మాజీ ప్రధానికి జాబ్ ఆఫర్.. 314 కోట్ల శాలరీ!
సాధారణంగా ప్రధానమంత్రి పదవి నుంచి దిగిపోయిన వారు ఏ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలో చేసుకుంటారు. లేదా రిటైరయి కాలక్షేపం చేస్తారు. కానీ బ్రెగ్జిట్ దెబ్బకు బ్రిటన్ ప్రధాని పదవిని కోల్పోయిన డేవిడ్ కామెరాన్ ఒక్కసారిగా ఖాళీగా మారిపోయారు. ఎంపీగా కొనసాగాలని, వచ్చే ఏడాది కూడా ఎన్నికల్లో పోటీ చేయాలని ఆయన భావిస్తున్నప్పటికీ.. ఆయనకు మాత్రం ఇతర జాప్ ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి.
అందులో ఒకింత వికృతమైన, విస్మయం కలిగించే ఆఫర్ ఆయనకు వచ్చింది. తమ దేశ 'సుల్తాన్'గా ఉండాలని, అందుకు ఏడాదికి 32మిలియన్ పౌండ్లు (రూ. 314,49 కోట్లు) జీతం ఇస్తామని కజికిస్థాన్ ఆఫర్ చేసింది. అయితే, ఈ పదవికి అర్హుడిగా మారాలంటే ముస్లింల మాదిరిగా 'సుంతి' చేయించుకోవాలని సూచించింది. ఈమేరకు నేరుగా కామెరాన్ కార్యాలయానికి జాబ్ ఆఫర్ను పంపించడం గమనార్హం.
ముస్లిం యూనియన్ అయిన కజకిస్తాన్ ఇలాంటి వ్యంగ్య ప్రహసనాలతో గతంలోనూ వార్తల్లో నిలిచింది. కజకిస్తాన్ నియంత పాలకుడు మురాత్ తెలిబెకోవ్ గతంలోనూ ఇలాంటి వ్యంగ్యోక్తులతో మీడియా దృష్టిని ఆకర్షించారు. దేశాధ్యక్షుడి వయస్సు 80 ఏళ్లు దాటితే ఉరితీయాలని, లంచాన్ని చట్టబద్ధం చేయాలంటూ 76 ఏళ్ల తెలిబెకోవ్ గతంలో పేర్కొన్నారు. మరోవైపు ప్రస్తుతం ఎంపీగా కామెరాన్ అందుకుంటున్న వేతనం 74వేల పౌండ్లు మాత్రమే కాబట్టి ఆయన ఈ జాబ్ చేపడితే బాగుంటుందని ఆయన ప్రత్యర్థులు ఛలోక్తులు విసురుతున్నారు.