no competition
-
ఏప్రిల్ 15 వరకు ఆటల్లేవ్!
న్యూఢిల్లీ: దేశంలో కరోనా (కోవిడ్–19) వ్యాప్తి అరికట్టే చర్యల్లో భాగంగా జాతీయ స్పోర్ట్స్ సమాఖ్యలకు (ఎన్ఎస్ఎఫ్) క్రీడల మంత్రిత్వ శాఖ గురువారం కీలక ఆదేశాలను జారీ చేసింది. ఏప్రిల్ 15 వరకు దేశంలో ఎటువంటి టోర్నమెంట్లను, సెలెక్షన్ ట్రయల్స్‌ను నిర్వహించరాదని స్పష్టం చేసింది. దాంతో పాటు ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన అథ్లెట్లు ఒలింపిక్స్ సన్నాహక క్యాంపుల్లో స్వీయ నిర్బంధంలో ఉంటూ ఒలింపిక్స్ కోసం సిద్ధమయ్యేలా చూడాల్సిన భాద్యతను ఎన్‌ఎస్‌ఎఫ్‌లకు అప్పగించింది. వారిని క్యాంపుతో సంబంధం లేని కోచ్‌లు గానీ, ఏ ఇతర సిబ్బంది గానీ కలవకుండా జాగ్రత్త వహించాలని సూచించింది. ‘మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఒలింపిక్స్ కోసం సన్నద్ధం అవుతున్న క్రీడాకారులు మాత్రమే ప్రస్తుతం శిక్షణ శిబిరాల్లో ఉన్నారు.’ అని కేంద్ర క్రీడా మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. కరోనా ప్రభావం అధికంగా ఉన్న దేశాల్లో టోర్నమెంట్లు ముగించుకుని దేశానికి వస్తున్న అథ్లెట్లపై నిఘా ఉంచామని రిజిజు అన్నారు. వారు దేశంలో అడుగుపెట్టిన వెంటనే స్వీయ నిర్బంధంలోకి వెళ్లేలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. 15 తర్వాతే ఐపీఎల్‌పై నిర్ణయం ఇండియన్ ప్రీమియర్ లీగ్ తాజా సీజన్ భవితవ్యంపై అడిగిన ప్రశ్నకు స్పందించిన రిజిజు... ఏప్రిల్ 15 తర్వాతే ఐపీఎల్‌పై స్పష్టమైన నిర్ణయం రావచ్చన్నారు. అంతేకాకుండా ఐపీఎల్ అనేది బీసీసీఐ చేతుల్లో ఉందని... అది ఒలింపిక్ క్రీడ కాదన్నారు. ప్రస్తుత పరిస్థితిల్లో తాము ఆటగాళ్ల, ప్రేక్షకుల ఆరోగ్య భద్రతకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఆయన వెల్లడించారు. -
పోటీ లేకుండాపోయింది
గతేడాది సెప్టెంబర్ చివరి వారంలో ముగ్గరు పెద్ద హీరోల సినిమాలు ఒకే వారంలో బాక్సాఫీస్ వద్ద క్లాష్ అవుతాయనుకున్నారు. అవే.. బాలకృష్ణ హీరోగా పూరి జగన్నాద్ దర్శకత్వంలో రూపొందిన ‘పైసా వసూల్’, మహేశ్‌బాబు హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ, తెలుగు బైలింగ్వల్ ‘స్పైడర్’, బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్ త్రిపాత్రిభినయం చేసిన ‘జై లవ కుశ’. అనుకున్నట్లుగా అయితే.. సెప్టెంబర్ 21న ‘జై లవ కుశ’, 27న ‘స్పైడర్’, ‘పైసా వసూల్’ రిలీజ్ కావాల్సింది. కానీ.. చెప్పిన టైమ్కన్నా ముందే ‘పైసా వసూల్’ చిత్రాన్ని సెప్టెంబర్ 1న రిలీజ్ చేశారు చిత్రబృందం. ‘జై లవ కుశ’ స్టెప్టెంబర్ 21న, ‘స్పైడర్’ 27న వచ్చాయి. మొత్తం మీద పోటీ లేకుండాపోయింది. -
మహేశ్‌కి పోటీ లేదు!
‘‘మాతృత్వం ఓ తీయని అనుభూతి. ఆ అనుభూతిని ప్రపంచంలో వేరే ఏదీ ఇవ్వలేదు. పేరు ప్రఖ్యాతులు, డబ్బు... ఇవేవీ ఇవ్వనంత ఆనందాన్ని బిడ్డలిస్తారు. అసలీ ఆనందం ముందు తక్కినవన్నీ పేలవంగానే అనిపిస్తాయి’’ అని ఎంతో మురిపెంగా చెప్పారు నమ్రతా మహేశ్. ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె పలు విషయాలు ప్రస్తావించారు. తన భర్త మహేశ్‌బాబు గురించి చెబుతూ - ‘‘నేను తనకు అభిమానిని. ప్రస్తుతం పరిశ్రమలో తనంత ప్రతిభ ఉన్నవాళ్లు కానీ తనకన్నా మెరుగైనవాళ్లు కానీ లేరని నా ఫీలింగ్. మహేశ్ ఈరోజు ఈ స్థాయికి చేరుకోవడం నాకు చాలా గర్వంగా ఉంది. మొదట్లో తన తండ్రి సపోర్ట్ బాగా ఉపయోగపడింది. ఆ తర్వాత తనంతట తానుగా కష్టపడి ఈ స్థాయికి వచ్చాడు. మంచో, చెడో.. ఏ నిర్ణయమైనా నేనే తీసుకుంటానని మహేశ్ నిర్మొహమాటంగా చెబుతాడు. కానీ, మహేశ్ విషయంలో నా జోక్యం ఎక్కువ ఉంటుందని అందరూ అనుకుంటారు. నేనెప్పుడూ పర్సనల్‌గా స్టూడియోలో కూర్చుని ఏ సినిమా చేస్తే బాగుంటుంది? ఏ లుక్ అయితే బాగుంటుంది? ఎలాంటి కాస్ట్యూమ్స్ వేసుకోవాలి? లాంటి విషయాల గురించి చర్చించను. చిన్న చిన్న సలహాలు మాత్రమే ఇస్తాను. మహేశ్ బిడియస్తుడు. షూటింగ్ లొకేషన్‌కి ఫోన్ తీసుకెళ్లడు. తననెవరైనా కాంటాక్ట్ చేయాలంటే నాకు ఫోన్ చేస్తారు. దానివల్ల తనకు సంబంధించిన అన్నింట్లోనూ నా జోక్యం ఎక్కువ ఉంటుందని భావిస్తారు. సినిమాలపరంగా నిర్ణయాలన్నీ తనవే. సొంత నిర్ణయాలు తీసుకునే ఈ స్థాయికి ఎదిగాడు. మహేశ్‌కి పోటీ లేదు. తన సమకాలీనులందరికన్నా పై స్థాయిలోనే ఉన్నాడు. తనను నేను పెళ్లి చేసుకున్నప్పుడు తనే బెస్ట్ అనుకున్నాను. అప్పట్లో తనకన్నా మంచి స్థాయిలో ఉన్నవాళ్లున్నప్పటికీ నాకు అలానే అనిపించింది’’ అన్నారు. పలు ప్రముఖ ఉత్పత్తులకు మహేశ్‌బాబు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో మాత్రం తన జోక్యం మెండుగానే ఉంటుందని, అది కూడా మహేశ్ ఇష్టప్రకారమేనని స్పష్టం చేశారు నమ్రత.