Nirmal constituency
-
కేసీఆర్ కు బిగ్ షాక్... కాంగ్రెస్ లో చేరిన శ్రీహరి రావు
నిర్మల్: రాజకీయంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే నిర్మల్ ఓ కేంద్రబిందువుగా కొనసాగుతోంది. త్వరలోనే ఎన్నికలు రానున్నవేళ జిల్లాలో చోటుచేసుకుంటున్న మార్పులు అందరినీ ఆకర్షిస్తున్నాయి. తాజాగా ఉద్యమనేత, బీఆర్ఎస్ అసమ్మతి నాయకుడు కూచాడి శ్రీహరిరావు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడంపై చర్చమొదలైంది. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన కాంగ్రెస్‌లో చేరడమే ఇందుకు కారణం. ఆయన హస్తంగూటికి చేరడంతో తమకెలాంటి ఇబ్బంది లేదని చెబుతున్న బీఆర్ఎస్, బీజేపీ క్షేత్రస్థాయిలో మరింత ఆరాతీస్తున్నాయి. ఇక దేశం, రాష్ట్రమంతటా ఎలా ఉన్నా.. జిల్లాలో రాజకీయ పరిస్థితులు కొంత భిన్నంగా ఉండటం సహజం. ఇక్కడ క్యాడర్ కాదు కదా.. కనీసం ఎన్నికల గుర్తు కూడా సరిగ్గా తెలియని పార్టీలు ఘనంగా గెలిచిన రోజులున్నాయి. అందుకే శ్రీహరిరావు కాంగ్రెస్‌లో చేరడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆత్మాభిమానం కోసం.. తను కావాలనుకుంటే సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ వద్దకు వెళ్లి పనులు చేయించుకోగలను, కానీ.. ఉద్యమకారులకు గుర్తింపులేని చోట ఆత్మాభిమానం చంపుకొని ఉండలేనంటూ కూచాడి శ్రీహరిరావు కాంగ్రెస్‌గూటికి చేరారు. తనకు రాజకీయగురువుగా పేర్కొనే మంత్రి ఇంద్రకరణ్రెడ్డినే ఢీకొనేందుకు రేవంత్‌రెడ్డి సమక్షంలో హస్తం కండువా వేసుకున్నారు. గత ఎన్నికల్లో కారు గుర్తు గెలుపుకోసం ఎంత శ్రమించినా కనీసం ఇచ్చిన హామీమేరకు ఎమ్మెల్సీ కూడా ఇవ్వకపోవడమూ కూచాడి కాంగ్రెస్ వైపు వెళ్లడానికి కారణమన్న వాదనలున్నాయి. ఏదిఏమైనా గత ఎన్నికల్లోనే పోటీకి తమనేత దూరంగా ఉన్నారని, ఈసారైనా పోటీచేస్తేనే తనకు, తమకు ఉనికి ఉంటుందన్న వాదనను ఆయన అనుచరులు బలంగా వినిపిస్తున్నారు. అందుకే వారంతా ఆయన వెంటే కాంగ్రెస్బాట పట్టారు. లాభమేనంటున్న బీజేపీ.. శ్రీహరిరావు బీఆర్ఎస్లో ఉంటే ఇబ్బంది కానీ కాంగ్రెస్‌లో చేరితే తమకే లాభమన్న వాదనను బీజేపీ నాయకులు వినిపిస్తున్నారు. ఒకవేళ ఆయన ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తే చీల్చేది బీఆర్ఎస్ ఓట్లేనని చెబుతున్నారు. నిర్మల్ నియోజకవర్గంలో కీలకంగా ఉన్న మైనార్టీ ఓట్లు కూడా రెండు పార్టీల మధ్య చీలితే మెజార్టీ ఓట్లు తమకే వస్తాయన్న అంచనాలు వేస్తున్నారు. ఖానాపూర్, ముధోల్ నియోజకవర్గాల్లో కూచాడి ప్రభావం పెద్దగా ఉండదని, నిర్మల్‌లో ఆయన రాక వందశాతం తమ పార్టీకే లాభమన్న భావన బీజేపీనుంచి వ్యక్తమవుతోంది. కాంగ్రెస్‌లో జోష్ పెరిగేనా? ఏఐసీసీ స్థాయికి ఎదిగిన మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రా మారావుపటేల్ తదితరులు వెళ్లిపోవడంతో జి ల్లాలో కాంగ్రెస్ కుదేలైంది. మళ్లీ కోలుకుంటుందో లేదోనన్న స్థాయికి దిగజారింది. ఒకరిద్దరు నేతలు మినహా పెద్దగా చెప్పుకోదగ్గ నాయకులెవరూ మిగల్లేదు. ఇలాంటి సందర్భంలో సారంగపూర్ జెడ్పీటీసీ పత్తిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి, ప్రముఖ న్యాయవాది అల్లూరి మల్లారెడ్డి చేర డం, యువనాయకులు అర్జుమంద్‌అలీ, జునై ద్, సేవాదళ్ మాజీ నేత ఎంబడి రాజేశ్వర్ తది తరులు యాక్టివ్ కావడం కొంత ఊరటనిచ్చింది. అయినా ఎన్నికల్లో పోటీచేసే స్థాయిలో లేదనుకుంటున్న సమయంలో శ్రీహరిరావు చేరడం కాంగ్రెస్‌లో కొంత జోష్ నింపింది. అంతా అయిపోయిందని అనుకుంటున్న తరుణంలో రానున్న ఎన్నికలపై ఆశలు పెట్టుకునేస్థాయికి పార్టీ చేరడంతో క్యాడర్ సంతృప్తి వ్యక్తంచేస్తోంది. -
నిర్మల్ జిల్లా ఏర్పాటుకు సహకరించండి
మంత్రికి జిల్లా సాధన సమితి వినతి నిర్మల్‌రూరల్ : నిర్మల్ కేంద్రంగా నూతన జిల్లా ఏర్పాటుకు స్థానిక మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి సహకరించాలని నిర్మల్ జిల్లా సాధన సమితి డిమాండ్ చేసింది. ఈ మేరకు గురువారం పట్టణంలోని మంత్రి స్వగృహానికి సమితి సభ్యులు తరలివచ్చారు. ఆయన హైదరాబాద్‌లో జిల్లాలపై సమావేశానికి తరలివెళ్లడంతో పీఏ శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులకు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సాధన సమితి కన్వీనర్లు నంగె శ్రీనివాస్, నాయిడి మురళీధర్ మాట్లాడుతూ సీఎం ముఖ్యమంత్రి బుధవారం కలెక్టర్ల సమావేశంలో పేర్కొన్న విధంగా నిర్మల్ జిల్లాకు కావాల్సిన అన్ని అర్హత లూ ఉన్నాయన్నారు. ముథోల్, ఖానాపూర్, నిర్మల్ నియోజకవర్గాలతోపాటు బోథ్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాలకు నిర్మల్ జిల్లా కేంద్రంగా అనుకూలంగా ఉందన్నారు. అవసరమైతే నిజామాబాద్‌లోని సరిహద్దు ప్రాంతాలను కలిపైనా నిర్మల్‌ను జిల్లాగా ప్రకటించేలా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి చూడాలన్నారు. ముథోల్, ఖానాపూర్ నియోజకవర్గాల్లోని మారుమూల గ్రామాల ప్రజల ఇక్కట్లను దృష్టిలో పెట్టుకోవాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా సాధన సమితి కోశాధికారి గంగిశెట్టి ప్రవీణ్, కోకన్వీనర్లు డాక్టర్ కృష్ణంరాజు, ముక్కా సాయిప్రసాద్, నూకల గురుప్రసాద్, అబ్ధుల్ అజీజ్, కోటగిరి గోపి, డాక్టర్ కృష్ణవేణి, బొద్దుల అశోక్, అంక శంకర్, కార్యవర్గ సభ్యులు కూన రమేశ్, నారాయణ, సాయి తదితరులు పాల్గొన్నారు. ఫోన్ ద్వారా ఎమ్మెల్యేలతో.. జిల్లాల ఏర్పాటుపై గురువారం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం సమావేశం ఉన్నందున నిర్మల్ జిల్లా సాధన సమితి నూతన జిల్లా కోసం ప్రజాప్రతినిధులకు విన్నవించింది. సాధన సమితి గౌరవ అధ్యక్షుడు డాక్టర్ ప్రమోద్‌చంద్రారెడ్డి ఫోన్ ద్వారా ముథోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డితో మాట్లాడి, జిల్లా ఏర్పాటు అవశ్యకతను వివరించారు. సీఎంతో సమావేశంలో నిర్మల్ జిల్లా ఏర్పాటుపై మాట్లాడాలని కోరారు. అలాగే సాధన సమితి కోకన్వీనర్ డాక్టర్ యు. కృష్ణంరాజు ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్‌తో మాట్లాడారు. ఈమేరకు ఎమ్మెల్యేలు సానుకూలంగా స్పందించారని వారు తెలిపారు. -
పోటీ బహుముఖం
నిర్మల్, న్యూస్‌లైన్ : నిర్మల్ నియోజకవర్గంలోని జిల్లా, మండల పరిష త్ ప్రాదేశిక నియోజకవర్గ ఎన్నికల్లో బహుముఖ పోటీ నెలకొంది. మూడు మండలాల్లో జెడ్పీటీసీ స్థానానికి చతుర్ముఖ పోటీ, లక్ష్మణచాందలో పంచముఖ పోటీ నెలకొంది. దిలావర్పూర్లో అత్యధికంగా 11మంది బరిలో ఉన్నారు. ఎంపీటీసీ స్థానాలకూ తీవ్ర పోటీ నెలకొంది. నియోజకవర్గంలో ఐదు మండలాల ఉన్నాయి. నిర్మల్(బీసీ మహిళ)లో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, స్వతంత్ర అభ్యర్థిని పోటీ పడుతున్నారు. సారంగాపూర్(ఎస్సీ మహిళ) నుంచి కాంగ్రెస్, బీఎస్పీ, టీఆర్ఎస్, స్వతంత్ర అభ్యర్థిని, మామడ(బీసీ మహిళ) నుంచి టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ, బీఎస్పీ అభ్యర్థులు బరిలో ఉన్నారు. లక్ష్మణచాంద(బీసీ మహిళ) నుంచి కాంగ్రెస్, టీఆర్ఎస్, బీఎస్పీ, బీజేపీ, టీడీపీ అభ్యర్థులు పోటీ పడుతున్నారు. దిలావర్పూర్(ఎస్టీ మహిళ) నుంచి కాంగ్రెస్, బీఎస్పీ, బీజేపీ, సీపీఐ, టీఆర్ఎస్, ఆరుగురు స్వతంత్ర అభ్యర్థినులు బరిలో ఉన్నారు. ఎంపీటీసీ స్థా నాలకూ ద్విముఖ, త్రిముఖ, చతుర్ముఖ పోటీ నెలకొం ది. నిర్మల్ మండలంలో 15 ఎంపీటీసీ స్థానాలకు గాను 66మంది, లక్ష్మణచాందలో 10 స్థానాలకు 51 మంది, మామడలో 9స్థానాలకు 34 మంది, దిలావర్పూర్లో 10 స్థానాలకు 42 మంది పోటీ పడుతున్నారు. సారంగాపూర్‌లో 14 స్థానాలకు చించోలి(బి) ఏకగ్రీవం కావడంతో.. 13 స్థానాల్లో 53 మంది పోటీలో ఉన్నారు. జెడ్పీ, ఎంపీపీ పీఠంపై కన్ను జెడ్పీ చైర్పర్సన్, ఎంపీపీ అధ్యక్ష స్థానాలపై కన్నేసిన అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం సాగిస్తున్నారు. జెడ్పీ చైరపర్సన్ స్థానం బీసీ మహిళకు కేటాయించారు. ఆ పీఠాన్ని దక్కించుకునేందుకు అన్ని పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. నిర్మల్, లక్ష్మణచాంద, మామడ జెడ్పీటీసీ స్థానాలకు బీసీ మహిళా అభ్యర్థులు పెద్దయెత్తున ప్రచారం సాగిస్తున్నారు. నిర్మల్ ఎంపీపీ స్థానం జనరల్ మహిళ, సారంగాపూర్ ఎంపీపీ స్థానం ఎస్టీ మహిళ, లక్ష్మణచాంద ఎస్సీ మహిళ, మామడ ఎస్టీ మహిళ, దిలావర్పూర్ జనరల్ మహిళకు రిజర్వు అయ్యాయి. దీంతో ఆయా సామాజిక వర్గాల అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా ప్రచారం సాగిస్తున్నారు. నేటి నుంచి తెరవెనుక కథ బుధవారం సాయంత్రంతో ప్రచారానికి తెరపడనుంది. ఈ నెల 11న పోలింగ్ ఉండడంతో తెరవెనుక మంత్రాం గానికి శ్రీకారం చుట్టేందుకు అభ్యర్థులు సన్నాహాలు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు సాగించిన ప్రచారం ఒక ఎత్తయితే.. ఇకముందే అసలు ప్రచారం మొదల వుతుంది. రహస్య కార్యకలాపాలే గెలుపునకు దారి తీస్తాయని గుర్తెరిగిన నేతలు కార్యాచరణను సిద్ధం చేసుకున్నారు. ప్రత్యర్థుల కదలికలపై దృష్టి సారిస్తూనే తమ ప్ర ణాళికను అమలు పరిచేలా ముందుకు సాగుతున్నారు. గెలుపే లక్ష్యంగా ఎంతటి ఖర్చుకైనా వెనుకాడడం లేదు. బహుముఖ పోరులో విజయం ఎవరిని వరిస్తుందో వేచిచూడాల్సిందే.