డీఎస్ఓ బాధ్యతల స్వీకరణ
కాకినాడ సిటీ :
జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి (డీఎస్ఓ)గా నియమితులైన వేమూరి రవికిరణ్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు డీఎస్‌ఓగా పనిచేసిన జి.ఉమామహేశ్వరరావు అనంతపురం బదిలీ అయిన విషయం తెలిసిందే. విజయవాడ డీఎస్వోగా పనిచేస్తూ జిల్లాకు వచ్చిన రవికిరణ్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం కలెక్టర్ అరుణ్‌కుమార్, జాయింట్ కలెక్టర్ సత్యనారాయణలను మర్యాదపూర్వకంగా కలిసారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాలను అమలు చేస్తూ ప్రజాపంపిణీ వ్యవస్థను పటిష్టంగా ముందుకు తీసుకువెళ్తానన్నారు. ప్రధానంగా నగదురహిత సేవలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించనున్నట్టు తెలిపారు.