Nizam Deccan Sugars Ltd
-
తీపి పంటతో...చేదు కష్టాలు..!
సాక్షి, హైదరాబాద్: గత ఏడాది నవంబరులో ప్రారంభమైన చెరుకు క్రషింగ్ సీజన్ ఈ ఏడాది మార్చి నాటికి ముగిసింది. రాష్ట్రంలోని ఏడు చక్కెర కర్మాగారాలు 24.14 మెట్రిక్ టన్నులను గానుగ ఆడించగా, 25.65లక్షల క్వింటాళ్ల చక్కెర ఉత్పత్తి అయింది. క్రషింగ్ సీజన్ ముగిసినా కర్మాగారాలకు చెరుకు సరఫరా చేసిన రైతులకు బిల్లులు అందడం లేదు. చక్కెర నిల్వలు తమ వద్ద పేరుకు పోవడం వల్లే బకాయిలు చెల్లించలేక పోతున్నట్లు కర్మాగారాలు చెప్తున్నాయి. సహకార రంగంలోని నిజామాబాద్ చక్కెర ఫ్యాక్టరీతో పాటు, ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలోని మూడు నిజాం దక్కన్ షుగర్ లిమిటెడ్ కర్మాగారాలు కూడా మూత పడ్డాయి. దీంతో రాష్ట్రంలో ప్రస్తుతం ప్రైవేటు రంగంలోని ఏడు చక్కెర కర్మాగారాలే పనిచేస్తున్నాయి. 2018–19 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలోని ఏడు చక్కెర కర్మాగారాలకు రైతులు 24.14లక్షల మెట్రిక్ టన్నుల చెరుకును సరఫరా చేశారు. టన్నుకు రూ.2,750 వంతున కేంద్ర ప్రభుత్వం చెరుకుకు మద్దతు ధర (ఎఫ్ఆర్పీ) ప్రకటించింది. ఈ ధర ఆధారంగా కర్మాగారాలు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా టన్ను చెరుకు ధరను రూ.2,845 మొదలుకుని రూ.3,179 వరకు నిర్ణయించాయి. గత ఏడాది నవంబర్‌లో ప్రారంభమైన చెరుకు క్రషింగ్ ఈ ఏడాది మార్చి నెలాఖరుకు ముగిసింది. రైతులు సరఫరా చేసిన చెరుకుకు రూ.729.69 కోట్లు చక్కెర కర్మాగారాలు చెల్లించాల్సి ఉంది. నిబంధనల మేరకు చెరుకు సరఫరా చేసిన 14 రోజుల వ్యవధిలో రైతులకు రావాల్సిన డబ్బులను కర్మాగారాలు చెల్లించాలి. అధికారిక లెక్కల ప్రకారం 2018–19 ఆర్థిక సంవత్సరానికి గాను రైతులకు రూ.476.57 కోట్లు ఇప్పటి వరకు చెల్లించారు. మరో రూ.253 కోట్లు కర్మాగారాల నుంచి రైతులకు అందాల్సి ఉంది. చేతులెత్తేస్తున్న కర్మాగారాలు రాష్ట్రంలో ఏడు ప్రైవేటు చక్కెర కర్మాగారాలు ఉండగా.. గణపతి, కాకతీయ వంటి ఒకటి రెండు పరిశ్రమలు మాత్రమే 70శాతానికి పైగా బకాయిలను రైతులకు చెల్లించాయి. కాకతీయ, ట్రైడెంట్ వంటి పరిశ్రమలు రైతులకు తాము చెల్లించాల్సిన మొత్తంలో కేవలం 30 నుంచి 40శాతం వరకే ఇచ్చాయి. దీంతో క్రషింగ్ సీజన్ ముగిసినా డబ్బులు చేతికి రాక రైతులు ఫ్యాక్టరీల చుట్టూ తిరుగుతున్నారు. బకాయిల చెల్లింపునకు చెరుకు, చక్కెర శాఖ.. కలెక్టర్ల సమక్షంలో రైతులు, ఫ్యాక్టరీల ప్రతినిధులతో సమావేశాలు ఏర్పాటు చేసినా పరిష్కారానికి నోచుకోవడం లేదు. వినియోగానికి మంచి చక్కెర ఉత్పత్తి చేయడం, బయటి మార్కెట్లో చక్కెర ధర ఆశాజనకంగా లేకపోవడం, కర్మాగారాల్లో చక్కెర నిల్వలు పేరుకు పోవడం తదితరాలను ఫ్యాక్టరీ యాజమాన్యాలు కారణంగా చూపుతున్నాయి. దేశీయ మార్కెట్లో చక్కెర ధర ఆశాజనకంగా లేకపోవడం, అంతర్జా తీయ మార్కెట్లో డిమాండు లేకపోవడంతో తమ పెట్టుబడి కూడా వెనక్కి రావడం లేదని అంటున్నా యి. చక్కెర నిల్వలు విక్రయిస్తేనే బకాయిలు చెల్లిం పు సాధ్యమవుతుందని చెప్తున్నాయి. ఈ ఏడాది జూన్ నాటికి చక్కెర మార్కెట్ పుంజుకుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కొరడా ఝలిపించేందుకు వెనుకంజ బిల్లుల చెల్లింపులో ఫ్యాక్టరీల యాజమాన్యాలు తాత్సారం చేస్తున్నా.. వారిపై చర్యలు తీసుకునేందుకు చక్కెర శాఖ అధికారులు వెనుకంజ వేస్తున్నారు. 2017–18 ఆర్థిక సంవత్సరానికి చెందిన బకాయిలను కొన్ని పరిశ్రమలు గత ఏడాది డిసెంబర్ వరకూ చెల్లిస్తూ వచ్చాయి. అవి చెల్లించని యాజమాన్యాలపై రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం చర్యలు తీసుకునే వీలున్నా.. భవిష్యత్తు పరిణామాలను దృష్టిలో పెట్టుకుని అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఫ్యాక్టరీని సీజ్ చేసే పక్షంలో నిల్వల విక్రయం, బకాయిల చెల్లింపు భారం అధికారుల మీద పడనుంది. సకాలంలో నిల్వలను విక్రయించని పక్షంలో రైతుల నుంచి ఎదురయ్యే ఒత్తిడిని తాము భరించాల్సి ఉంటుందనే ఆందోళన అధికారుల్లో కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో తమకు రావాల్సిన బకాయిల కోసం వేచి వుండటం మినహా.. రైతులకు మరో ప్రత్యామ్నాయం కనిపించడం లేదు. -
యాసిడ్ పడి ముగ్గురు కార్మికులకు గాయాలు
బోధన్ (నిజామాబాద్) : నిజామాబాద్ జిల్లా బోధన్‌లోని నిజాం దక్కన్ షుగర్ లిమిటెడ్ పరిశ్రమలో ప్రమాదవశాత్తూ యాసిడ్ పడి ముగ్గురు కార్మికులకు తీవ్రగాయాలయ్యాయి. పరిశ్రమలోని ఎస్ఎస్ఎల్ విభాగంలో పని చేస్తున్న కార్మికులపై గురువారం ప్రమాదవశాత్తూ యాసిడ్ పడటంతో.. లింగారెడ్డి(45), అహ్మద్(46), శివయ్య(38)లకు తీవ్రగాయాలయ్యాయి. ఇది గమనించిన తోటి కార్మికులు వారిని వెంటనే స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వారిలో లింగారెడ్డి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కాగా దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
రైతులకే ఎన్డీఎస్ఎల్
బోధన్: నిజాం దక్కన్ షుగర్స్ లిమిటెడ్ (ఎన్డీఎస్ఎల్) ప్రరుువేటు భాగస్వామ్యాన్ని రద్దుచేసి, ప్రభుత్వం స్వాధీనం చేసుకొని రైతులకు అప్పగిస్తామని ము ఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం చేసి న ప్రకటన రైతులు, కార్మికులలో ఆ నందం నింపింది. కానీ, ఫ్యాక్టరీని ప్రభుత్వమే నడపాలని వారు కోరుతున్నారు. ప్రరుువేటీకరణ రద్దు శుభసూచకమే అరుునప్పటికీ, కర్మాగారం ప్రభుత్వ ఆధీనంలో ఉండడమే సరైందనే అభిప్రా యం వ్యక్తమవుతోంది. టీఆర్ఎస్ ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు చక్కెర పరి శ్రమలను స్వాధీనం చేసుకునే దిశగా చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే నిజాం షుగర్స్‌పై సీఎం స్పష్టత ఇచ్చారు. అతి పెద్ద పరిశ్రమ ఆసియా ఖండంలోనే అతిపెద్ద వ్యవసాయూధారిత పరిశ్రమ అయిన ఎన్డీఎస్ఎల్ను 1936లో ఏర్పా టు చేశారు. ఈ పరిశ్రమ జిల్లా ఆర్ధిక, సామాజిక అభివధ్దికి ఎంత గానో దోహద పడింది. దీని లాభాలతో రాష్ర్టవ్యాప్తంగా చక్కెర పరిశ్రమలు విస్తరిం చాయి. నిజాం పాలకులు బోధన్ ప్రాంతంలో 16 వేల ఎకరాల భూమిని కేటాయించి 14 వ్యవసాయ క్షేత్రాలను ఏర్పాటు చేశారు. వేలాది మంది కార్మికులకు ఉపాధి లభించింది. చెరుకు సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. ఫ్యాక్టరీ ప్రారంభంలో 2, 50 0 మంది కార్మికులు పని చేశారు. క్రమంగా ఆ సంఖ్య ఐదు వేల కు చేరుకుంది. రైతులు పండించిన చెరుకు పంటకు లాభసాటి ధర అం దింది. బోధన్ ఫ్యాక్టరీ లాభాలతో మెదక్ జిల్లా ముంబోజిపల్లిలో, కరీంనగర్ జిల్లా మెట్పల్లి ప్రాంతంలోని ముత్యంపేట వద్ద నిజాం షుగర్ ఫ్యాక్టరీ యూనిట్లను 1980 దశకంలో ఏర్పాటు చేశారు. ఈ ఫాక్టరీల క్రషింగ్ కెపాసీటీ 2,500 టన్నులు. 2002లో ప్రరుువేటీకరణ లాభాల బాటలో నడుస్తున్న ఫ్యాక్టరీలను 2002లో చంద్రబాబు నాయుడు జాయింట్ వెంచర్ పేరుతో ప్రరుువేటీకరించారు. డెల్టా పేపర్ కంపెనీకి ఫ్యాక్టరీ నిర్వాహణ అధికారాన్ని కట్టబెట్టారు. వైఎస్ఆర్ హయాంలో సభాసంఘం 2004లో అధికారంలోకి వచ్చిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి ఈ వ్యవహారంపై నిగ్గు తేల్చేందుకు సభాసంఘం వేశారు. 2006 అగస్టు 31న ప్రభుత్వానికి సభాసంఘం నివేదికను ఇచ్చింది. యూనిట్లను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని సిఫారసు చేసింది. వైఎస్ఆర్ మరణానంతరం కాంగ్రెస్ ప్రభుత్వం సభా సంఘం సిఫారసులను పట్టించుకోలేదు. రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్ర విభజన తరువాత జరిగిన ఎన్నికలలో టీఆర్ఎస్ నిజాం షుగర్స్ ను స్వాధీనం చేసుకుంటామని హామీ ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం బోధన్, మెట్పల్లి, మెదక్ పరిశ్రమల పరిధిలోని రైతులతో సమావేశా లు ఏర్పాటు చేసింది. 2015 జనవరిలో మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి నేత్వత్వంలో మహారాష్ట్ర, కర్టాటక ప్రాంతంలోని సహాకార చక్కెర పరిశ్రమల నిర్వహణకు రైతులను అధ్యయనాన్ని తీసుకెళ్లారు. అనంతరం ఇప్పుడు నిజాం షుగర్స్ స్వాధీనం అంశంపై సీం స్పష్టత ఇచ్చారు. -
క్రషింగ్ లేటు.. రైతుకు చేటు
డిసెంబర్లో ప్రారంభం కానున్న ఎన్డీఎస్ఎల్ క్రషింగ్ నష్టాలు తప్పవంటున్న రైతులు రోజురోజుకు తగ్గిపోతున్న చెరకు పంట మెదక్: అదనుక నుగుణంగా పంట... సమయానుకూలంగా కోతలు చేపడితేనే ఏ రైతుకైనా ఆశించిన స్థాయిలో దిగుబడులు వస్తాయి. కానీ యజమాన్యం అలసత్వం.. ప్రభుత్వ, ప్రైవేట్ వివాదం.. ఫలితంగా మంభోజిపల్లిలోని నిజాం దక్కన్ షుగర్స్ లిమిటెడ్(ఎన్డీఎస్ఎల్) ఫ్యాక్టరీ నెలరోజులు ఆలస్యంగా క్రషింగ్ ప్రారంభిస్తోంది. దీంతో చెరకు రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఆశిం చిన స్థాయిలో లాభాలు రాక, సమయానుకూలంగా బిల్లులు అందక, కూలీల కొరత, కరెంట్ కోతలు వంటి సమస్యలతో సతమతమవుతున్న రైతన్నలు పదేళ్ల నుంచీ చెరకు సాగును తగ్గిస్తూ వస్తున్నారు. మెతుకుసీమలోనే 12 మండలాల చెరుకు రైతుల ప్రయోజనార్థం మంభోజిపల్లిలో నిజాం షుగర్ ఫ్యాక్టరీని నిర్మించారు. ఈ ఫ్యాక్టరీ సుమారు 4 వేల మంది రైతులకు ఆశించిన మేర సేవలందించింది. రానురానూ అనేక సమస్యలతో ఫ్యాక్టరీని కొంతభాగం ప్రైవేట్ భాగస్వాములకు అమ్మేశారు. ఈ ఏడాది తిరిగి తమ ఆధీనంలోకి తీసుకునే యోచనలో ఉన్న ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంలో తాత్సారం చేసింది. ఇదే సమయంలో జిల్లాలోని ఇతర చెరకు ఫ్యాక్టరీల యాజమాన్యాలు కూడా నవంబర్ నెలలో క్రషింగ్ ప్రారంభిస్తామని ప్రకటించాయి. కానీ మెదక్ ఎన్డీఎస్ఎల్ ఫ్యాక్టరీ యాజమాన్యం మాత్రం డిసెంబర్ మొదటివారంలో క్రషింగ్ ప్రారంభించేందుకు సిద్ధమైంది. దీంతో తాము తీవ్రంగా నష్టపోతామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆలస్యమైతే అంతే.. మెదక్ ప్రాంతంలో పదినెలల కాలాన్ని నిర్ణయించుకుని నవంబర్‌లో చెరకు పంటనే వేస్తారు. ఈ మేరకు మరుసటి ఏడాది సెప్టెంబర్‌లోపు క్రషింగ్ చేపట్టాలి. కానీ గత ఏడాది రెండు నెలలు ఆలస్యంగా ఎన్డీఎస్ఎల్ యాజమాన్యం నవంబర్నెలలో క్రషింగ్ ప్రారంభించింది. ఈసారి కనీసం నవంబర్ నెలలోనే ప్రారంభించినా అప్పటికే పంట 12 నెలల కాలం దాటిపోతుంది. డిసెంబర్లో ప్రారంభిస్తే 13 నెలలు పడుతుంది. దీంతో చెరకు ఎండిపోయి దిగుబడులు తగ్గిపోతాయని రైతులు వాపోతున్నారు. ఇప్పటికే వర్షాలు లేక కరెంట్ కోతలతో చెరుకు పంట ఎండిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో 50 రోజులపాటు పంటను కాపాడాలంటే తలకు మించిన భారమవుతుంద ంటున్నారు. అలాగే చెరుకు పంట నరికిన తర్వాత రబీలో పంటలు వేసుకోవాలంటే సమయం దాటిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెరుకు క్రషింగ్ పూర్తయ్యే సరికి ఫిబ్రవరి నెల దాటిపోతుందని ఆ సమయంలో ఏ పంటలు వేసుకోలేని పరిస్థితి నెలకొంటుందని రైతులు వాపోతున్నారు. చెరుకు నరకడం ఆలస్యమవుతుంటే కూలీల రేట్లు కూడా పెరిగి పోతాయని చెబుతున్నారు. తగ్గుతున్న చెరకు సాగు మంజీరా తీరంలో రోజురోజుకూ చెరుకు పంట సాగు తగ్గిపోతోంది. కరెంట్ కోతలు, కూలీల ఇబ్బందులు, ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్లక్ష ్యం, పెట్టుబడులకనుగుణంగా దిగుబడులు రాక రైతులు చెర కు సాగుకు స్వస్తి చెబుతున్నారు. 2006లో మంభోజిపల్లి ఎన్డీఎస్ఎల్లో 3,84, 000 టన్నుల చెరకు క్రషింగ్ అయ్యింది. అయితే అది గత ఏడాది 1,52,000 టన్నులకు తగ్గిపో గా, ఈసారి 1,37,000 టన్నులకు పడిపోయిం ది. ఫ్యాక్టరీలో రోజుకు 2,500 టన్నుల చెరకు క్రషింగ్ చేసే అవకాశం ఉంది. అయినప్పటికీ మొరాయిస్తున్న యంత్రాలు, విద్యుత్ సమస్యలు తదితర కారణాల వల్ల తరచుగా ఫ్యాక్టరీలో క్రషింగ్ ఆగిపోతుందని రైతులు ఆరోపిస్తున్నారు. ఫలితంగా ఒక్కోసారి నాలుగైదు రోజు లపాటు తమ చెరకు పంట ఎండలో ఎండుతుండటంతో తూకంలో భారీగా నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు. యాజమాన్యాలు ఇస్తున్న ధర కూడా తమకు గిట్టుబాటు కావడం లేదని, అందుకే ప్రత్యామ్నాయ పంటలవైపు దృష్టి సారిస్తున్నామని తెలిపారు.