ఒకే కుటుంబంలో ముగ్గురి అదృశ్యం
పెదగంట్యాడ : యారాడకు చెందిన ఒకే కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు కనిపించడం లేదని న్యూ పోర్ట్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. వివరాల్లోకి వెలితే... యారాడకు చెందిన మరుపల్లి పైడిరాజు తన కొడుకు, కోడలు, మనవడు కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. కొడుకు సత్యనారాయణ(35), కోడలు అనిత(30), మనవడు హరీష్(4) ఈ నెల 20న విజయనగరంలో ఉన్న బంధువుల ఇంటికి బయలుదేరారు.అయితే రాత్రయినా అక్కడకు చేరుకోలేదని, ఫోన్ చేసినా సమాధానం లేదని, మూడు రోజుల పాటు బంధువులు, స్నేహితులను విచారించినా ఫలితం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించానని పైడిరాజు తెలిపారు. న్యూ పోర్ట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు తెలిస్తే సమాచారం అందించాలని కోరారు.