No Retirement
-
ప్రపంచంలోనే సీనియర్ ఆఫీస్ మేనేజర్
ఈ మే 15 కి యసూకో తమాకీ 91 లోకి ప్రవేశిస్తున్నారు. పుట్టిన రోజు అని ఆమె సెలవు పెడితే తప్ప, ఆరోజూ ఆమె ఆఫీస్‌కు వెళతారు. అయితే ఆ రోజు శనివారం వచ్చింది. తర్వాత ఆదివారం. పక్కపక్కన రెండు సెలవు రోజులు. ఒకవేళ ఆమె పుట్టిన రోజు ఆ రెండు రోజుల్లో కాకుండా తక్కిన ఐదు పని దినాల్లో ఏ రోజు వచ్చినా ఆమె సెలవు పెట్టి ఇంట్లోనే సెలబ్రేషన్ చేసుకుంటారని నమ్మకంగా అనుకోలేం. బహుశా ఆమె ఆఫీస్‌కు వెళ్లేందుకు మొగ్గుచూపడానికే అవకాశం ఎక్కువ! అరవై ఐదేళ్లుగా ఒకే కంపెనీలో పని చేస్తున్నారు యసూకో! అప్పట్నుంచీ ఆమె ఆఫీస్ మేనేజరే. అత్యవసరం అయితే తప్ప ఏ రోజూ సెలవు తీసుకోలేదు. వారానికి ఐదురోజులు, రోజుకు ఏడున్నర గంటలు షిఫ్టులో మిగతా సిబ్బందిలా పని చేస్తూనే వస్తున్నారు. ఈ తొంభై ఏళ్ల వయసులోనూ ఆమె అలసిపోలేదు. అలసట లేకుండా ఉండటానికి ఉద్యోగం ఆమెకు ఇష్టమైన వ్యాపకం కావచ్చు. ‘వరల్డ్ ఓల్డెస్ట్ ఆఫీస్ మేనేజర్’ అని ఏప్రిల్ 8న గిన్నెస్ ఆమెను కీర్తించింది. ఆమె చేతికి ‘రికార్డు’ పత్రాన్ని అందించింది. 1930లో జన్మించారు యసూకో. 1956లో ఒసాకాలోని ‘సన్‌కో ఇండస్ట్రీస్’ అనే ఒక ట్రేడింగ్ కంపెనీలో చేరారు. స్క్రూలను తయారు చేయడంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సన్‌కో.. మిగతా లోహపు మెటీరియల్స్ కూడా ఉత్పత్తి చేస్తుంటుంది. ఆ సంస్థలో అటుఇటుగా ఇరవై ఐదేళ్ల వయసులో ఆఫీస్ మేనేజర్ గా చేరారు. నాటి నుంచి అరవై ఐదేళ్లుగా అదే హోదాలో కొనసాగుతున్నారు. ఆఫీస్ అకౌంట్స్ చూడ్డం ఆమె ప్రధాన విధి. సిబ్బంది జీతాలు, బోనస్‌లు, పన్ను లెక్కలు అందులో భాగం. ఇప్పుడైతే మైక్రోసాఫ్ట్ ఎక్సెల్‌తో లెక్కలన్నీ చక్కబెడుతున్నారు కానీ, మొదట్లో అన్నీ కాగితాల మీదే చకచకా! ఇప్పుడు ఫేస్బుక్, స్మార్ట్‌ఫోన్ కూడా ఉపయోగిస్తున్నారు. గిన్నిస్ గుర్తింపు పత్రంతో యసూకో తమాకీ, ‘సీనియర్’ ఆఫీస్ మేనేజర్ వయసు పెరుగుతున్న కొద్దీ ఒంట్లో ఓపిక తగ్గి పని మీద ఉత్సాహం నశించే అవకాశం ఉంది. అయితే యసూకో శక్తి ఆమె పనే! ‘‘పని చేస్తున్నంత సేపూ నాకు ఉత్సాహంగా ఉండటం మాత్రమే కాదు, కొత్త ఉత్సాహం ఏదో నాలో జమ అవుతుంటుంది’’ అని నవ్వుతూ అంటారు యసూకో. అందుకే ఆమె రిౖటెర్మైంట్ తీసుకోలేదు. వాళ్లూ ఇవ్వలేదు. సన్కోలోని మిగతా ఉద్దండ ఆఫీస్ మేనేజర్లంతా ఆమె ఇచ్చిన తర్ఫీదుతో ఉద్యోగంలో నిలబడినవారే! అకౌంట్స్‌కి కొత్తగా ఎవరైనా వచ్చి చేరారంటే.. మొదట ఆమె ఆశీర్వాదం తీసుకోవలసిందే. అప్పుడు ఆమె ఒకటే మాట చెబుతారు. ‘‘సంస్థ కోసం నమ్మకంగా పని చేయండి. సంస్థ మిమ్మల్ని ఎప్పటికీ వదులుకోదు’’ అని. ఆ మాట ఆమె చెబితే ఎవరైనా వినకుండా ఉంటారా! గిన్నిస్ రికార్డు సర్టిఫికెట్‌ను అందుకుంటున్నప్పుడు ఆమె తన ఆఫీస్ పట్ల కృతజ్ఞతను వ్యక్తం చూస్తూ.. ‘‘సంస్థ నా నుంచి ఏమైతే ఆశించిందో అదే చేస్తూ వచ్చాను. అదేమీ విశేషం కాదు కదా’’ అన్నారు. ‘‘ఇన్నేళ్లుగా మీరెలా చేయగలుగుతున్నారు’’ అని గిన్నెస్ ప్రతిధిని ఒకరు ఆమెను అడిగారు. ‘‘ఇతరులకు చేదోడుగా ఉండటం అనేది నా స్వభావం. ఆఫీస్లోనైతే చైర్మన్‌కి, ఇతర మేనేజర్లకు, సహోద్యోగులకు సహాయంగా ఉండటంలోని ఆనందమే నన్ను ఇన్నేళ్లుగా ఆఫీస్‌వైపు నడిపిస్తోందనే అనుకుంటున్నాను’’ అని సమాధానమిచ్చారు యసూకో. ‘‘నేనసలు రిటైర్మైంట్ ఉంటుందన్న ఆలోచననే ఏనాడూ తెచ్చుకోను. సంవత్సరం తర్వాత సంవత్సరం గడిచిపోతాయి. వాటితోపాటే నేనూ నడుస్తుంటాను. నన్ను నడిపిస్తున్నది నా ఆఫీస్’’ అని కూడా అన్నారు యసూకో. -
ప్రతి పంచాయతీలో మాదిరి పాఠశాల
=‘ప్రైవేటు’ సహకారంతో.. =ఇందు కోసం స్థానికంగా ప్రత్యేక కమిటీ =గౌరవాధ్యక్షుడిగా స్థానిక ఎమ్మెల్యే =భారీ విరాళం ఇచ్చిన దాత అధ్యక్షుడు =విద్యా సంవత్సరం మధ్యలో టీచర్లకు నో రిటైర్మెంట్ =మంత్రి కిమ్మనె రత్నాకర్ స్పష్టీకరణ సాక్షి, బెంగళూరు : రాష్ర్టంలోని ప్రతి గ్రామ పంచాయతీ కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలను ప్రైవేటు సంస్థలు, వ్యక్తుల సహకారంతో మాది రి పాఠశాలగా తీర్చి దిద్దనున్నట్లు పాఠశాల లవిద్యా శాఖ మంత్రి కిమ్మనె రత్నాకర్ వెల్లడిం చారు. నగరంలో శనివారం తనను కలసిన విలేకరులతో ఆయన మాట్లాడారు. మాదిరి పాఠశాలలో డైనింగ్ హాల్, వంట గది, మరుగు దొడ్డి స హా కనీసం ఎనిమిది గదులు ఉంటాయన్నారు. ప్రతి పాఠశాలలో భవనాల నిర్మాణానికి సగటు న రూ.25 లక్షలు వ్యయం కాగలదన్నారు. దీని కోసం స్థానికంగా ప్రత్యేక కమిటీని ఏర్పాటు చే యనున్నామన్నారు. కమిటీకి స్థానిక ఎమ్మెల్యే గౌరవాధ్యక్షుడుగా ఉంటారని, పెద్ద మొత్తంలో అందించే దాత అధ్యక్షుడుగా వ్యవహరిస్తారని వివరించారు. ప్రధానోపాధ్యాయుడు కారదర్శి గా ఉంటారని చెప్పారు. కాగా రాష్ట్రంలోని 50 వేల పాఠశాలల్లో తాగునీరు, మరుగు దొడ్ల ని ర్మాణం తదితర మౌలిక సదుపాయాలను క ల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందు కోసం ప్రతి జిల్లా కు రూ.100 కోట్లు అవసరమన్నా రు. అయితే ఇప్పటికిప్పుడు ఇంత మొత్తాన్ని ప్రభుత్వం విడుదల చేసే పరిస్థితి లేదన్నారు. అందుకే ప్రైవేటు వ్యక్తులు, కార్పొరేట్ సంస్థల సహకారం తీసుకుంటున్నట్లు చెప్పారు. దాతల వివరాలు, వారు ఇచ్చిన, ఖర్చయిన మొత్తం త దితర సమాచారం కోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందిస్తున్నామన్నారు. తద్వారా పాదర్శక త ఏర్పడుతుందన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ పనులు ప్రారంభమవుతాయన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 24,000 ఉపాధ్యాయ, లెక్చరర్ల పోస్టు లు ఖాళీగా ఉన్నాయన్నారు. హై-క అభివృద్ధి మండలి ఏర్పడిన వెంటనే ఆ ప్రాం తంలో ఖాళీగా ఉన్న ఆరు వేల పోస్టులను భర్తీ చేస్తామని వెల్లడించారు. కాగా ఈ విద్యా సంవత్సరం మధ్యలో రిటైర్ కావాల్సి న ఉపాధ్యాయులను సంవత్సరం ఆఖరు వరకు కొనసాగిస్తామన్నారు. ఆర్థిక శాఖ నుంచి అనుమతి లభించిన వెంటనే నాన్-టీచిం గ్ పోస్టులను భర్తీ చేస్తామని ఆయన తెలిపారు.