Nizam Mir Osman Ali Khan
-
నిజాం మ్యూజియంలో చోరీ
సాక్షి, హైదరాబాద్ : నిజాం మ్యూజియంలో సోమవారం భారీ చోరీ జరిగింది. పాతబస్తీలోని డబీర్‌పూరాలో గల నిజాం మ్యూజియంలో విలువైన టిఫిన్ బాక్స్‌లు, వజ్రాలున్న కప్ సాసర్ను దొంగలు అపహరించారు. అర్థరాత్రి మ్యూజియం వెంటిలేటర్ ధ్వంసం చేసిన దుండుగులు తాడుతో లోపలకి దిగిన చోరీకి పాల్పడ్డారు. పది సీసీ కెమెరాల కన్నుగప్పి దొంగతనం చేశారు. ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్‌కు చెందిన విలువైన పురాతన వస్తువులను దుండుగులు దోచుకున్నారు. కాగా నిజాంలకు చెందిన విలువైన వస్తువులన్నీ ఈ మ్యూజియంలోనే ఉన్నాయి. -
నిజాం మ్యూజియంలో భారీ చోరీ
-
నిజాం మ్యూజియంలో ఫొటో ఎగ్జిబిషన్
యాకుత్‌పురా: ఏడో నిజాం హెచ్‌ఈహెచ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 50వ వర్ధంతి సందర్భంగా శుక్రవారం పురానీహవేలిలోని నిజాం మ్యూజియంలో ఆయన అంత్యక్రియలకు సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1967 ఫిబ్రవరి 24న దివంగతులయా్యరని నిజాం మ్యూజియం క్యూరేటర్ భాస్కర్ రావు తెలిపారు. మ్యూజియంలో ఉస్మాన్ అలీ ఖాన్ ధరించిన బట్టలు, వస్తువులు, ఆభరణాలతో పాటు ఇప్పటికే సిటీ మ్యూజియం కొనసాగుతుందన్నారు. ఆయన అంత్యక్రియల్లో 10 లక్షల మంది ప్రజలు హజరయా్యరన్నారు. అంత్యక్రియల సందర్భంగా తీసిన ఫోటోలను ప్రత్యేకంగా ప్రదర్శనలో ఉంచారు. ఈ నెల 28వ తేదీ వరకు ఈ ఫోటో ప్రదర్శన కొనసాగనుంది.