ఇండియన్ నేవీ కొత్త చీఫ్ సునిల్ లాంబా
న్యూఢిల్లీ: వైస్ అడ్మిరల్ సునిల్ లాంబా మే31న ఇండియన్ నేవీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు రక్షణ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.
ప్రస్తుతం ఆయన పశ్చిమ నావికాదళ కమాండర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుత నేవీ చీఫ్ గా ఉన్న ఆర్ కే ధోవన్ ఈనెల 31న పదవీ విరమణ చేయనున్నారు. 1978లో ఇండియన్ నేవీలో చేరిన ధోవన్ 38 ఏళ్లపాటు సేవలందించారు.