=‘ప్రైవేటు’ సహకారంతో..
=ఇందు కోసం స్థానికంగా ప్రత్యేక కమిటీ
=గౌరవాధ్యక్షుడిగా స్థానిక ఎమ్మెల్యే
=భారీ విరాళం ఇచ్చిన దాత అధ్యక్షుడు
=విద్యా సంవత్సరం మధ్యలో టీచర్లకు నో రిటైర్మెంట్
=మంత్రి కిమ్మనె రత్నాకర్ స్పష్టీకరణ
సాక్షి, బెంగళూరు : రాష్ర్టంలోని ప్రతి గ్రామ పంచాయతీ కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలను ప్రైవేటు సంస్థలు, వ్యక్తుల సహకారంతో మాది రి పాఠశాలగా తీర్చి దిద్దనున్నట్లు పాఠశాల లవిద్యా శాఖ మంత్రి కిమ్మనె రత్నాకర్ వెల్లడిం చారు. నగరంలో శనివారం తనను కలసిన విలేకరులతో ఆయన మాట్లాడారు. మాదిరి పాఠశాలలో డైనింగ్ హాల్, వంట గది, మరుగు దొడ్డి స హా కనీసం ఎనిమిది గదులు ఉంటాయన్నారు. ప్రతి పాఠశాలలో భవనాల నిర్మాణానికి సగటు న రూ.25 లక్షలు వ్యయం కాగలదన్నారు. దీని కోసం స్థానికంగా ప్రత్యేక కమిటీని ఏర్పాటు చే యనున్నామన్నారు.
కమిటీకి స్థానిక ఎమ్మెల్యే గౌరవాధ్యక్షుడుగా ఉంటారని, పెద్ద మొత్తంలో అందించే దాత అధ్యక్షుడుగా వ్యవహరిస్తారని వివరించారు. ప్రధానోపాధ్యాయుడు కారదర్శి గా ఉంటారని చెప్పారు. కాగా రాష్ట్రంలోని 50 వేల పాఠశాలల్లో తాగునీరు, మరుగు దొడ్ల ని ర్మాణం తదితర మౌలిక సదుపాయాలను క ల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందు కోసం ప్రతి జిల్లా కు రూ.100 కోట్లు అవసరమన్నా రు. అయితే ఇప్పటికిప్పుడు ఇంత మొత్తాన్ని ప్రభుత్వం విడుదల చేసే పరిస్థితి లేదన్నారు.
అందుకే ప్రైవేటు వ్యక్తులు, కార్పొరేట్ సంస్థల సహకారం తీసుకుంటున్నట్లు చెప్పారు. దాతల వివరాలు, వారు ఇచ్చిన, ఖర్చయిన మొత్తం త దితర సమాచారం కోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందిస్తున్నామన్నారు. తద్వారా పాదర్శక త ఏర్పడుతుందన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ పనులు ప్రారంభమవుతాయన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 24,000 ఉపాధ్యాయ, లెక్చరర్ల పోస్టు లు ఖాళీగా ఉన్నాయన్నారు. హై-క అభివృద్ధి మండలి ఏర్పడిన వెంటనే ఆ ప్రాం తంలో ఖాళీగా ఉన్న ఆరు వేల పోస్టులను భర్తీ చేస్తామని వెల్లడించారు. కాగా ఈ విద్యా సంవత్సరం మధ్యలో రిటైర్ కావాల్సి న ఉపాధ్యాయులను సంవత్సరం ఆఖరు వరకు కొనసాగిస్తామన్నారు. ఆర్థిక శాఖ నుంచి అనుమతి లభించిన వెంటనే నాన్-టీచిం గ్ పోస్టులను భర్తీ చేస్తామని ఆయన తెలిపారు.