Net investments
-
చిన్న షేర్ల పెద్ద ర్యాలీ
న్యూఢిల్లీ: దలాల్ స్ట్రీట్‌లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023 –24)లో రిటైల్ ఇన్వెస్టర్ల హవా కొనసాగింది. దేశంలో దృఢమైన స్థూల ఆర్థిక పరిస్థితులు, ఆకర్షణీయమైన కార్పొరేట్ త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో రిటైల్ ఇన్వెస్టర్లు చిన్న, మధ్య స్థాయి షేర్లును కొనేందుకు ఆధిక ఆసక్తి చూపారు. 2023–24లో బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 62%, స్మాల్ క్యాప్ సూచీ 60% రాణించాయి. ఇదే కాలంలో బీఎస్ఈ ప్రధాన సూచీ సెన్సెక్స్ 25% పెరిగింది. ‘‘ఆదాయాలు గణనీయంగా పెరగడం, అధిక వృద్ధి అవకాశాలతో రిటైల్ ఇన్వెస్టర్లు చిన్న, మధ్య తరహా షేర్లను కొనుగోలుకు ఆసక్తి చూపారు. లార్జ్ క్యాప్ షేర్ల పట్ల విముఖత చూపారు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో నికర పెట్టుబడులు పెరగడం ఇందుకు నిదర్శనం. ఆర్థిక విస్తరణ సమయంలో చిన్న, మధ్య తరహా షేర్ల వృద్ధి వేగంగా ఉంటుందనే సంప్రదాయ సూత్రాన్ని వారు విశ్వసించారు. అంతేకాకుండా స్మాల్, మిడ్ సైజ్ కంపెనీల అద్భుతమైన త్రైమాసిక ఫలితాలు వారిని కొనుగోళ్ల వైపు ఆకర్షితం చేశాయి’’ అని హెడ్జ్ ఫండ్ హెడోనోవా సీఐఓ సుమన్ బెనర్జీ తెలిపారు. ► 2023–24లో బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ ఫిబ్రవరి 8న 40,282 వద్ద జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. గతేడాది మార్చి 31న 23,881 వద్ద ఏడాది కనిష్టానికి తాకింది. ► ఇదే కాలంలో బీఎస్ఈ స్మాల్ క్యాప్ సూచీ ఫిబ్రవరి 7న 46,821 వద్ద ఆల్‌టైం హైని నమోదు చేయగా, గతేడాది మార్చి 31న 26,692 వద్ద 52 వారాల కనిష్టాన్ని తాకింది. ► సెన్సెక్స్‌తో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చిన్న, మధ్య స్థాయి షేర్ల అత్యుత్తమ ప్రదర్శన భారత ఈక్విటీ మార్కెట్ క్రియాశీలక స్వభావాన్ని, ఇన్వెస్టర్ల అపార వృద్ధి అవకాశాలను ప్రతిబింబిస్తుందని స్వస్తిక ఇన్వెస్ట్‌మార్ట్ లిమిటెడ్ ఎండీ సునీల్ న్యాతీ తెలిపారు. ► వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ చిన్న, మధ్య తరహా షేర్ల ర్యాలీ కొనసాగుతుందని న్యాతీ అభిప్రాయపడ్డారు. ‘‘సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత ప్రభుత్వమే తిరిగి అధికారాన్ని దక్కించుకోవచ్చనే అంచనాలతో వ్యాపార అనుకూల వాతావరణం పెంపొంది స్థిరమైన వృద్ధి కొనసాగొచ్చు. దీనికి తోడు భారత వృద్ధి బలమైన అవుట్‌లుక్ అంచనాలు ఈ రంగాల షేర్లకు డిమాండ్‌ను పెంచుతాయి’’ న్యాతీ తెలిపారు. అయితే కేంద్ర బ్యాంకుల వడ్డీ రేట్ల పెంపు, అంతర్జాతీయ అనిశి్చతులు, లాభాల స్వీకరణ వంటి అంశాలు స్వల్పకాలిక ఒడిదుడుకులకు దారితీయొచ్చన్నారు. ఐపీవో బాటలో ఆఫ్కన్స్ ఇన్ఫ్రా ఆఫ్కన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పబ్లి క్ఇష్యూ బాట పట్టింది. సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఈ షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ కంపెనీ ఐపీవోతో రూ. 7,000 కోట్లు సమకూర్చుకోనుంది. రూ. వెయ్యి కోట్లకు జిరోధా ఫండ్ విలువ జిరోధా, స్మాల్‌కేస్ జేవీ జిరోధా ఫండ్ హౌస్ నిర్వహణలోని ఆస్తుల విలువ కేవలం 40 రోజుల్లో రూ. 500 కోట్ల మేర ఎగిసింది. దీంతో సంస్థ ఏయూఎం రూ. 1,000 కోట్ల మార్కును దాటింది. -
ఈక్విటీ ఫండ్స్‌లోకి జోరుగా పెట్టుబడులు
న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ జనవరిలో పెద్ద మొత్తంలో పెట్టుబడులను ఆకర్షించాయి. ఈక్విటీ పథకాల్లోకి రెండేళ్ల గరిష్ట స్థాయిలో రూ.21,780 కోట్ల నికర పెట్టుబడులు వచ్చాయి. స్మాల్‌క్యాప్ ఫండ్స్, థీమ్యాటిక్ ఫండ్స్ పట్ల ఇన్వెస్టర్లు మొగ్గు చూపించారు. ఫోకస్డ్ ఫండ్స్ మినహా మిగిలిన అన్ని ఈక్విటీ విభాగాలు పెట్టుబడులను ఆకర్షించాయి. 2023 డిసెంబర్ నెలలో వచి్చన రూ.16,997 కోట్లతో పోల్చి చూసినప్పుడు 28 శాతం అధికంగా పెట్టుబడులు వచి్చనట్టు తెలుస్తోంది. చివరిగా 2022 మార్చి నెలలో రూ.28,443 కోట్లు ఈక్విటీ ఫండ్స్‌లోకి రాగా, ఇప్పటి వరకు అదే గరిష్ట రికార్డుగా కొనసాగింది. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్)కు ఆదరణ కొనసాగుతోంది. సిప్ ద్వారా వచ్చే పెట్టుబడులు ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి అయిన రూ.18,838 కోట్లకు చేరాయి. డిసెంబర్ నెలలో వచి్చన సిప్ పెట్టుబడులు రూ.17,610 కోట్లను అధిగమించాయి. జనవరి నెలకు సంబంధించిన గణాంకాలను మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) విడుదల చేసింది. కొత్తగా 51.84 లక్షల సిప్ ఖాతాలు ప్రారంభమయ్యాయి. దీంతో మొత్తం సిప్ ఖాతాలు జనవరి చివరికి 7.92 కోట్లకు పెరిగాయి. ‘‘జనవరిలో అస్థిరతలు ఉన్నప్పటికీ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ బలమైన పనితీరు చూపించాయి. మార్కెట్ ఆటుపోట్లలోనూ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పట్ల ఇన్వెస్టర్లు స్థిరమైన విశ్వాసాన్ని కొనసాగించడం, దీర్ఘకాలంలో సంపద సృష్టి దిశగా వారి నిబద్ధతను తెలియజేస్తోంది’’అని బ్రోకరేజీ సంస్థ ‘ప్రభుదాస్ లీలాధర్’ ఇన్వెస్ట్మెంట్ సరీ్వసెస్ హెడ్ పంకజ్ శ్రేష్ట పేర్కొన్నారు. జనవరిలో మూడు కొత్త ఈక్విటీ పథకాలు (ఎన్‌ఎఫ్‌వోలు) సంయుక్తంగా రూ.967 కోట్లను సమీకరించినట్టు మారి్నంగ్ స్టార్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ ఇండియా అనలిస్ట్ మెలి్వన్ శాంటారియా తెలిపారు. విభాగాల వారీగా.. ► థీమ్యాటిక్ ఫండ్స్‌లోకి రూ.4,805 కోట్లు, స్మాల్‌క్యాప్ ఫండ్స్‌లోకి రూ.3,257 కోట్ల చొప్పున పెట్టుబడులు వచ్చాయి. డిసెంబర్ నెలతో పోల్చి చూసినప్పుడు స్మాల్‌క్యాప్ ఫండ్స్‌లోకి రూ.600 కోట్ల పెట్టుబడుల రాక తగ్గింది. ► మల్టీక్యాప్ ఫండ్స్‌లోకి రూ.3,039 కోట్లు వచ్చాయి. ► లార్జ్‌క్యాప్ ఫండ్స్ రూ.1,287 కోట్లు ఆకర్షించాయి. 19 నెలల తర్వాత ఇదే గరిష్ట స్థాయి. డిసెంబర్ నెలలో లార్జ్‌క్యాప్ ఫండ్స్ రూ.281 కోట్ల పెట్టుబడులను కోల్పోవడం గమనార్హం. ► డెట్ ఫండ్స్ రూ.76,469 కోట్ల పెట్టుబడులను రాబట్టాయి. డిసెంబర్ నెలలో ఇదే విభాగం రూ.75,560 కోట్ల పెట్టుబడులను కోల్పోవడం గమనార్హం. ► డెట్ విభాగంలో అత్యధికంగా లిక్విడ్ ఫండ్స్‌లోకి రూ.49,468 కోట్లు, మనీ మార్కెట్ ఫండ్స్‌లోకి రూ.10,651 కోట్ల చొప్పున పెట్టుబడులు వచ్చాయి. ► గోల్డ్ ఈటీఎఫ్ పథకాలలో ఇన్వెస్టర్లు రూ.657 కోట్ల మేర పెట్టుబడులు పెట్టారు. ► మొత్తం మీద మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ జనవరి నెలలో రూ.1.23 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. గత డిసెంబర్లో రూ.40,685 కోట్ల పెట్టుబడులను కోల్పోవడంతో పోలిస్తే పరిస్థితి పూర్తిగా మారింది. ► మ్యూచువల్ ఫండ్స్ సంస్థల నిర్వహణలోని ఆస్తుల విలువ డిసెంబర్ చివరికి ఉన్న రూ.50.78 లక్షల కోట్ల నుంచి రూ.52.74 లక్షల కోట్లకు పెరిగింది. బంగారంలో హెడ్జింగ్.. ‘‘మిడ్‌క్యాప్ స్టాక్స్ 15 శాతం, స్మాల్‌క్యాప్ స్టాక్స్ 20 శాతం మేర ప్రీమియం వ్యాల్యూషన్లలో ఉన్నాయి. దీంతో ఇన్వెస్టర్లు లార్జ్‌క్యాప్ స్టాక్స్‌లో విలువల అంతరాన్ని గుర్తించారు. అందుకు తగ్గట్టు పెట్టుబడుల్లో మార్పులు చేసుకున్నారు’’అని ఫైయర్స్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ గోపాల్ కావలిరెడ్డి తెలిపారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికాలో ద్రవ్యోల్బణం ఇప్పటికీ అధికంగా ఉండడంతో బంగారం సురక్షిత సాధనంగా, ద్రవ్యోల్బణానికి మంచి హెడ్జింగ్ సాధనంగా కొనసాగుతుందని మెలి్వన్ శాంటారియా పేర్కొన్నారు. -
ఈక్విటీలకు దేశీ ఇన్వెస్టర్ల మద్దతు
న్యూఢిల్లీ: ఈక్విటీ మార్కెట్లకు దేశీ నిధుల మద్దతు దండిగా ఉంది. ఇందుకు నిదర్శనంగా మే నెలలోనూ ఈక్విటీ ఫండ్స్ రూ.18,529 కోట్ల మేర నికర పెట్టుబడులను ఆకర్షించాయి. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో వచ్చిన రూ.15,890 కోట్ల కంటే మరింత అధికంగా వచ్చాయి. మే నెలకు సంబంధించి మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడుల గణాంకాలను మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ (యాంఫి) విడుదల చేసింది. 2021 మార్చి నెల నుంచి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ప్రతి నెలా నికరంగా పెట్టుబడులను ఆకర్షిస్తూనే ఉన్నాయి. అంతకుముందు వరుసగా ఎనిమిది నెలల కాలంలో నికరంగా పెట్టుబడులు బయటకు వెళ్లాయి. అన్ని విభాగాల్లోకి.. ► మే నెలలో ఈక్విటీలోని అన్ని విభాగాల్లోకి పెట్టుబడులు ప్రవహించాయి. ఫ్లెక్సీ క్యాప్ విభాగంలోకి అత్యధికంగా రూ.2,939 కోట్లు వచ్చాయి. ► లార్జ్‌క్యాప్, లార్జ్ అండ్ మిడ్‌క్యాప్, సెక్టోరల్ ఫండ్స్‌లోకి రూ.2,200 కోట్లు, అంతకుమించి పెట్టుబడులు వచ్చాయి. ► ఇండెక్స్ ఫండ్స్, ఇతర ఈటీఎఫ్‌లు రూ.11,779 కోట్ల పెట్టుబడులను రాబట్టాయి. ► గోల్డ్ ఈటీఎఫ్‌లు రూ.203 కోట్లను ఆకర్షించాయి. ► డెట్ విభాగం నుంచి నికరంగా రూ.32,722 కోట్లను ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకున్నారు. అంతకుముందు నెల ఏప్రిల్‌లో రూ.69,883 కోట్ల పెట్టుబడులు రావడం గమనార్హం. ► అన్ని విభాగాలు కలిపితే ఇన్వెస్టర్లు మ్యూచువల్ ఫండ్స్ నుంచి రూ.7,532 కోట్లను నికరంగా వెనక్కి తీసేసుకున్నారు. ఏప్రిల్‌లో నికర పెట్టుబడుల రాక రూ.72,846 కోట్లుగా ఉంది. ► మ్యూచువల్ ఫండ్స్ సంస్థల నిర్వహణలోని మొత్తం ఆస్తులు (ఏయూఎం) ఏప్రిల్ చివరికి ఉన్న రూ.38.89 లక్షల కోట్ల నుంచి మే చివరికి రూ.37.37 లక్షల కోట్లకు క్షీణించింది. సిప్ కళ..: సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో వచ్చిన పెట్టుబడులు ఈ ఏడాది ఏప్రిల్‌లో రూ.11,863 కోట్లు కాగా>, మే నెలలో రూ.12,286 కోట్లకు పెరిగాయి. రిటైల్ ఇన్వెస్టర్లు అనిశ్చితుల్లోనూ ఈక్విటీల పట్ల నమ్మకాన్ని చూపిస్తున్నారని చెప్పడానికి ఈ గణాంకాలు నిదర్శనంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. నెలవారీ సిప్ పెట్టుబడులు రూ.10వేల కోట్లకు పైన రావడం వరుసగా ఇది తొమ్మిదో నెల కావడాన్ని గమనించాలి. -
విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు పెరుగుతాయ్
న్యూఢిల్లీ: గత ఫిబ్రవరి నెలలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐలు) భారత్ క్యాపిటల్ మార్కెట్లో రూ. 24,500 కోట్ల నికర పెట్టుబడులు చేశారు. వివాదాస్పద పన్ను అంశామై గార్‌ను కేంద్ర బడ్జెట్లో వాయిదావేయడంతో మార్కెట్లోకి విదేశీ పెట్టుబడుల ప్రవాహం పెరుగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గార్ వాయిదాతో దేశంలో వ్యాపార విశ్వాసం మెరుగుపడుతుందని, ఈ నిర్ణయం విదేశీ పెట్టుబడుల్ని ఆకర్షించడానికి దోహదపడుతుందని రెలిగేర్ ఎం టర్‌ప్రైజెస్ చైర్మన్ సునీల్ గోద్వాని చెప్పారు. దేశీయ స్టాక్, డెట్ మార్కెట్లలో ఫిబ్రవరి పెట్టుబడులతో కలిపి ఈ ఏడాది తొలి రెండు నెలల్లో ఎఫ్ఐఐల పెట్టుబడులు రూ. 33,688 కోట్లకు చేరాయి. ఫిబ్రవరి నెలలో వారు రూ. 11,475 కోట్లు షేర్ మార్కెట్లోనూ, రూ. 13,088 కోట్లు రుణ పత్రాల్లోనూ పెట్టుబడి చేసినట్లు నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గార్ వాయిదా విదేశీ ఇన్వెస్టర్లకు, మొత్తంగా ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌కు పెద్ద అనుకూల ప్రతిపాదన అని రిలయన్స్ మ్యూచువల్ ఫండ్ సీఈఓ సందీప్ సిక్కా అన్నారు.