ఆటోను ఢీకొన్న టిప్పర్
ఎర్రగుంట్ల: మండల కేంద్రమైన ఎర్రగుంట్ల పట్టణంలోని నాలుగు రోడ్ల కూడలి సమీపంలో రైల్వే ఓవర్ బ్రిడ్జిపైన శనివారం తెల్ల వారిజామున 5 గంటలకు టీప్పర్ అతి వేగంగా ఆటోను ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా 9 మంది గాయపడ్డారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు కమలాపురం మండలం పందిర్లపల్లె గ్రామానికి చెందిన సుబ్బరాయుడు కుటుంబీకులు అనంతపురం జిల్లా గుత్తికి క్రైస్తవ ప్రార్థన కోసం వెళ్లారు. ప్రార్థన పూర్తి చేసుకోని గుత్తి నుంచి వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో బయలు దేరారు. ఎర్రగుంట్ల రైల్వే స్టేషన్లో దిగి పందిర్లపల్లె గ్రామానికి పోవడానికి ఆటోలో గంగమ్మ, నాగలక్ష్మి, చిన్నగంగన్న, సుజాత, సుగణమ్మ, రాధ, స్వర్ణలత, కిరణ్ బయలుదేరారు. చిలంకూరుకు చెందిన దేవరాజ్ కూడా ఎక్కారు. ఆటో నాలుగు రోడ్ల వద్దకు వస్తున్న సమయంలో ఎదురుగా ప్రొద్దుటూరు పోతున్న టీప్పర్ «ఢీకొంది. ఈ ప్రమాదరంలో గంగమ్మ (35) తలకు తీవ్ర గాయమైంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతు మృతి చెందారు. నాగలక్ష్మి, చిన్నగంగన్న, సుజాత, సుగణమ్మ, రాధ, స్వర్ణలత, కిరణ్ మరో ఇద్దరికి తీవ్రగాయలయ్యాయి. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించి 108 వాహనంలో క్షతగాత్రులను ప్రొద్దుటూరు ప్రభుత్వం ఆస్పత్రికి తరలించారు.. సుజాత పరిస్థితి విషయమించడంతో కర్నూలు ఆస్పత్రికి తరలించారు. రోడ్డుపైన పడి ఉన్న ఆటోను పక్కకు తీసి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. మృతురాలు భర్త సుబ్బరాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ భూషణం తెలియజేశారు.