Nifty 9
-
రికార్డుల హోరు
♦ సెన్సెక్స్ 30,500 పైన, నిఫ్టీ 9,500 పైన ♦ రుతు పవనాలు, ప్రోత్సాహకర ఫలితాల జోష్ ♦ ఎఫ్ఎంసీజీ, బ్యాంకింగ్, ఆటో రంగాల జోరు ముంబై: మంగళవారం స్టాక్ మార్కెట్లో రికార్డులు హోరెత్తిపోయాయి. ప్రధాన సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీలు రెండూ రికార్డు గరిష్టస్థాయికి పెరగడంతో పాటు అదేస్థాయి వద్ద ముగియడం విశేషం. చరిత్రలో తొలిసారిగా 30,500 పాయింట్ల స్థాయిని అధిగమించిన బీఎస్ఈ సెన్సెక్స్ క్రితం ముగింపుతో పోలిస్తే 260 పాయింట్లు ఎగిసి 30,582 పాయింట్ల వద్ద ముగిసింది. అదేబాటలో ఎన్ఎస్ఈ నిఫ్టీ 9,500 పాయింట్ల శిఖరాన్ని తొలిసారిగా అధిరోహించి 9,512 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ సూచీ 67 పాయింట్లు ర్యాలీ జరిపింది. మే 11న ఈ రెండు సూచీలు సాధించిన రికార్డు స్థాయిల్ని తాజాగా అధిగమించాయి. ఈశాన్య రుతుపవనాలు అండమాన్ నికోబార్ ద్వీపాల్ని సాధారణతేదీకంటే మూడు రోజులు ముందుగానే తాకాయన్న వార్తలతో కొనుగోళ్ల జోరు మొదలయ్యింది. మరోవైపు టీసీఎస్ బైబ్యాక్ ఆఫర్ ఈ నెల 18న మొదలవుతుందని ప్రకటించడం, పంజాబ్ నేషనల్ బ్యాంక్ వెల్లడించిన ఫలితాల్ని మార్కెట్ మెచ్చడం వంటి అంశాలు రోజంతా ఇన్వెస్టర్లను కొనుగోళ్లకు పురిగొల్పాయి. అలాగే గత రాత్రి అమెరికా సూచీలు కూడా కొత్త రికార్డుస్థాయిలో ముగియడం కూడా ఇక్కడి సెంటిమెంట్‌ను బలపర్చింది. భారత ఆర్థిక వ్యవస్థ ఉత్పాదక వృద్ధి దశలోకి ప్రవేశించిందని మోర్గాన్ స్టాన్లీ నివేదిక కూడా మార్కెట్‌కు ఊతం ఇచ్చింది. మెటల్స్ మినహా... క్రితం రోజు ర్యాలీ జరిపిన మెటల్ షేర్లు మినహా దాదాపు అన్ని రంగాలకు చెందిన షేర్లూ ర్యాలీలో పాలుపంచుకున్నాయి. రుతువపనాలు వచ్చేశాయన్న వార్తలతో ఎఫ్ఎంసీజీ షేర్లు హిందుస్తాన్ యూనీలీవర్, ఐటీసీ షేర్లు 2 శాతంపైగా ఎగిసాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ మార్చితో ముగిసిన త్రైమాసికానికి నికరలాభాన్ని ప్రకటించడంతో ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్ తదితర బ్యాంకింగ్ షేర్లు పెరిగాయి. రెండు రోజుల్లో బైబ్యాక్ ప్రారంభం కానున్న నేపథ్యంలో టీసీఎస్ షేరు 2 శాతం ఎగిసింది. పెరిగిన షేర్లలో హీరో మోటో, మారుతి, విప్రో, భారతి ఎయిర్‌టెల్‌లు వున్నాయి. ఒడిదుడుకుల భయాలూ ఉన్నాయ్..! కాగా భవిష్యత్తు పనితీరుపట్ల ఆపోహలున్న ఐటీ, ఫార్మా, టెలికం రంగాలు కూడా తాజా ర్యాలీలో పాలుపంచుకోవడం ఆందోళన కల్గిస్తున్నదని, దీంతో వచ్చే కొద్ది రోజుల్లో మార్కెట్ ఒడిదుడుకులకు లోనుకావొచ్చని ఆయన అంచనావేశారు. -
స్వల్ప నష్టాలు
26 పాయింట్లు క్షీణించి 29,847కు సెన్సెక్స్ ∙ 2 పాయింట్ల నష్టంతో 9,312కు నిఫ్టీ అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేట్ల నిర్ణయం నేపథ్యంలో బుధవారం కూడా స్టాక్ సూచీలు ఊగిసలాటకు గురయ్యాయి. చివరకు నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 26 పాయింట్లు క్షీణించి 29,847 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 2 పాయింట్లు నష్టపోయి 9,312 పాయింట్ల వద్ద ముగిశాయి. ఫార్మా, ఆయిల్, గ్యాస్ షేర్లు నష్టపోగా, ఐటీ, రియల్టీ షేర్లు లాభపడడం నష్టాలను పరిమితం చేసింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ ఒక దశలో 99 పాయింట్లు లాభపడగా, మరో దశలో 75 పాయింట్లు నష్టపోయింది. ఇక నిఫ్టీ కూడా 33 పాయింట్లు లాభపడగా, 14 పాయింట్లు నష్టపోయింది. వేచి చూసే ధోరణి... సెన్సెక్స్ లాభాల్లోనే ప్రారంభమైంది. 30,000 పాయింట్ల పైకి ఎగసింది. కానీ లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో నష్టాల్లోకి జారిపోయింది. యూరోప్ మార్కెట్లు నష్టపోవడం ప్రతికూల ప్రభావం చూపింది. కంపెనీల క్యూ4 ఫలితాలు బాగానే ఉన్నప్పటికీ, అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేట్ల నిర్ణయం నేపథ్యంలో ఇన్వెస్టర్లు వేచి చూసే ధోరణి అవలంభించారని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్(రీసెర్చ్) వినోద్ నాయర్ చెప్పారు. రేట్లను యధాతథంగా కొనసాగించే అవకాశాలున్నాయని, అయితే జూన్‌లో రేట్ల పెంపునకు సంబంధించి సంకేతాలు ఉండొచ్చని పలువురు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది వంద శాతం పెరిగిన స్పైస్‌జెట్ స్పైస్‌జెట్ షేర్ ఇంట్రాడేలో 4 శాతం లాభపడి, జీవిత కాల గరిష్ట స్థాయి, రూ.117ను తాకింది. చివరకు 3 శాతం లాభంతో రూ.116 వద్ద ముగిసింది. ఈ ఏడాదిలో ఈ షేర్ 104 శాతం లాభపడింది. గత ఏడాది డిసెంబర్ 30 నాటికి ఈ షేర్ ధర రూ.57గా ఉంది. కాగా అమెరికా ఎఫ్‌డీఏ పరిశీలనల నేపథ్యంలో ఫార్మా షేర్ల నష్టాలు కొనసాగుతున్నాయి. లుపిన్ షేర్ 2.8 శాతం తగ్గి రూ.1,264కు పడిపోయింది. 2014, ఆగస్టు 26 తర్వాత ఇదే అత్యంత కనిష్ట స్థాయి. మళ్లీ మొదటి స్థానానికి టీసీఎస్ అత్యధిక మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న భారత కంపెనీగా ఐటీ దిగ్గజం టీసీఎస్ తన స్థానాన్ని రెండో రోజు కూడా నిలుపుకుంది. రూ.4,60,568 కోట్ల మార్కెట్ క్యాప్‌తో టీసీఎస్ అగ్రస్థానంలో ఉంది. రిలయన్స్ మార్కెట్ క్యాప్ కంటే టీసీఎస్ మార్కెట్ క్యాప్‌రూ.15,054 కోట్లు అధికం.