డీలర్లకు డిప్లొమా కోర్సు అవసరం
నెల్లూరు రూరల్ :
ఎరువులు, పురుగు మందుల డీలర్లకు డిప్లొమా కోర్సు అవసరమని, కోర్సు పూర్తి చేస్తే ఎంతో ఉపయోగపడుతుందని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ విస్తరణ సంచాలకులు డాక్టర్ కె.రాజారెడ్డి అన్నారు. నెల్లూరు కృషి విజ్ఞాన కేంద్రంలో డిప్లొమా కోర్సులో డీలర్లకు అందిస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని బుధవారం ఆయన పరిశీలించారు. రాజారెడ్డి మాట్లాడుతూ కేవీకే ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల డీలర్లకు డిప్లొమా కోర్సు కింద వివిధ అంశాల మీద ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామన్నారు. ఈ శిక్షణ రైతులకు ఉపయోగపడే విధంగా డీలర్లు నేర్చుకోవాలని సూచించారు. కేవీకే ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ డాక్టర్ ఎంసీ ఓబయ్య మాట్లాడుతూ డీలర్ల కోసం ఈ ఏడాది మార్చి నుంచి డిప్లొమా కోర్సును అందుబాటులోకి తీసుకోచ్చామన్నారు. ఈ కార్యక్రమం సంవత్సరం పొడవునా నిర్వహిస్తామని, డీలర్లు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. యూనివర్సిటీ విస్తరణ ఉప సంచాలకులు డాక్టర్ బి.విజయాభినందన, అనకాపల్లి ప్రాంతీయ పరిశోధనా స్థానం అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ వేణుగోపాల్‌రావు, కేవీకే శాస్త్రవేత్తలు రత్నకుమారి, డీలర్లు పాల్గొన్నారు.