Nikai
-
జోరుమీదున్న సేవా రంగం
న్యూఢిల్లీ: దేశీ సేవల రంగ కార్యకలాపాలు జోరుమీదున్నాయి. వరుసగా 2వ నెలలోనూ వృద్ధి చెంది అక్టోబర్ 2016 తరువాత అత్యంత గరిష్టస్థాయిని నమోదుచేశాయి. జూన్లో 52.6 శాతంగా ఉన్న నికాయ్ ఇండియా సర్వీసెస్ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ జూలైలో 54.2 శాతానికి ఎగసింది. డిమాండ్ ఊపందుకోవడం వంటి సానుకూల అంశాల నేపథ్యంలో ఈ రంగం జోరు కొనసాగుతోందని ఆర్థిక వేత్తలు చెబుతున్నారు. గతేడాది జూన్ నుంచి బలమైన వృద్ధిరేటును కొనసాగిస్తూ సేవా రంగం ఆశాజనకంగా ఉందని ఐహెచ్ఎస్ మార్కిట్ ఆర్థిక వేత్త ఆశ్నా దోధియా వ్యాఖ్యానించారు. ఇక సేవారంగం, తయారీ రంగానికి సంయుక్త సూచీగా ఉన్న నికాయ్ ఇండియా కాంపోజిట్ పీఎమ్ఐ అవుట్పుట్ ఇండెక్స్ జూలైలో 54.1 శాతానికి చేరింది. ఈ సూచీ అంతక్రితం నెలలో 53.3 శాతంగా ఉంది. -
జూన్లో బాగుపడ్డ ‘సేవలు’: నికాయ్
న్యూఢిల్లీ: సేవల రంగం జూన్లో తిరిగి వృద్ధిబాటలోకి ప్రవేశించింది. నికాయ్ ఇండియా సర్వీసెస్ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ 52.6గా నమోదయ్యింది. మే నెలలో ఈ ఇండెక్స్ అసలు పెరక్కపోగా, క్షీణత (49.6) నమోదయిన సంగతి తెలిసిందే. నికాయ్ ఇండెక్స్ ప్రకారం, 50 పాయింట్ల పైన ఉంటే వృద్ధిగా, ఆ దిగువన క్షీణతగా భావిస్తారు. జూన్లో నమోదయిన శాతం ఈ ఏడాదిలో ఇంతవరకూ నమోదుకాకపోవడం మరో విశేషం. తయారీ–సేవలు రెండూ చూస్తే... రెండు ప్రధాన విభాగాలైన తయారీ–సేవల రంగాలను చూస్తే, మే నెలలోలో నికాయ్ సూచీ 50.4 శాతం ఉన్న సూచీ జూన్లో 53.3కు పెరిగింది. -
మార్చిలో తయారీ పేలవం
న్యూఢిల్లీ: భారత్ తయారీ రంగం క్రియాశీలత మార్చిలో ఐదు నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది. నికాయ్ మార్కెట్ తయారీ పీఎంఐ మార్చిలో 51 గా నమోదయ్యింది. ఫిబ్రవరిలో ఈ పాయింట్లు 52.1 శాతం. నిజానికి మార్చిలో ఈ పాయింట్లు 52.8గా నమోదవుతుందన్న అంచనాలు ఉన్నాయి. నెలవారీ సర్వే ప్రకారం– మార్చిలో కొత్త బిజినెస్ ఆర్డర్లు భారీగా పెరగలేదు. ఉపాధి అవకాశాలు కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి. పీఎంఐ ప్రమాణాల ప్రకారం– సూచీ 50 పాయింట్ల ఎగువనే ఉంటే దానిని వృద్ధి దశగానే భావించడం జరుగుతుంది. ఆలోపునకు పడిపోతే క్షీణతగా పరిగణిస్తారు. అయితే దేశంలో తయారీ ఇండెక్స్ వరుసగా గడచిన ఎనిమిది నెలల్లో 50 పాయింట్ల ఎగువనే ఉంది. -
సేవల రంగం పేలవం: నికాయ్
జూలైలో అసలు వృద్ధిలేకపోగా క్షీణత న్యూఢిల్లీ: సేవల రంగం జూలై నెలలో పేలవ పనితనాన్ని ప్రదర్శించింది. ఈ నెలలో అసలు వృద్ధిలేకపోగా, క్షీణతను నమోదుచేసుకుందని నికాయ్ ఇండియా సర్వీసెస్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) పేర్కొంది. దీనిప్రకారం, 45.9గా జూలై సూచీ నమోదయ్యింది. ఇది నాలుగేళ్ల కనిష్టం. 2013 సెప్టెంబర్ తరువాత ఈ స్థాయిలో ఎప్పుడూ సూచీ పతనం కాలేదు. నెల క్రితం అంటే జూన్లో ఏకంగా ఎనిమిది నెలల గరిష్టస్థాయి 53.1 స్థాయి నుంచి మరుసటి నెలలోనే నాలుగేళ్ల కనిష్ట స్థాయి 45.9 స్థాయికి సూచీ పడిపోవడం గమనార్హం. వస్తు, సేవల పన్ను అమల్లోక్లిష్టత, అనిశ్చితి కొత్త బిజినెస్ ఆర్డర్లపై ప్రభావం చూపడమే తాజా భారీ ‘సేవల’ క్షీణతకు కారణమని నికాయ్ విశ్లేషణ తెలిపింది. నికాయ్ సూచీ 50 పాయింట్ల పైనుంటే వృద్ధి ధోరణిగా ఆ లోపు ఉంటే క్షీణతగా భావించడం జరుగుతుంది. సేవలు.. తయారీ రెండు కలిపినా నిరాశే ఇక సేవలు.. తయారీ రెండింటికీ సంబంధించి నికాయ్ ఇండియా కాంపోజిట్ పీఎంఐ అవుట్పుట్ ఇండెక్స్– కూడా జూలైలో భారీగా పడిపోయి 46.0 పాయింట్లుగా నమోదయ్యింది. మార్చి 2009 తరువాత ఈ స్థాయి ఇదే తొలిసారి. జూన్లో మాత్రం 52.7 పాయింట్లుగా నమోదయ్యింది. ప్రైవేటు రంగం ఉత్పత్తి పడిపోవడం తాజా ఫలితానికి ప్రధాన కారణమని నికాయ్ నివేదిక తెలిపింది.