగులు చేసిన 38 ఏళ్ల ధావన్.. 2013లో చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన టీమిండియాలో సభ్యుడు.చదవండి: వినోద్ కాంబ్లీని కలిసిన సచిన్.. చేయి వదలకుండా బిగించడంతో.. ఆఖరికి DHA-ONE HAS ARRIVED! 🌪️Shikhar Dhawan scored an unbeaten 72, including 5 huge sixes, powering Karnali Yaks to a competitive total 🤩#NPLonFanCode pic.twitter.com/lPVx9uUYPz— FanCode (@FanCode) December 4, 2024