షుగర్ ఫ్యాక్టరీని కాపాడుకుంటాం
నిజాం షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల ఆమరణ దీక్ష ప్రారంభం
బోధన్: ప్రాణాలైనా అర్పిస్తాం.. నిజాం షుగర్ ఫ్యాక్టరీని కాపాడుకుంటామని కార్మికులు నినదించారు. ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుని పూర్వవైభవం తెస్తామన్న సీఎం కేసీఆర్.. ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. 2015 డిసెంబర్ 23న ఫ్యాక్టరీ యాజమాన్యం లేఆఫ్ ప్రకటించి ఫ్యాక్టరీని మూసివేసింది. లేఆఫ్ ఎత్తివేసి ఫ్యాక్టరీని తిరిగి తెరిపించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, బకాయి వేతనాలు వెంటనే విడుదల చేసి ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఎన్డీఎస్ఎల్ కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ నేతృత్వంలో గురువారం ఉదయం నిజామాబాద్ జిల్లా బోధన్‌లోని శక్కర్‌నగర్ ఎన్డీఎస్ఎల్ గేట్ ఎదుట కార్మికులు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. అఖిల పక్ష నాయకులు వారికి మద్దతు ప్రకటించారు.