కొత్త రూట్లలో సిటీ బస్సులు..
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో పలు కొత్త రూట్లలో సిటీ బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ పురుషోత్తం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. డిసెంబర్ 1 నుంచి సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. కోఠి–ఈసీఐఎల్ (40/16ఎన్) రూట్లో సెమీ లోఫ్లోర్ బస్సు అందుబాటులోకి రానుంది. ఇది ఏఎస్‌రావునగర్, సైనిక్‌పురి, నేరేడ్మెట్, సఫిల్‌గూడ, మల్కాజిగిరి, ఆలుగడ్డబావి, సికింద్రాబాద్, కవాడీగూడ, హిమాయత్‌నగర్ మార్గంలో కోఠి వరకు రాకపోకలు సాగిస్తుంది.
బండ్లగూడ– జగద్గిరిగుట్ట (90బీ/30) మార్గంలో 3 మెట్రో ఎక్స్‌ప్రెస్‌లు బండ్లగూడ నుంచి ఉప్పల్ క్రాస్‌రోడ్స్ తార్నాక, సికింద్రాబాద్, బాలానగర్, ఐడీపీఎల్ మీదుగా జగద్గిరిగుట్టకు రాకపోకలు సాగించనుంది. ప్రణీత్ హౌసింగ్ కాలనీ నుంచి సికింద్రాబాద్ (10కె/పీ) రూట్లో 3 సెమీ లోఫ్లోర్ బస్సులు బాచుపల్లి, నిజాంపేట్, జేఎన్టీయూ, కేపీహెచ్‌బీ, ఎర్రగడ్డ, ఎస్ఆర్నగర్, బేగంపేట్ రూట్లో నడుస్తాయి. హయత్‌నగర్–గండిమైసమ్మ (290/272జీ) రూట్లో 2 మెట్రో ఎక్స్‌ప్రెస్‌లు ఎల్బీనగర్, ఉప్పల్, తార్నాక, సికింద్రాబాద్, బాలానగర్, జీడిమెట్ల మీదుగా తిరుగనున్నాయి.
జగద్గిరిగుట్ట– మెహదీపట్నం మార్గంలో (19కెజె) ఆర్డినరీ బస్సు ఆల్విన్ కాలనీ, కూకట్పల్లి, ఎర్రగడ్డ, అమీర్‌పేట్, రోడ్‌నెంబర్ 1 బంజారాహిల్స్, మాసాబ్‌ట్యాంక్ మార్గంలో నడుస్తుంది. హయత్‌నగర్–సికింద్రాబాద్ (290), కోఠి–సికింద్రాబాద్(40), దిల్సుఖ్నగర్–సికింద్రాబాద్(107వీఆర్), ఇబ్రహీంపట్నం–దిల్సుఖన్ నగర్(277డి) రూట్లలో అదనపు బస్సులు నడుపనున్నట్లు వెల్లడించారు.
బస్సు సర్వీసుల పొడిగింపు....
మరి కొన్ని బస్సుల రూట్లను పొడిగించనున్నారు. కోఠి–కొండాపూర్ మధ్య నడిచే (127కె),కోఠి–నందినగర్ (127ఎన్) బస్సులను ఎల్బీనగర్ వరకు పొడిగిస్తారు. సికింద్రాబాద్–ఎల్బీనగర్ మధ్య నడిచే (40 ఎల్) బస్సును ఎన్జీవోస్ కాలనీ వరకు, వీఎస్టీ–బీర్‌బాగ్ (137) బస్సును జియాగూడ వరకు పొడిగిస్తారు. సికింద్రాబాద్–జియాగూడ (86జె) బస్సును టోలీమసీద్ వరకు నడుపుతారు. చార్మినార్– కాటేదాన్ మధ్య నడిచే (178కె) మినీ బస్సులను శ్రీరామ్ కాలనీ వరకు నడుపుతారు.
కేశవగిరి–సికింద్రాబాద్ (102/38) బస్సులను ఈస్ట్‌మారేడ్‌పల్లి వరకు, హయత్‌నగర్–మెహదీపట్నం (156/126) బస్సులను జేఎన్ టీయూ వరకు పోడిగించనున్నారు. ఉప్పల్–మెహదీపట్నం (113 ఐఎం/126) మధ్య నడిచే బస్సులను జేఎన్టీయూ వరకు నడుపుతారు. కోఠి–ఇందిరానగర్ (74) మధ్య నడిచే బస్సులను మెహిదీపట్నం వరకు పొడిగించనున్నారు.