NIIT University
-
25 మార్కులకే పరీక్ష
తాడేపల్లిగూడెం: మల్టిపుల్ చాయిస్ పద్ధతిలో 25 మార్కులకు పరీక్షలు రాస్తే చాలు.. పై తరగతికి ప్రమోట్ కావచ్చు.. సరళంగా ప్రశ్నలు ఉంటాయి.. గంట సమయం ఇస్తారు.. ఆన్లైన్లో పరీక్ష రాయాల్సి ఉంటుంది.. ఇది ఏపీ నిట్ విద్యార్థులకు కరోనా నేపథ్యంలో ఇస్తున్న బంపరాఫర్. ఏదైనా కారణాల వల్ల ఆన్లైన్ పరీక్షలు రాయకపోతే, కళాశాల ప్రారంభమయ్యాక 50 మార్కులకు పరీక్ష రాసే అవకాశం కల్పించారు. ఇదిలా ఉండగా పరీక్షలను పూర్తిగా రద్దు చేసి పై తరగతులకు ప్రమోట్ చేయాలని విద్యార్థులు కోరుతున్నారు. 29 నుంచి పరీక్షలు ఆన్లైన్ పరీక్షల షెడ్యూల్‌ను నిట్ డైరెక్టర్ సీఎస్పీ రావు సోమవారం ప్రకటించారు. ఈనెల 29వ తేదీ నుంచి వచ్చేనెల 4వ తేదీ వరకు ద్వితీయ, తృతీయ సంవత్సర విద్యార్థులకు సెమిస్టర్ పరీక్షలు ఆన్లైన్లో నిర్వహిస్తామన్నారు. పేపర్‌కు 100 మార్కులకు గాను ఇంటర్నల్స్‌కు 35 మార్కులు, మిడ్ సెమిస్టర్ పరీక్షలకు 40 మార్కులు ఇస్తారని, మిగిలిన 25 మార్కులకు మల్టీపుల్ చాయిస్ పద్ధతిలో గంటపాటు ఆన్లైన్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఆఖరి ఏడాది విద్యార్థులకు ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించిన సందర్భంలో ఎలాంటి ఇబ్బందులు రాలేదని, దీంతో మిగిలిన సంవత్సరాల విద్యార్థులకు పరీక్షలు నిర్వహించడానికి ప్రత్యేక పద్ధతిలో అవకాశం కల్పించామన్నారు. కొత్త సాంకేతిక పరిజ్ఞాన విధానంలో పరీక్షల ఫార్ములాను తయారు చేయడం వల్ల అవకతవకలకు అవకాశం లేదన్నారు. దేశంలోని జాతీయ విద్యాసంస్థల్లో ప్రత్యేక ఫార్ములాతో పరీక్షలు నిర్వహించేది ఏపీ నిట్ మాత్రమే అని డైరెక్టర్ రావు స్పష్టం చేశారు. ఒకవేళ పరీక్షలు రాసే అవకాశం వినియోగించుకోలేని విద్యార్థులకు కళాశాల తెరిచిన తర్వాత 50 మార్కులకు పరీక్ష రాసే అవకాశం ఇస్తామని పేర్కొన్నారు. ఆన్లైన్ పరీక్షలు వద్దు: విద్యార్ధులు కరోనా నేపథ్యంలో పలు జాతీయ విద్యాసంస్థలు పరీక్షలను రద్దు చేసి విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేస్తున్నాయని.. ఇదే విధానాన్ని ఏపీ నిట్ కూడా అనుసరించాలని విద్యార్థులు కోరుతున్నారు. 40 శాతం మంది విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చారని, ఆయా ప్రాంతాల్లో ఇంటర్నెట్, విద్యుత్ సమస్యలు కారణంగా ఆన్లైన్ పరీక్షలకు హాజరయ్యే వెసులుబాటు లేదన్నారు. ఇదే విషయాన్ని విద్యార్థులు, వారి తల్లితండ్రులు నిట్ డైరెక్టర్‌కు వినతుల రూపంలో తెలియజేశారు. మానసిక ఒత్తిడి, ఆవేదనలో ఉన్నామని, ఈ తరుణంలో పరీక్షలకు సన్నద్ధం కాలేమని చెబుతున్నారు. జాతీయ విద్యాసంస్థల్లో పరీక్షలు రద్దు కోవిడ్–19 నేపథ్యంలో జాతీయ విద్యాసంస్థలు సెమిస్టర్ పరీక్షలను రద్దు చేశాయి. ఢిల్లీ యూనివర్సిటీ, ముంబై యూనివర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, వరంగల్ నిట్, నిట్ కురుక్షేత్ర, రూర్కెలా, షిబ్పూర్, నిట్ సిల్చర్, నిట్ అగర్తలా వంటివి పరీక్షలను రద్దు చేసి విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేశాయి. -
ర్యాగింగ్ చేస్తే వేటు పడుద్ది
పశ్చిమగోదావరి , తాడేపల్లిగూడెం: ఉన్నత విద్యాసంస్థలలో ర్యాగింగ్ జాడ్యం జడలు విప్పి కరాళ నృత్యం చేస్తోంది. విద్యార్థుల మధ్య విభేదాలకు ఆజ్యం పోస్తోంది. నిట్‌లో జరిగిన ర్యాగింగ్ ఘటన ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఒక జూనియర్ విద్యార్థి ధరించిన దుస్తులపై సీనియర్ చేసిన కామెంట్ ఘర్షణకు దారితీసింది. విషయం కాస్తా ఢిల్లీలోని యాంటీ ర్యాగింగ్ సెల్‌కు వెళ్లింది. రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారి దృష్టికి చేరింది. క్షేత్రస్థాయి దర్యాప్తు అనంతరం 15 మంది విద్యార్థులపై తీసుకున్న చర్యలు వారి భవిష్యత్తుపై పెద్ద మచ్చగా మిగిలిపోనున్నాయి. దేశంలో మొత్తం 31 నిట్లు, ఐఐటీలు ఉన్నాయి. ఈ సంస్థలలో గతంలో ర్యాగింగ్ ఘటనలు జరిగినా, సర్దుబాట్లతో, మహా అయితే రూ.25 వేల అపరాధ రుసుంతో విద్యార్థులు రక్షణాత్మక వలయంలో ఉండేవారు. అయితే ఏపీ నిట్ ఘటనలో ఏకంగా 15 మంది విద్యార్థులకు శిక్ష పడింది. ఒక విద్యార్థిని ఏకంగా కళాశాల నుంచి సస్పెండ్ చేశారు. ఐదుగురిని నాలుగు సెమిస్టర్ల పాటు రెండేళ్లు కళాశాల ప్రవేశాన్ని రద్దు చేశారు. తొమ్మిదిమందికి హాస్టల్ ప్రవేశాన్ని నిషేధించారు. దేశంలో హిమాచల్ ప్రదేశ్, కేరళ రాష్ట్రాలలో ర్యాగింగ్ నేపథ్యంగా సాగిన ఘటనలతో సుప్రీంకోర్టు కొరడా ఝళిపించింది. యూనివర్సిటీ ఆఫ్ కేరళ వర్సెస్ కౌన్సిల్ ప్రిన్సిపల్స్... కాలేజెస్ కేరళ వర్సెస్ అండ్ అదర్స్ కేసులో ఆర్.కె.రాఘవన్ కమిటీ ఇచ్చిన సిఫార్సుల మేరకు ర్యాగింగ్ చట్టాల పదును పెంచారు. ర్యాగింగ్ నిరోధంపై విశ్వ జాగృతి మిషన్ వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంతో ర్యాగింగ్‌ను కట్టడి చేయడానికి కొత్త చట్టాలు, సెక్షన్లు వచ్చాయి. దేనిని ర్యాగింగ్‌గా పరిగణిస్తారంటే.. సైకలాజికల్, సోషల్, పొలిటికల్, ఎకనమిక్, కల్చరల్, అకడమిక్ డైమెన్షన్లో ఏ రూపంలోనైనా ఇబ్బంది పెట్టడాన్ని ర్యాగింగ్‌గా పరిగణిస్తున్నారు. కేంద్ర మానవ వనరుల శాఖా మంత్రిగా కపిల్ సిబాల్ ఉన్న సమయంలో ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ ఇండియా లిమిటెడ్, బీఎస్ఎన్ఎల్ సంస్థల ఆధ్వర్యంలో యూనివర్సిటీ గ్రాంట్సు కమిషన్ పర్యవేక్షణలో ర్యాగింగ్ బాధితులకు 24 గంటలు అందుబాటులో ఉండే విధంగా ఢిల్లీలో యాంటీ ర్యాగింగ్ సెల్‌ను ఏర్పాటు చేశారు. 1800–180–5522 నంబరుకు ఫోన్ చేసి ర్యాగింగ్ జరిగిన విషయాన్ని బా«ధితుడు తెలియచేస్తే, అందుబాటులో ఉన్న ఉద్యోగి వివరాలు నమోదు చేసుకొని బాధితునికి ఒక యూనిక్ నంబర్ కేటాయిస్తారు. కేవలం 15 నిమిషాల వ్యవధిలో యాక్షన్ ప్రారంభమౌతుంది. పోలీసులు, ఉన్నత విద్యాసంస్థల అధికారులు ఎప్పటికప్పుడు విషయాలను యాంటీ ర్యాగింగ్ సెల్‌కు తెలపాలి. ఫిర్యాదు చేరింది మొదలు తొలి కాల్ వెళ్లేది ఘటన జరిగిన రాష్ట్రానికి చెందిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసుకు. ఐపీసీ సెక్షన్లు పనిచేయవు ర్యాగింగ్ ఘటనలో బాధ్యులకు శిక్షలు వేయడానికి ఐపీసీ సెక్షన్లు పనికిరావు. సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు ప్రకారం ఆ ఆదేశాలలోని సెక్షన్ 48 ప్రకారం శిక్షలు, చర్యలు ఉంటాయి. ఘటన జరిగిన వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు కావాల్సిందే. కళాశాల నుంచి పంపించి వేసి ప్రవేశాన్ని రద్దు చేయడం, ఒకటి నుంచి నాలుగు సెమిస్టర్లు సస్పెండ్ చేయడం, హాస్టళ్ల నుంచి బహిష్కరించడం వంటì చర్యలు ఉంటాయి. యాంటీ ర్యాగింగ్ యాక్టు ర్యాగింగ్‌ను క్రిమినల్ అఫెన్సుగా గుర్తించిన ప్రభుత్వం యుజీసీ యాక్టులోని సెక్షన్ 3 ఆఫ్ 1956 లోని సెక్షన్–26 ను అనుసరించి యాంటీ ర్యాగింగ్ సెంట్రల్ యాక్టును 2009 జులై నాలుగో తేదీన తీసుకువచ్చింది. ఈ చట్టం 2009 అక్టోబరు 21వ తేదీ నుంచి అమలులోకి వచ్చింది. ర్యాగింగ్ ఘటనల తీవ్రత ఆధారంగా సెంట్రల్ యాక్టు పురుడుపోసుకుంది. ర్యాగింగ్ బాధితులకు సాంత్వన కోసం పోరు సాగించడానికి యాంటీ ర్యాగింగ్ కమిటీలు, స్క్వాడ్లను ఉన్నత విద్యాసంస్థలలో ఏర్పాటు చేశారు. ఏపీ నిట్‌లో ర్యాగింగ్‌పై అవగాహన ఏపీ నిట్‌లో ర్యాగింగ్ దుష్ఫలితాలు వివరించడానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నాం. ర్యాగింగ్లోకి వెళితే విద్యార్థుల జీవితాలు ఎలా తలకిందులవుతాయో వివరిస్తున్నాం. సైక్రియాటిస్టులు, వ్యక్తిత్వ వికాస నిపుణులు, అనుభవజ్ఞులతో ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేశాం. విద్యార్థులకు ల్యాబ్‌లు, పరీక్షలు లేని సమయంలో ర్యాగింగ్‌పై అవగాహన కల్పిస్తున్నారు. ప్రాంగణంలో యాంటీ ర్యాగింగ్ బోర్డులు ఏర్పాటు చేశాం. – ఎస్.శ్రీనివాసరావు, నిట్ రెసిడెంటు కోఆర్డినేటర్ -
ఉజ్వల భవిష్యత్‌కు భరోసా
కాజీపేట అర్బన్: వరంగల్ నిట్ క్యాంపస్ నుంచే చక్కని ఉద్యోగావకాశాలను సొంతం చేసుకునేందుకు ఓ విద్యార్థి నడుంబగించాడు. ఉన్నత విద్య, క్యాంపస్ ఇంటర్వ్యూల్లో విజయం సాధించేందుకు నిష్ణాతులచే సలహాలు సూచనలు అం దించేందుకు సరికొత్తగా నిట్ వరంగల్ కెరీర్ సెల్ ను ఏర్పాటు చేసి ఔరా అన్పించుకున్నాడు. నిట్‌లోని కెమికల్ వి భాగంలో మూడో సంవత్సరం చదువుతున్న ప్రశాంత్ రాంశెట్టి స్టూడెంట్ కౌన్సిల్ సౌజన్యంతో నిట్ వరంగల్ కెరీర్ సెల్‌ను ప్రారంభించాడు. కౌన్సిల్ ప్రధాన కార్యదర్శిగా విద్యార్థులతో మమేకమై వారి సమస్యలు పరిష్కరిస్తూ బాసటగా నిలుస్తున్నాడు. జనవరి 18న కెరీర్ సెల్ ప్రారంభమై విద్యార్థుల సేవలో దూసుకుపోతోంది. ఎస్ఎంపీతో అవగాహన సదస్సు... స్టూడెంట్ మెంటర్షిప్ ప్రోగ్రాం పేరిట వివిధ కళాశాల్లో ఉన్నత విద్య, క్యాంపస్ ఇంటర్వ్యూల్లో విజయం సాధించేందుకు గాను సూచనలు, సలహాలు ఇస్తున్నాడు. క్యాంపస్ ఇంటరŠూయ్వల ద్వారా ఎంపికైన వారితో సందేశాలు ఇప్పిస్తున్నాడు. ప్రపంచంలోనే ప్రాచుర్యం పొందిన గ్లాస్ మార్ట్ కంపెనీ సెయింట్ గోబెన్కు ఎంపికైన అక్షిత, మయంక్ నిట్‌లోని విద్యార్థులకు అవగాహన కల్పించారు. మన్హతన్ రివ్యూ పేరిట జీఆర్ఈ, జీమ్యాట్, టోఫెల్లో విజయం సాధించి పీజీ, పీహెచ్డీ, ఎంబీఏలో అవకాశం సాధించేందుకు నినిపుణులచే సలహాలు ఇప్పిస్తున్నాడు. స్టూడెంట్ సపోర్ట్ సర్వీస్ వరంగల్ నిట్‌లో విద్యార్థుల సమస్యల పరిష్కారానికి స్టూడెంట్ సపోర్ట్ సర్వీస్‌ను రూపొందించారు. చదువులో వెనుకబడిన విద్యార్థులకు సీనియర్లచే బోధిస్తున్నారు. రీసెర్చ్ మెథడాలజీ పేరిట నూతన పరిశోధనలపై మెళకువలను నిట్ డైరెక్టర్ ఎన్వీ.రమణారావు పవర్‌పాయింట్ ప్రెజ ంటేషన్ ఇస్తున్నారు. కెరీర్ సెల్ ద్వారా ‘ఇండిస్పెన్సెబుల్ రీసెర్చ్ టూల్స్’ పేరిట నిట్ పూర్వవిద్యార్థి డాక్టర్ కోటేశ్వర్‌రెడ్డి ఆన్లైన్లో సలహాలు అందిస్తున్నారు.. దుబాయ్ నుంచి స్కైప్ యాప్ సాయంతో ఆధునిక యంత్రాలపై అవగాహన కల్పించారు. అవకాశాలు కల్పిస్తాం.. నిట్ వరంగల్స్ కెరీర్ సెల్ ద్వారా విద్యార్థులకు వివిధ రంగాల్లో అవకాశాలు అందించేందుకు కృషి చేస్తున్నా. వేసవి సెలవుల్లో ఐఐటీ ముంబాయి, ఢిల్లీకి వెళ్లాను. అక్కడ కెరీర్ సెల్, ఎస్‌ఎంపీలను ఏర్పాటు చేసి విద్యార్థులకు సేవలందిస్తున్నారు. వరంగల్ నిట్‌లో సైతం అటువంటి వేదికను రూపొందించా. ఆన్లైన్లో విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందిస్తున్నా. ఉన్నత విద్య, ఐఏఎస్, యూపీఎస్సీలపై అవగాహన అందించేందుకు కెరీర్ సెల్ తోడ్పడుతుంది. సాయంత్రం వేళ్లల్లో నిట్ డైరెక్టర్, స్టూడెంట్ కౌన్సిల్ ప్రోత్సాహంతో కార్యక్రమాలను నిర్వహిస్తున్నా. – ప్రశాంత్ రాంశెట్టి, నిట్ విద్యార్థి,ఎస్ఎంపీ, కెరీర్ సెల్ వ్యవస్థాపకుడు -
ఎన్యూలో ప్రతిభ ఆధారిత స్కాలర్షిప్పులు
ఎన్యూ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ వీఎస్ రావు వెల్లడి సాక్షి, హైదరాబాద్: విద్యార్థుల ప్రతిభ ఆధారంగా వంద శాతం వరకు ఫీజు రాయితీలు ఇచ్చేందుకు ఎన్యూ (ఎన్ఐఐటీ విశ్వవిద్యాలయం) సరికొత్త కార్యక్రమాన్ని తీసుకొచ్చిందని ఎన్యూ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ వీఎస్ రావు పేర్కొన్నారు. పరిశ్రమ ఆధారిత వర్సిటీగా దేశంలో మొదటి స్థానం దక్కించుకున్న ఎన్యూ, త్వరలో సాంకేతిక, పరిశోధనలపై ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చెప్పారు. ఎన్యూ ఫౌండర్ రాజేంద్ర ఎస్ పవార్‌తో కలసి శనివారం ఇక్కడ మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ సమీపంలో వందెకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన వర్సిటీలో తెలుగు విద్యార్థులే అధికంగా ఉన్నారన్నారు. విద్యార్థులు వారికి నచ్చిన అంశాలను ఎంచుకుని పరిశోధనలు చేసేలా వర్సిటీ అవకాశం కల్పించిందన్నారు. ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులకు అవకాశం కల్పిస్తోందని, వంద శాతం ప్లేస్మెట్ కల్పించే వర్సిటీగా ఎన్యూని అభివృద్ధి చేశామన్నారు. తొమ్మిదేళ్లలో 97.6 శాతం విద్యార్థులకు 30 కంపెనీల్లో ఉద్యోగాలు వచ్చాయన్నారు. గ్రీన్ ఎయిర్ కండీషన్ సిస్టంలో క్యాంపస్‌ను తీర్చిదిద్దినట్లు చెప్పారు. పదో తరగతి, ఇంటర్మీడియెట్‌లో మార్కులు ఆధారంగా, బిట్‌శాట్, జేఈఈ మెరిట్‌తో పాటు వర్సిటీ నిర్వహించే ప్రవేశపరీక్షల ఆధారంగా అడ్మిషన్లు కల్పిస్తామన్నారు.