వైన్ స్కాన్
నిజామాబాద్ క్రైం: ఇక నుంచి మద్యం అమ్మకాలు పారదర్శ కం కానున్నాయి. దుకాణ యజమానులు నాన్‌డ్యూటీ పెయిడ్(ఎన్డీపీ) మద్యం అమ్మకాలు జరిపేందుకు వీలుండదు. ఎందుకంటే ఎక్సైజ్‌శాఖ వైన్స్‌ల్లో కొత్తగా 2డీ బార్‌కోడ్‌ను అమలు చేయనుంది. బాటిల్‌పై నుండే హోలోగ్రామ్‌పై కంప్యూటర్ స్కానర్‌తో పరిశీలించగానే ఆ వస్తువు ధరతో పాటు అది ఎక్కడ తయారైందో తదితర వివరాలు ప్రత్యక్షమవుతాయి. అయితే ఈ విధానాన్ని వైన్‌షాపు యజమానులు మా త్రం వ్యతిరేకిస్తున్నారు.
పాత ఎక్సైజ్ పాలసీ ప్రకారం ప్రస్తుతం మద్యం బాటిళ్లపై ఎక్సైజ్ అడిహసీవ్ లేబుల్ బార్కోడ్ ఉంటుంది. త్వర లో హోలోగ్రామ్ 2డీ బార్‌కోడ్‌ను తెలంగాణ ప్రభుత్వం అమలు పరుచనుంది. దీనికి సంబంధించి హెడానిక్ పాత్ ఫైన్డర్ సిస్టమ్ (హెచ్‌పీఎఫ్‌ఎస్) అనే స్టాఫ్‌వేర్‌ను రూపొందించింది. డిస్టిలరీ నుంచి మొదలుకుని మద్యం డిపోలు, వైన్‌షాపులను అనుసంధానం చేసే ప్రక్రియ చేపట్టింది. మద్యం బాటిల్‌పై స్కాన్ చేయగానే బాటిల్ తయారైన డిస్టిలరీ, డిస్టిలరీ నుంచి డిపో, డిపో నుంచి మద్యం దుకాణం, ఏ రకం బ్రాండ్, దాని ధర తదితర వివరాలు వస్తాయి. తద్వారా బాటిల్‌పై ఉన్న ఎమ్మార్పీ కంటే షాపు లో ఎక్కువ ధరకు అమ్మే పరిస్థితి ఉండదు.
గతంలో ఎమ్మార్పీ కంటే రూ. 10 నుంచి రూ. 20 అదనంగా వైన్స్‌షాపుల్లో వసూలు చేస్తుండేవారు. దాంతో మందుబాబుల జేబుకు చిల్లు పడేది. బార్కోడ్ విధానంతో అధిక వసూలుకు అడ్డుకట్ట పడనుంది. జిల్లా సరిహద్దు ప్రాంతాలలో నాన్‌డ్యూటీ పెయిడ్ లిక్కర్‌తో పా టు కల్తీ లిక్కర్‌ను విస్తృతంగా విక్రయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
బార్కోడ్ అమలైన పక్షంలో నాన్‌డ్యూటీపెయిడ్ లిక్కర్‌కు కూడ చెక్ పడే అవకాశాలు ఉన్నాయి. కాగా బార్కోడ్ విధా నం వైన్‌షాపు యజ మానులకు లాభం చేకూరే విధంగానే ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ప్రధానంగా వైన్‌షాపు యజమాని కౌంటర్ మీద ఉన్నా.. లేకున్నా కంప్యూటర్ నుంచి సెల్‌ఫోన్‌కు అనుసంధానం చేస్తే అమ్మకాలపై సంక్షిప్త సమాచారం వస్తుంది.
సరుకు కొనుగోలుకు సంబంధించి ఇదే ఆన్లైన్లో సేల్ ఆర్డర్ పెట్టుకోవచ్చు.అంతేకాకుండా ప్రతిరోజు అకౌంట్ వివరాలు తెలుసుకునేందుకు సులువవుతుం ది. దుకాణంలో ఎన్ని బాటిళ్లు అమ్ముడు పో యాయి, ఏఏ బాటిళ్లు విక్రయాలు జరుగుతున్నాయనే వివరాలు క్షణాల్లో తెలుసుకోవచ్చు.
అధికారులకు అండ్రాయిడ్ ఫోన్లు
తనిఖీల కోసం వెళ్లే అధికారులకు స్కానింగ్ అప్లికేషన్ ఉన్న అండ్రాయిడ్ ఫోన్లను ఇవ్వనున్నట్లు ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఈ ఫోన్ల ద్వారా మద్యం బాటిల్‌ను స్కానింగ్ చేసినప్పుడు పూర్తి వివరాలు సెల్లో వస్తాయని, తద్వారా అది నాన్‌డ్యూటీపేయిడ్ లిక్కరా? డ్యూటీపెయిడ్ లిక్కరా అనేది తేలిపోతుంది. ఇదిలా ఉండగా గతవారం మద్యం దుకాణాల ను ప్రారంభించిన వైన్‌షాపు యజమానులు బార్కోడ్ విధానంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఈ స్కానింగ్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతున్నారు. బాటిల్‌ను స్కానింగ్ చేయాలంటే ప్రధానంగా కంప్యూటర్, స్కానర్, ప్రింటర్ ఏర్పాటు చేసుకోవాలంటే రూ. 50 వేల నుంచి రూ. 80 వేల వరకు ఖర్చు అవుతుం ది. దానిని ఆపరేట్ చేసేందుకు విద్యార్హత కలి గిన ఇద్దరు కంప్యూటర్ ఆపరేటర్లను నియమించుకోవాలి. వారికి అధిక జీతం ఇచ్చి నియమించుకోవాల్సి వస్తుందని వాపోతున్నారు. ఇప్పటికే పర్మిట్ రూం పేరిటా రూ. 2 లక్షలు, ప్రివిలేజ్ పేరిట ఏడు రెట్ల మద్యం అమ్మిన తర్వాత 13 శాతం ట్యాక్స్ విధిస్తున్నారని, ఈ విధానం అమలు చేస్తే తీవ్రంగా నష్ట పోవాల్సి వస్తుందంటున్నారు.
పాత వ్యాపారులకు బార్కోడ్ విధి విధానాలు కొంత వరకు అవగాహన ఉన్న కొత్తగా ఈ రంగంలోకి వచ్చిన వ్యాపారులను బార్కోడ్ సమస్య పట్టిపీడిస్తోంది. ఈ నేపథ్యంలో 2డీ బార్కోడ్ విధానం అమలు అవుతుందా అనే దానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.