నిడో తానియా కేసులో చార్జిషీట్ దాఖలు చేసిన సీబీఐ
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన అరుణాచల్‌ప్రదేశ్ యువకుడు నిడో తానియా హత్యకేసుకు సంబంధించి సీబీఐ శుక్రవారం అభియోగపత్రం దాఖలు చేసింది. ఏడుగురిపై సీబీఐ అభియోగాలు మోపగా అందులో ముగ్గురు బాల నేరస్తులు ఉండడం గమనార్హం.
అభియోగాలు ఎదుర్కొంటున్న ఏడుగురికి నిడో తానియా హత్యతో ప్రత్యక్ష సంబంధం ఉందని సీబీఐ ఆరోపించింది. నేరపూరిత హత్య, అక్రమ నిర్బంధం, ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం ప్రకారం ఫర్మాన్, పవన్, సుందర్, సున్నీ ఉప్పల్లపై అభియోగాలు మోపారు.