స్నేహం విలువ...
ఆనంద్, కావ్యశ్రీ, అంజలి, ‘జబర్దస్త్’ ఆది, ‘షేకింగ్’ శేషు ప్రధాన పాత్రల్లో తెరకెక్కనున్న చిత్రం ‘నేటి ఆకలిరాజ్యం’. శ్రీభాగ్య దర్శకత్వంలో మంజులా భాగ్యలక్ష్మి, ఎమ్.శ్యామల సంయుక్తంగా నిర్మించనున్నారు.
దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘కృషి, పట్టుదల, ఏకాగ్రతలతో తాము అనుకున్న లక్ష్యాన్ని యువత ఎలా సాధించగలరు? స్నేహ సంబంధాలు మరచిపోయి కేవలం డబ్బే ప్రధానం అనుకుని జీవించే యువతకి నిజమైన స్నేహం విలువ ఏంటి? అనే అంశాలను మా సినిమాలో చూపించనున్నాం. యువతరంతో పాటు అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చేలా రూపొందిస్తాం. ఈ నెలాఖరున చిత్రీకరణ మొదలవుతుంది’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: రామ్ పినిశెట్టి, మాటలు: మోహన్.