అమెరికా స్టార్టప్లోకి రిలయన్స్ రూ.107 కోట్లు
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీ అమెరికాకు చెందిన టెక్నాలజీ స్టార్టప్ ‘నేత్రాడీనె’లో దాదాపు రూ.107 కోట్ల మేర పెట్టుబడులు పెట్టింది. తమ అనుబంధ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇన్వెస్ట్మెంట్ అండ్ హోల్డింగ్స్.. నేత్రాడీనెలో రూ.107 కోట్ల మేర ఇన్వెస్ట్ చేసిందని రిలయన్స్ ఇండస్ట్రీస్ బీఎస్ఈకి నివేదించింది. మే 30 నాటికి సగ భాగం చెల్లింపులు నిర్వహించామని, మిగతా బ్యాలెన్స్‌ను వచ్చే ఏడాది ఇదే సమయానికి పూర్తి చేస్తామని వివరించింది. ఈ ఇన్వెస్ట్మెంట్ ద్వారా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇన్వెస్ట్మెంట్ అండ్ హోల్డింగ్స్.. నేత్రాడీనెలో 40 శాతం వాటాను (1.50 కోట్ల షేర్లు)ను పొందనున్నది.