వరుసగా నాలుగో రోజూ నష్టాల్లోనే
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. వరుసగా నాలుగో రోజు కూడా నష్టాల్లో ముగిసిన మార్కెట్లు రెండు వారాల కనిష్టాన్ని నమోదు చేశాయి. సెన్సెక్స్ 115 పాయింట్ల నష్టంతోవద్ద, నిఫ్టీ35పాయింట్ల నష్టంతో వద్ద స్థిరపడ్డాయి. ఆరంభంనుంచి బలహీనంగానే ఉన్నప్పటికీ, మిడ్ సెషన్ తర్వాత ఉన్నట్టుండి అమ్మకాలు ఊపందుకున్నాయి. దీంతో ఒక దశలో నిఫ్టీ 8100 స్థాయిని కోల్పోయింది. చివర్లో స్వల్పంగా కొలుకొని సాంకేతికంగా కీలకస్థాయికి పైన ముగిసింది. ఐటీ సెక్టార్ లాభాల్లోనూ పీఎస్యూ బ్యాంక్, ఫార్మా, రియల్టీ, మెటల్, ఆటో రంగం నష్టాల్లోను ముగిశాయి. ఇన్ఫ్రాటెల్, సన్ ఫార్మా, ఏషియన్ పెయింట్స్, అల్ట్రాటెక్, హెచ్డీఎఫ్సీ క్షీణించగా, గెయిల్ టాప్ విన్నర్ గా నిలిచింది. అరబిందో, గ్రాసిమ్, టాటా పవర్, ఆర్ఐఎల్ స్వల్పంగా లాభాల్లోముగిశాయి.
అటు డాలర్ మారకం విలువలో 0.01 నష్టంతో రూ.67.78 వద్ద ఉంది. అలాగే ఎంసీఎక్స్ మార్కెట్ లో పది గ్రా. పుత్తడి రూ.44 లాభపడి రూ. 27.208 వద్ద ఉంది.