newly elected MLAs
-
తెలంగాణ అసెంబ్లీలో 27 కొత్త ముఖాలు
సాక్షి, హైదరాబాద్ : 119 స్థానాలున్న తెలంగాణ అసెంబ్లీకి డిసెంబర్ 7న ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ 88 స్థానాల్లో ఘన విజయం సాధించి తిరిగి అధికారంలోకి వచ్చింది. మహాకూటమి పేరుతో బరిలోకి దిగిన కాంగ్రెస్ 19 స్థానాలు, టీడీపీకి రెండు స్థానాల్లో విజయం సాధించగా.. ఎంఐఎంకి 7 స్థానాలు, బీజేపీ ఒక చోట, ఇతరులు రెండు చోట్ల విజయం సాధించారు. కాగా, ఈ ఎన్నికల్లో 27 మంది తొలిసారిగా ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ఆ వివరాలు.. తొలిసారి ఎమ్మెల్యేలు.. 1. హరిప్రియ నాయక్ - కాంగ్రెస్ (ఇల్లందు) 2. నాగేశ్వరరావు - టీడీపీ (అశ్వరావు పేట) 3. సురేందర్, కాంగ్రెస్ - (ఎల్లారెడ్డి) 4. సుంకె రవిశంకర్, టిఆర్ఎస్ - (చొప్పదండి) 5. మెతుకు ఆనంద్, టిఆర్ఎస్ - (వికారాబాద్) 6 .రోహిత్ రెడ్డి, కాంగ్రెస్ - (తాండూరు) 7. హర్షవర్ధన్ రెడ్డి, కాంగ్రెస్ - (కొల్లాపూర్) 8. కాలేరు వెంకటేష్, టిఆర్ఎస్ - (అంబర్పేట్) 9. ఉపేందర్ రెడ్డి, కాంగ్రెస్ - (పాలేరు) 10. మల్లారెడ్డి, టిఆర్ఎస్ - (మేడ్చల్) 11. బాల్క సుమన్, టిఆర్ఎస్ -(చెన్నూరు) 12. వైరా రాములు నాయక్, ఇండిపెండెంట్ 13. కొరికంటి శంకర్, ఇండిపెండెంట్ (రామగుండం) 14. నరేందర్, టిఆర్ఎస్ - వరంగల్ వెస్ట్ 15. పెద్ది సుదర్శన్ రెడ్డి, టిఆర్ఎస్ - (నర్సంపేట) 16. భేతి సుభాష్ రెడ్డి, టిఆర్ఎస్ - (ఉప్పల్) 17. ముఠా గోపాల్, టిఆర్ఎస్ - (ముషీరాబాద్) 18. కృష్ణమోహన్ రెడ్డి, టిఆర్ఎస్ - (గద్వాల్) 19. నరేందర్ రెడ్డి, టిఆర్ఎస్ -(కొడంగల్) 20. బొల్లం మల్లయ్య యాదవ్, టిఆర్ఎస్ - కోదాడ) 21.కంచర్ల భూపాల్ రెడ్డి, టిఆర్ఎస్ - (నల్గొండ) 22.డాక్టర్ సంజయ్, టిఆర్ఎస్- (జగిత్యాల) 23. క్రాంతి, టిఆర్ఎస్ -(అందోల్) 24. నిరంజన్ రెడ్డి, టిఆర్ఎస్ - (వనపర్తి) 25. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ - (మునుగోడు) 26.మానిక్ రావు జహీరాబాద్, టిఆర్ఎస్ 27.కొప్పుల మహేష్ రెడ్డి, పరిగి - (టీఆర్ఎస్) -
రేపు చత్తీస్‌గఢ్, రాజస్ధాన్ సీఎంల ఎంపిక
సాక్షి, న్యూఢిల్లీ : మూడు రాష్ట్రాల్లో అధికార పగ్గాలు చేపట్టేందుకు అవసరమైన మెజారిటీకి చేరువైన కాంగ్రెస్ సంబరాల్లో మునిగితేలుతోంది. రాజస్థాన్, చత్తీస్‌గఢ్‌లో సాధారణ మెజారిటీ సాధించేలా దూసుకుపోతున్న కాంగ్రెస్ మధ్యప్రదేశ్‌లోనూ మేజిక్ మార్క్‌కు చేరుకుంది. ఇక చత్తీస్‌గఢ్, రాజస్ధాన్‌లో ప్రభుత్వాల ఏర్పాటుకు ప్రయత్నాలు వేగవంతం చేసింది. చత్తీస్‌గఢ్, రాజస్దాన్‌లో ఆ పార్టీ తరపున నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలు రాయ్‌పూర్, జైపూర్లలో బుదవారం సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలు పార్టీ శాసనసభా పక్ష నేతలను ఎన్నుకోనున్నారు. పార్టీ అధిష్టానం నిర్ణయించిన అభ్యర్ధులను వీరు లాంఛనంగా ఎన్నుకునే అవకాశం ఉంది. చత్తీస్‌గఢ్‌లో పీసీసీ చీఫ్ భూపేష్ భాగల్ సీఎం రేసులో ముందుండగా, రాజస్ధాన్‌లో సీనియర్ నేత అశోక్ గెహ్లాట్, యువ నేత సచిన్ పైలట్లు సీఎం పదవికి పోటీ పడనున్నారు. ఇక ఎన్నికల ఫలితాల్లో రాజస్ధాన్‌లో 199 స్ధానాలకు గాను మేజిక్ మార్క్‌ను దాటిన కాంగ్రెస్ పార్టీ 102 స్ధానాల్లో ఆధిక్యం కనబరుస్తుండగా, పాలక బీజేపీ కేవలం 70 స్ధానాలకే పరిమితమైంది. చత్తీస్‌గఢ్‌లో 90 స్ధానాలకు గాను కాంగ్రెస్ మూడింట రెండొంతుల పైగా 63 స్ధానాల్లో ఆధిక్యత సాధించింది. ఇక్కడ బీజేపీ కేవలం 18 స్ధానాల్లోనే ముందంజలో ఉంది. 230 స్ధానాలున్న మధ్యప్రదేశ్‌లో మేజిక్ ఫిగర్‌కు అవసరమైన 116 స్ధానాలకు గాను కాంగ్రెస్ 117 స్ధానాల్లో ఆధిక్యం కనబరిచింది. బీజేపీ 103 స్ధానాల్లో బీఎస్పీ మూడు స్ధానాలు, ఇతరులు ఏడు స్ధానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. -
142 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు
న్యూఢిల్లీ : బిహార్ అసెంబ్లీకి ఎన్నికైన ఎమ్మెల్యేల్లో 58 శాతం మంది క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు. మొత్తం 243 మంది ఎమ్మెల్యేల్లో 142 మంది ఈ కేసుల్లో ఉన్నారని మీడియా మంగళవారం వెల్లడించింది. అయితే క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న వారిలో అత్యధికంగా లాలూ ప్రసాద్ యాదవ్‌కు చెందిన ఆర్జేడీ పార్టీకి వారే ఉన్నారని పేర్కొంది. ఆ పార్టీకి చెందిన మొత్తం 80 మంది ఎమ్మెల్యేల్లో 46 మందిపై వివిధ సెక్షన్ల కింద క్రిమినల్ కేసులు నమోదయ్యాయని తెలిపింది. విజయం సాధించిన ఎమ్మెల్యేల్లో ఓ ఎమ్మెల్యే మాత్రం తాను నిరక్షరాస్యుడిని అని ప్రకటించాడు. మరో 93 మంది మాత్రం ఐదవ తరగతి నుంచి 12 తరగతి వరకు చదువుకున్నారు. 137 మంది మాత్రం డిగ్రీ ఆపై ఉన్నత విద్యను అభ్యసించారు. 80 మంది మాత్రం మళ్లీ అసెంబ్లీకి తిరిగి ఎన్నికయ్యారు. జనతాదళ్ (యూ) పార్టీ టికెట్‌పై ఖగారియా అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికల బరిలో దిగిన పూనమ్ దేవి యాదవ్ మాత్రం రూ. 41 కోట్లకు పైగా ఆస్తులతో అత్యధిక సంపన్నురాలిగా నిలిచింది. 243 స్థానాలు గల బిహార్ అసంబ్లీకి ఇటీవలే ఐదు దశలలో పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికల్లో మహాకూటమి ఆర్జేడీ, జనతాదళ్ యూ, కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుంది. బీజేపీ మాత్రం రెండు అంకెలకే పరిమితమైంది. నితీశ్ శుక్రవారం పాట్నాలో బీహార్ ముఖ్యమంత్రిగా ముచ్చటగా మూడో సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.