బజాజ్.. కొత్త అవెంజర్ బైక్‌లు
* మార్కెట్లోకి మూడు కొత్త వేరియంట్లు
* రూ.85,000 రేంజ్లో ధరలు
ముంబై: బజాజ్ ఆటో కంపెనీ తన స్పోర్ట్స్ బైక్ బ్రాండ్, అవెంజర్స్‌లో మూడు కొత్త వేరియంట్లను మంగళవారం మార్కెట్లోకి తెచ్చింది. వీటి ధరలు రూ.85,000 వరకూ ఉన్నాయి. మూడు కొత్త వేరియంట్లు-అవెంజర్ క్రూయిజ్ 220, స్ట్రీట్ 220, స్ట్రీట్ 150లు లీజర్ బైకింగ్ సెగ్మెంట్‌కు చెందిన బైక్‌లని బజాజ్ ఆటో తెలిపింది. స్పోర్ట్స్ బైక్‌లలో ఈ లీజర్ బైక్‌ల సెగ్మెంట్ జోరుగా వృద్ధి సాధిస్తోందని బజాజ్ ఆటో ప్రెసిడెంట్(మోటార్ సైకిల్ బిజినెస్) ఎరిక్ వాస్ చెప్పారు.
220 సీసీ బైక్‌ల ధరలు రూ.84,000, 150 సీసీ బైక్‌ల ధరలు రూ.79,000 (అన్ని ధరలు ఎక్స్‌షోరూమ్) రేంజ్లో ఉన్నాయని పేర్కొన్నారు. అవెంజర్ బైక్‌లను నెలకు 20,000 వరకూ విక్రయించగలమని ఆశిస్తున్నామని చెప్పారు. నెలకు 2.5 లక్షల స్పోర్ట్స్ బైక్‌లు అమ్ముడవుతున్నాయని అంచనా.
కొత్త అవెంజర్ బైక్‌ను మంగళవారం ముంబైలో విడుదల చేస్తున్న బజాజ్ ఆటో ప్రెసిడెంట్ ఎరిక్ వాస్