new bars
-
3 బార్లకు 3 దరఖాస్తులే.. ఆ 10 బార్ల పై ఆరా..?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని కొత్త మున్సిపాలిటీల్లో బార్ల ఏర్పాటు కోసం ఎక్సైజ్ శాఖ చేపట్టిన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం చర్చనీయాంశమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో వెల్లువలా దరఖాస్తులు వ చ్చినా కేవలం నిజామాబాద్ కార్పొరేషన్, బోధన్ మున్సిపాలిటీలో నోటిఫై చేసిన బార్లకు చాలా తక్కువ దరఖాస్తులు రావడం ఇప్పుడు ఎక్సైజ్ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలో కొత్తగా 7 బార్లను నోటిఫై చేస్తే అక్కడ కేవలం 10 దరఖాస్తులే వచ్చాయి. ఇక బోధన్ మున్సిపాలిటీలో అయితే 3 బార్లకు గాను 3 దరఖాస్తులే వచ్చాయి. కానీ, రాష్ట్రంలోని ఇతర మున్సిపాలిటీల్లో మాత్రం వందల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా 72 మున్సిపాలిటీల్లోని 159 కొత్త బార్లకు నోటిఫికేషన్ ఇస్తే 7,400 వరకు దరఖాస్తులు రావడం గమనార్హం. ఈ పరిస్థితుల్లో నిజామాబాద్, బోధన్‌లలో చాలా తక్కువగా ఎందుకు దరఖాస్తులు వచ్చాయన్న దానిపై ఎక్సైజ్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ ఆ శాఖ ఉన్నతాధికారుల వద్ద ఆరా తీసినట్టు తెలిసింది. నిజామాబాద్‌లో 7 బార్లకు గాను చివరిరోజు వరకు ఒక్కటే దరఖాస్తు వచ్చిందని, చివరి రోజు కూడా 9 మాత్రమే ఎలా వచ్చాయని, అలాగే బోధన్‌లో అయితే మూడు బార్లకు చివరిరోజే మూడు దరఖాస్తులు రావడం ఎలా సాధ్యమైందని ఆయన అంతర్గతంగా పరిశీలన జరుపుతున్నట్టు సమాచారం. కాగా, ఇక్కడ తక్కువ దరఖాస్తులు రావడానికి సిండికేట్ కారణమైందని తెలుస్తోంది. ఇక రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా నోటిఫై అయిన బార్లకు దరఖాస్తు చేసుకునే గడువును ఈ నెల 16 వరకు పొడిగించారు. ఇక ఈ నెల 19న లాటరీలు తీసి.. అందులో వచ్చిన వారికి 25వ తేదీన కేటాయిస్తారని ఎక్సైజ్ వర్గాలు వెల్లడించాయి. చదవండి: సముద్రం నీరూ తాగొచ్చు! -
మందుబాబులకు గుడ్‌న్యూస్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో కొత్త బార్లు రానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 72 మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 159 బార్లకు ఎక్సైజ్ శాఖ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ సోమవారం నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం జీహెచ్ఎంసీ పరిధిలో 55, పట్టణ ప్రాంతాల్లో 104 బార్లు కొత్తగా ఏర్పాటు కానున్నాయి. ఇందుకు సోమవారం నుంచే దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అదేరోజు జిల్లా ఎక్సైజ్ అధికారులు ఈ నోటిఫికేషన్ జారీ చేసి దరఖాస్తులు వచ్చే నెల 8వ తేదీ వరకు తీసుకుంటారు. లాటరీ పద్ధతి ఫిబ్రవరి 10న ఆయా జిల్లాల కలెక్టర్లు లాటరీ పద్ధతిన బార్లు కేటాయిస్తారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఎక్సైజ్ కమిషనర్ 11న డ్రా తీస్తారు. బార్లు పొందిన వారి జాబితాను అదే నెల 12న ఆయా జిల్లాల డిప్యూటీ కమిషనర్లు.. ఎక్సైజ్ కమిషనర్‌కు పంపనుండగా, 13న జీహెచ్ఎంసీ జాబితాను పంపుతారు. అదే నెల 17న లాటరీ వచ్చిన వారికి జిల్లా అధికారులు బార్లు కేటాయించనున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోనైతే కమిషనర్ కార్యాలయంతో పాటు రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి డీసీ కార్యాలయాల్లో, రాష్ట్రంలోని మిగిలిన పట్టణ ప్రాంతాల్లో మాత్రం జిల్లా ఎక్సైజ్ కార్యాలయంతో పాటు డిప్యూటీ కమిషనర్, కమిషనర్ కార్యాలయాల్లో కొత్త బార్ల ఏర్పాటుకు దరఖాస్తులు లభ్యమవుతాయని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. దరఖాస్తు ఫీజు కింద రూ.లక్ష వసూలు చేయనున్నారు. గతంలో ఉన్న 1,030 బార్లకు అదనంగా కొత్త మున్సిపాలిటీల్లో మరో 159 ఏర్పాటు కానున్నాయి. దరఖాస్తు సులభం ఈసారి బార్ల కోసం దరఖాస్తు చేసుకునే విధానాన్ని సులభం చేసింది. ఒక్క పేజీలోనే ఎక్సైజ్ శాఖ దరఖాస్తును తయారుచేసింది. మూడు కలర్ పాస్‌పోర్టు ఫొటోలు, స్వీయ ధ్రువీకరణతో కూడిన పాన్‌కార్డు లేదా ఆధార్‌కార్డు మాత్రమే దరఖాస్తు సమయంలో సమర్పించాల్సి ఉంటుంది. బార్ల లాటరీ పూర్తయ్యాక మాత్రం 90 రోజుల్లోగా ఎక్సైజ్ శాఖ నిర్దేశించిన అన్ని నిబంధనలను పూర్తి చేయాల్సి ఉంటుంది. లేదంటే మరో 60 రోజులు గ్రేస్ పీరియడ్ ఉంటుంది. కానీ ఈ కాలానికి మొదటి వాయిదా లైసెన్స్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. నిబంధనలు అన్నీ పూర్తి చేసిన తర్వాతే బార్ లైసెన్స్ ఇస్తామని ఎక్సైజ్ శాఖ స్పష్టం చేసింది. -
కొత్త బార్లకు గ్రీన్ సిగ్నల్
నల్లగొండ : ఎక్సైజ్ శాఖ కొత్తబార్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జనాభా ప్రాతిపదిక న ఇప్పుడున్న వాటికి అధనంగా కొత్త బార్లు ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం లభించింది. గ్రేటర్ హైదరాబాద్‌లో 13 వేల జనాభాకు, పట్టణాలు, నగరపంచాయతీల్లో 25 వేల జనాభాకు ఒక బారు చొప్పున ఏర్పాటు చేసేలా మార్గదర్శకాలు రూపొం దించారు. దీని ప్రకారం మూడు జిల్లాల్లో కలిపి కొత్తగా 8 బార్లు మంజూరు చేశారు. నల్లగొండ మున్సిపాలిటీలో నాలుగు, దేవరకొండ నగరపంచాయతీలో రెండు, హుజూర్‌నగర్‌లో రెండు బార్లకు అనుమతి ఇచ్చారు. మిర్యాలగూడ, సూర్యాపేట, భువనగిరిలో జనాభాకు మించి ఎక్కువగానే బార్లు ఉన్నాయి. కోదాడ మున్సిపాలిటీలో గతంలో మంజూరు చేసిన మూడు బార్లకు ఉన్న అడ్డం కులు తొలగిపోయాయి. త్వరలో కోదాడ బార్లకు సంబంధించి ఎక్సైజ్ శాఖ డ్రా ద్వారా లెసైన్స్ దారులను ఎంపిక చేయనుంది. కొత్తగా మంజూరైన ఏడు బార్లకు మాత్రం ఎక్సైజ్ నోటిఫికేషన్ జారీ చేసింది. -
ఏపీలో వచ్చే నెలలో బార్ల వేలం
హైదరాబాద్: ఏపీలో కొత్త బార్ పాలసీ ప్రకటించేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. అక్టోబరులో నూతన బార్లకు నోటిఫికేషన్ జారీ చేసి లాటరీ విధానంలోనే అప్పగించేందుకు ఎక్సైజ్ శాఖ చేస్తున్న కసరత్తు తుది దశకు చేరుకున్నట్లు సమాచారం. జనాభా ప్రాతిపదికన మూడు శ్లాబుల్లో నూతన బార్లకు లైసెన్సు ఫీజు చెల్లించాలని అబ్కారీ శాఖ యోచిస్తున్నట్లు సమాచారం. గత ఏడాది జూలై నుంచి నెల నెలా బార్ల లెసైన్సుల రెన్యువల్తోనే ఎక్సైజ్ శాఖ నెట్టుకొస్తుంది. రాష్ట్రంలో 771 బార్లకు కొత్త పాలసీ ప్రకటించేందుకు గతేడాది జూలైలో ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే పాలసీలో పలు లోపాలు వెలుగు చూడటంతో పాటు అధికార పార్టీ నేతలకు అనుకూలంగా ఉండటంతో కొందరు మద్యం వ్యాపారులు కోర్టునాశ్రయించిన సంగతి తెలిసిందే. గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతానికి చెందిన టీడీపీ ముఖ్యనేత తనయుడు రెండు నియోజకవర్గాల్లో కొత్త బార్లకు దరఖాస్తు చేసుకునేవారంతా తనకు ముడుపులు చెల్లించాలని ఒత్తిళ్లు చేయడం, మాట వినని మద్యం వ్యాపారులపై మున్సిపాలిటీ అధికారులను అడ్డుపెట్టుకుని ఇబ్బందులు పెట్టటంతో వారంతా కోర్టుకు వెళ్లారు. కోర్టు కూడా ప్రభుత్వ పాలసీని తప్పు పట్టింది. ఫస్ట్ కమ్ ఫస్ట్ విధానంలో పాలసీ రూపొందించడంపై కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో ఎక్సైజ్ శాఖ సవరణ జీవోలు జారీ చేసింది. తాజాగా బార్ల పాలసీకి బూజు దులిపి కొత్త మార్గదర్శకాలు జారీ చేయాలని ఉన్నత స్థాయిలో ఆదేశాలందడంతో లాటరీ విధానమైతేనే మేలని ఎక్సైజ్ అధికారులు భావిస్తున్నారు. -
తలుపులు బార్లా..!
30 వేల జనాభాకో కొత్త బారు పాత విధానాలకు స్వస్తి చెప్పిన ఆబ్కారీ శాఖ దుకాణాల ప్రకారం కాకుండా జనాభా ప్రాతిపదికన.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం నల్లగొండ : కొత్త బార్లు అనుమతికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పాత విధానాలకు స్వస్తి చెప్పి బార్ల పాలసీలో మార్పులు చేసింది. నూతన పాలసీ ప్రకారం.. జిల్లాలో కొత్తగా 8 బార్లు ఏర్పాటు చేసుకునే అవకాశం వ్యాపారులకు లభించింది. గతంలో పట్టణాల్లో మద్యం దుకాణాలను అంచనా వేసి బార్లు అనుమతి ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. దీంతో పట్టణాల్లో బార్ల సంఖ్య చాలా పరిమితంగా ఉంది. మద్యం దుకాణాలకు పోటీగా బార్లు అనుమతివ్వడం ద్వారా ఆ ప్రభావం దుకాణాలఅమ్మకాలపై పడే అవకాశం ఉంటుంది కాబట్టి దానిని దృష్టిలో పెట్టుకుని కొత్త బార్లుకు అనుమతి ఇచ్చేవారు కాదు. కానీ ప్రస్తుతం పాత పాలసీ రద్దు చేసి జనాభా ప్రాతిపదికన బార్లు ఏర్పాటు చేసుకోవచ్చుని అనుమతి ఇచ్చింది. ఈ మేరకు బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో 30 వేల జనాభా దాటిన ప్రాంతాల్లో కొత్తగా బార్లు ఏర్పాటు చేయాలని పేర్కొంది. జిల్లాలో కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీ కోదాడలో, నగర పంచాయతీలు హుజూర్నగర్, దేవరకొండలలో బార్లు బార్లాగా తలుపులు తెరుచుకోనున్నాయి. పెరగనున్న బార్లు... జిల్లాలో ప్రస్తుతం బార్లు 21 ఉన్నాయి. మిర్యాలగూడ ఈఎస్ పరిధిలో 7, నల్లగొండ ఈఎస్ పరిధిలో 14 బార్లు ఉన్నాయి. మిర్యాలగూడ పరిధిలో కోదాడ మున్సిపాలిటీలో రెండు బార్లు, హుజూర్నగర్, దేవరకొండలో ఒక్కో బారు కొత్తగా ఏర్పాటు కానున్నాయి. ఇక నల్లగొండ ఈఎస్ పరిధిలో భువ నగిరి, సూర్యాపేటలో ఇప్పటికే జనాభాకు మించి బార్లు ఉండడంతో కొత్త బార్లకు అవకాశం లేదు. కానీ నల్లగొండ మున్సిపాలిటీలో జనాభా 1.65 లక్షలు ఉన్నందున ఇక్కడ కొత్తగా మూడు బార్లు రానున్నాయి. దీంతో పట్టణంలో బార్లు సంఖ్య ఐదుకు చేరనుంది. జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే మొత్తం బార్లు సంఖ్య 29కి చేరనుంది. నిబంధనలు ఇవీ.. కొత్తగా బార్లు ఏర్పాటు చేయాలనుకునే వారి కి ఇప్పటికే రెస్టారెంట్ నిర్వహిస్తూ ఉండాలి. ట్రేడ్ లెసైన్స్‌తో పాటుగా వరుసగా రెండేళ్ల పాటు వ్యాట్ చెల్లించినట్లు ఆధారాలు ఉండా లి. ఏడాది కాలపరిమితితో బార్లు అనుమతి ఇస్తారు. ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు వ చ్చిన ట్లయితే డ్రా విధానం ద్వారానే లెసైన్స్ లు జారీ చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.5వేలు. నగర పంచాయతీలు, మున్సిపాలిటీల్లో లెసై న్స్ఫీజు రూ.28లక్షలు నిర్ణయించారు.