Nissan Motor
-
Electric vehicle: కేవలం ఈవీ టెక్నాలజీ కోసమే లక్షాఎనభై వేల కోట్లు!
రాబోయేది ఈవీల కాలమే. అందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదు. అందుకే ఆటోమొబైల్‌తో పాటు మొబైల్ మేకింగ్, ఇతర కంపెనీలు సైతం ఈవీల తయారీ వైపు ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ తరుణంలో కేవలం ఈవీ టెక్నాలజీ కోసమే లక్షా ఎనభై వేల కోట్ల ఖర్చుకు సిద్ధమయ్యాయి రెనాల్డ్ నిస్సాన్ కంపెనీలు. ఫ్రెంచ్ జపనీస్ ఆటోమొబైల్‌ల కూటమి ‘ఈవీ టెక్నాలజీ’ కోసం 26 బిలియన్ డాలర్లు(మన కరెన్సీలో లక్షా 82 వేల కోట్ల రూపాయలకు పైనే) పెట్టుబడి పెట్టబోతున్నాయి. ఈ మేరకు గురువారం అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేసింది ఈ కూటమి. వచ్చే ఐదేళ్లకు ఈమేర ఖర్చు చేయనున్న కంపెనీలు పనిలో పనిగా జపాన్ ఆటోమేకర్ మిట్సుబిషి మోటార్స్ కార్పొరేషన్‌ను తమతో భాగస్వామిగా చేర్చుకున్నాయి. ఈవీలకు సంబంధించి పరిశోధనతో పాటు ఆటో పార్ట్లు, ధరలను తగ్గించే టెక్నాలజీ తదితరాల ఆధారంగా 35 కొత్త మోడల్స్‌తో ఈవీలను రూపొందించనున్నాయి. ఈ మేరకు 2030 ఏడాదిని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఈ ఐదు మోడల్స్‌కు ఒకే విధమైన ప్రధాన విభాగాల్ని ఉపయోగించాలని ప్లాన్ చేశాయి. నిస్సాన్ తర్వాతి తరం బ్యాటరీల మీద ఫోకస్ చేస్తుండగా.. రెనాల్ట్ ఈవీలను అభివృద్ధి చేయడం, సాఫ్ట్వేర్, డిజిటల్ సేవలు, ఫీచర్స్ మీద దృష్టి సారించనున్నట్లు కూటమి చైర్మన్ జీన్ డోమినిక్యూ సెనార్డ్ ప్రకటించారు. రెనాల్ట్కు నిస్సాన్‌లో 43 శాతం వాటా ఉంది, అలాగే రెనాల్ట్‌లో నిస్సాన్‌కు 15 శాతం వాటా ఉంది. టోక్యోకు చెందిన మిట్సుబిషిలో నిస్సాన్(యోకోహామా కేంద్రంగా)కు 34 శాతం వాటా ఉంది. ఇక ఫ్రెంచ్ ప్రభుత్వానికి రెనాల్ట్‌లో 15 శాతం వాటా ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చిప్ షార్టేజ్ కొనసాగుతోంది. ఈ తరుణంలో ఇలా కొన్ని కంపెనీలు చేతులు కలిపి ఈవీ మార్కెట్లో రాణించాలని ప్రయత్నిస్తున్నాయి. అయితే ఏ భాగస్వామి లేకుండా ప్రపంచంలో నెంబర్ వన్‌గా, ఈవీ కింగ్‌గా కొనసాగుతోంది మాత్రం అమెరికన్ ఆటో మేకర్ టెస్లానే. -
మార్కెట్లోకి నిస్సాన్ ‘కిక్స్’
న్యూఢిల్లీ: జపాన్‌కు చెందిన ఆటోమొబైల్ దిగ్గజ సంస్థ నిస్సాన్.. ‘కిక్స్’ పేరుతో భారత మార్కెట్లో నూతన ఎస్యూవీ మోడల్ కారును విడుదల చేసింది. ప్రత్యేకించి ఇక్కడి మార్కెట్ కోసం రూపొందించిన ఈ కారు పెట్రోల్ వేరియంట్ లీటరుకు 14.23 కిలోమీటర్ల మైలేజీని, డీజిల్ వేరియంట్ 20.45 కి.మీ మైలేజీని ఇస్తుందని కంపెనీ ప్రకటించింది. పెట్రోల్ వేరియంట్ ధరల శ్రేణి రూ.9.55 లక్షలు–రూ.10.95 లక్షలు కాగా, డీజిల్ వేరియంట్స్ ధరల శ్రేణి రూ.10.85 లక్షలు – రూ.14.65 లక్షలుగా నిర్ణయించింది. ఈ సందర్భంగా నిస్సాన్ ఇండియా, ఆఫ్రికా, మధ్యతూర్పు ప్రాంతాల చైర్మన్ పెయమన్ కార్గర్ మాట్లాడుతూ.. ‘భారత రోడ్లు, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఈ కారును డిజైన్ చేశాం. ఇక్కడి పరిశోధన, అభివృద్ధి టీం.. జపాన్, అమెరికా, బ్రెజిల్ సంస్థలతో కలిసి పనిచేసి ఈ కారును రూపొందించింది. ఎస్యూవీ విభాగంలో కిక్స్ పూర్తిస్థాయి పోటీనివ్వనుంది.’ అని వ్యాఖ్యానించారు. ఈ ఏడాదిలోనే ‘లీఫ్’ ఎలక్ట్రిక్ కార్ అంతర్జాతీయ మార్కెట్లో ఇప్పటికే విక్రయిస్తోన్న ఎలక్ట్రిక్ కార్ ‘లీఫ్’ను ఈ ఏడాదిలోనే భారత్‌లో విడుదల చేయనున్నట్లు నిస్సాన్ ప్రకటించింది. ఈ కారు విడుదలతోపాటు ఈ–పవర్, హైబ్రిడ్ కారు వంటి పర్యావరణ అనుకూల టెక్నాలజీని కూడా ఇక్కడి మార్కెట్లోకి తీసుకుని రావాలని యోచిస్తున్నట్లు కార్గర్ ఈ సందర్భంగా తెలిపారు. -
ఎస్‌యూవీలతో నిస్సాన్ పరుగులు
ముంబై : భారత్ రోడ్లపై మరిన్ని ఎస్ యూవీలను పరుగులు పెట్టించాలని జపాన్ ప్రముఖ కార్ల తయారీదారి నిస్సాన్ భావిస్తోంది. స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్స్(ఎస్ యూవీ)లపై, క్రాస్ ఓవర్స్ పై ఎక్కువగా దృష్టి సారించి, వచ్చే నాలుగేళ్లలో 5శాతం మార్కెట్ షేరును చేజిక్కించుకోవాలని నిస్సాన్ లక్ష్యంగా పెట్టుకుంది. అంచనాల తగ్గట్టూ తన మార్కెట్ షేరు లేకపోవడంతో, తన ఫర్ ఫార్మెన్స్ ను పెంచుకోవాలని నిర్ణయించింది. గత మంగళవారమే డాట్సన్ నుంచి క్రాస్ ఓవర్ హ్యాచ్ బ్యాక్ రెడీ-గో ను ప్రవేశపెట్టిన నిస్సాన్, వచ్చే మూడేళ్లలో మరో మూడు కొత్త కార్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టాలని ప్లాన్ చేస్తోంది. అన్ని విభాగాల్లో తన హవా చాటాలని నిస్సాన్ చూస్తోందని కంపెనీకి చెందిన ముగ్గురు అధికారులు చెప్పారు. ఈ ఏడాది చివరి నాటికి దేశీయ విపణిలోకి ప్రవేశపెట్టబోయే సరికొత్త ఎక్స్ ట్రయల్ ప్రీమియం ఎండ్ వాహనానికి రెడీ-గోను ఎంట్రీ లెవల్ గా నిస్సాన్ ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. మరో కొత్త కార్ డాట్సన్ గో క్రాస్, కోడ్ నేమ్డ్ ఈఎమ్2 ను 2019లో భారత రోడ్లపై పరుగు పెట్టించాలని నిస్సాన్ భావిస్తోంది. ఈ కారు ధరను ఫోర్డ్ ఎకో స్పోర్ట్, మారుతీ సుజుకీ విటారా బ్రిజా ధరకు సమానంగా రూ.5 లక్షల నుంచి రూ. 10లక్షల మధ్య వినియోగదారులకు అందుబాటులో ఉంచనుంది. మరో ఎస్ యూవీ వెహికిల్ పీబీ1డీను హ్యుందాయ్ క్రిటాకు సమానంగా రూ.8లక్షల నుంచి రూ.15లక్షల మధ్యలో భారత్ లో ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ఎస్ యూవీ వెహికిల్స్ పై నిస్సాన్ మోటార్ కార్పొరేషన్ ఎక్కువగా దృష్టిపెట్టనుందని భారత కార్యకలాపాల అధ్యక్షుడు గిలామ్ సికార్డ్ కూడా వెల్లడించారు.