నిర్మల్, న్యూస్‌లైన్ : నిర్మల్ నియోజకవర్గంలోని జిల్లా, మండల పరిష త్ ప్రాదేశిక నియోజకవర్గ ఎన్నికల్లో బహుముఖ పోటీ నెలకొంది. మూడు మండలాల్లో జెడ్పీటీసీ స్థానానికి చతుర్ముఖ పోటీ, లక్ష్మణచాందలో పంచముఖ పోటీ నెలకొంది. దిలావర్‌పూర్‌లో అత్యధికంగా 11మంది బరిలో ఉన్నారు. ఎంపీటీసీ స్థానాలకూ తీవ్ర పోటీ నెలకొంది. నియోజకవర్గంలో ఐదు మండలాల ఉన్నాయి. నిర్మల్(బీసీ మహిళ)లో టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్, స్వతంత్ర అభ్యర్థిని పోటీ పడుతున్నారు.
సారంగాపూర్(ఎస్సీ మహిళ) నుంచి కాంగ్రెస్, బీఎస్పీ, టీఆర్‌ఎస్, స్వతంత్ర అభ్యర్థిని, మామడ(బీసీ మహిళ) నుంచి టీఆర్‌ఎస్, కాంగ్రెస్, టీడీపీ, బీఎస్పీ అభ్యర్థులు బరిలో ఉన్నారు. లక్ష్మణచాంద(బీసీ మహిళ) నుంచి కాంగ్రెస్, టీఆర్‌ఎస్, బీఎస్పీ, బీజేపీ, టీడీపీ అభ్యర్థులు పోటీ పడుతున్నారు. దిలావర్‌పూర్(ఎస్టీ మహిళ) నుంచి కాంగ్రెస్, బీఎస్పీ, బీజేపీ, సీపీఐ, టీఆర్‌ఎస్, ఆరుగురు స్వతంత్ర అభ్యర్థినులు బరిలో ఉన్నారు. ఎంపీటీసీ స్థా నాలకూ ద్విముఖ, త్రిముఖ, చతుర్ముఖ పోటీ నెలకొం ది. నిర్మల్ మండలంలో 15 ఎంపీటీసీ స్థానాలకు గాను 66మంది, లక్ష్మణచాందలో 10 స్థానాలకు 51 మంది, మామడలో 9స్థానాలకు 34 మంది, దిలావర్‌పూర్‌లో 10 స్థానాలకు 42 మంది పోటీ పడుతున్నారు. సారంగాపూర్‌లో 14 స్థానాలకు చించోలి(బి) ఏకగ్రీవం కావడంతో.. 13 స్థానాల్లో 53 మంది పోటీలో ఉన్నారు.
జెడ్పీ, ఎంపీపీ పీఠంపై కన్ను
జెడ్పీ చైర్‌పర్సన్, ఎంపీపీ అధ్యక్ష స్థానాలపై కన్నేసిన అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం సాగిస్తున్నారు. జెడ్పీ చైరపర్సన్ స్థానం బీసీ మహిళకు కేటాయించారు. ఆ పీఠాన్ని దక్కించుకునేందుకు అన్ని పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. నిర్మల్, లక్ష్మణచాంద, మామడ జెడ్పీటీసీ స్థానాలకు బీసీ మహిళా అభ్యర్థులు పెద్దయెత్తున ప్రచారం సాగిస్తున్నారు. నిర్మల్ ఎంపీపీ స్థానం జనరల్ మహిళ, సారంగాపూర్ ఎంపీపీ స్థానం ఎస్టీ మహిళ, లక్ష్మణచాంద ఎస్సీ మహిళ, మామడ ఎస్టీ మహిళ, దిలావర్‌పూర్ జనరల్ మహిళకు రిజర్వు అయ్యాయి. దీంతో ఆయా సామాజిక వర్గాల అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా ప్రచారం సాగిస్తున్నారు.
నేటి నుంచి తెరవెనుక కథ
బుధవారం సాయంత్రంతో ప్రచారానికి తెరపడనుంది. ఈ నెల 11న పోలింగ్ ఉండడంతో తెరవెనుక మంత్రాం గానికి శ్రీకారం చుట్టేందుకు అభ్యర్థులు సన్నాహాలు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు సాగించిన ప్రచారం ఒక ఎత్తయితే.. ఇకముందే అసలు ప్రచారం మొదల వుతుంది. రహస్య కార్యకలాపాలే గెలుపునకు దారి తీస్తాయని గుర్తెరిగిన నేతలు కార్యాచరణను సిద్ధం చేసుకున్నారు. ప్రత్యర్థుల కదలికలపై దృష్టి సారిస్తూనే తమ ప్ర ణాళికను అమలు పరిచేలా ముందుకు సాగుతున్నారు. గెలుపే లక్ష్యంగా ఎంతటి ఖర్చుకైనా వెనుకాడడం లేదు. బహుముఖ పోరులో విజయం ఎవరిని వరిస్తుందో వేచిచూడాల్సిందే.
పోటీ బహుముఖం
Published Wed, Apr 9 2014 2:23 AM | Last Updated on Sat, Sep 2 2017 5:45 AM
Advertisement