ఇండియా ‘బ్లూ’లో అక్షత్
సాక్షి, విశాఖపట్నం: గత రెండేళ్లుగా దేశవాళీ క్రికెట్లో నిలకడైన ప్రదర్శన కనబరుస్తున్న హైదరాబాద్ బ్యాట్స్మన్ ప్రొద్దుటూరి అక్షత్ రెడ్డికి మరో చక్కటి అవకాశం లభించింది. ఎన్కేపీ సాల్వే చాలెంజర్ ట్రోఫీలో పాల్గొనే ఇండియా ‘బ్లూ’ జట్టులో అక్షత్కు చోటు లభించింది.
మంగళవారం ఇక్కడ జరిగిన సమావేశంలో సెలక్టర్లు చాలెంజర్ వన్డే టోర్నీ కోసం ఇండియా ‘బ్లూ’, ఇండియా రెడ్ జట్లను ఎంపిక చేశారు. బ్లూ జట్టుకు యువరాజ్, రెడ్ జట్టుకు ఇర్ఫాన్ పఠాన్ కెప్టెన్లుగా వ్యవహరిస్తారు. జాతీయ వన్డే చాంపియన్ ఢిల్లీ టోర్నీలో మూడో జట్టుగా బరిలోకి దిగుతుంది. ఈ నెల 26నుంచి 29 వరకు ఇండోర్లో ఈ టోర్నీ జరుగుతుంది.