యువతకు ఉచిత కంప్యూటర్ శిక్షణ
వికారాబాద్ రూరల్ : జిల్లాలోని పదో తరగతి, ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన 18 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాలలోపు వారందరికీ ఉచిత కంప్యూటర్ శిక్షణ ఇస్తామని నెట్వల్డ్ సోల్యూషన్ నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో కంప్యూటర్కు సంబంధించి వివిధ రకాల కోర్సులు అందుబాటులో ఉంటాయన్నారు. పట్టణంలోని రామయ్యగూడ రోడ్డులో ఉండే ఈ కంప్యూటర్ శిక్షణ కేంద్రానికి వచ్చి చేరాలన్నారు. మరిన్ని వివరాలకు సెల్: 91773 83102, 90636 58771లలో సంప్రదించాలన్నారు.