non-marital relationship
-
ప్రియుడితో కలసి మామను...
సదాశివపేట రూరల్(సంగారెడ్డి): అక్రమ సంబంధానికి అడ్డువస్తున్నాడని ఓ కోడలు తన ప్రియుడిని ఉసిగొల్పి తన మామను హత్య చేయించింది. సదాశివపేట సీఐ కేతిరెడ్డి సురేందర్‌రెడ్డి విలేకరుల సమావేశంలో శనివారం తెలిపిన వివరాల ప్రకారం.. గతేడాది డిసెంబర్ 30న సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం మల్లారెడ్డిపేట్ గ్రామానికి చెందిన బుడ్డోల రాములు(60)తన ఇంటికి ప్లాస్టింగ్ చేయించడానికి మేస్త్రీ కొరకు వెళ్లి మూడు రోజుల తర్వాత సదాశివపేట మండలంలోని బొబ్బిలిగామ శివారులో శవమై కనిపించాడు. దీంతో ఈనెల 1న అతడి భార్య దేవమ్మ తన భర్త మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టడం జరిగింది. పోలీసుల పరిశోధనలో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయీ. మృతుడి పెద్దకొడుకు భాగయ్య సుమారుగా ఒకటిన్నర సంవత్సరం నుంచి బొబ్బిలిగామ గ్రామానికి చెందిన పెద్దగొల్ల మల్లేశం దగ్గర ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తుండడంతో అప్పుడప్పుడూ పెద్దగొల్ల మల్లేశం మల్లారెడ్డిపేట్ గ్రామానికి వస్తూ వెళ్తుండేవాడు ఈ క్రమంలో భాగయ్య భార్య నవీనతో మల్లేశంకు పరిచయం ఏర్పడి అది అక్రమ సంబంధానికి దారి తీసింది. ఈ విషయం తెలిసిన మృతుడు రాములు, అతని భార్య దేవమ్మ పెద్దగొల్ల మల్లేశంను, కోడలు నవీనను పలుమార్లు వారించారు. దీంతో నవీన తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న మామను చంపాలి, లేదంటే నేనే నీ పేరుమీద చనిపోతా అని మల్లేశంను ఫోనులో బెదిరించగా.. మల్లేశం నవీన మామ రాములును ఎలాగైనా చంపాలని పథకం వేసుకున్నాడు. పథకంలో భాగంగా గతేడాది డిసెంబర్ 30న తన మామ మేస్త్రీ కొరకు మల్లారెడ్డిపేటలో తిరుగుతున్నాడని మల్లేశంకు చెప్పగా.. మేస్త్రీ గురించి తమ గ్రామానికి పోదామని తన మోటార్ సైకిల్‌పై బొబ్బిలిగామ గ్రామానికి తీసుకెళ్లాడు. అనంతరం మేస్త్రీ లేకపోవడంతో తాను అద్దెకు ఉంటున్న ఇంటికి వెళ్లి ఇద్దరు కలిసి కల్లు తాగారు. రాములు మత్తులోకి వెళ్లగా తనకు సాయం చేయాలని మొగులయ్య, చాంద్‌పాషా, దశరథ్‌గౌడ్, అంజయ్యలను కోరగా వారు నిరాకరించారు. దీంతో అదేరోజు రాత్రి ఇంటికి వెళ్దామని చెప్పి మోటార్ సైకిల్ పై తీసుకెళ్లి బొబ్బిలిగామ నుంచి మల్లారెడ్డిపేట్ వెళ్లే రోడ్డుకు ఎడమ వైపు తీసుకెళ్లి ఇనుప కర్రతో రాములు తలపై, ఇతర శరీర భాగాలపై కోట్టి రుమాల్తో గొంతుకు బిగించి చంపివేసినట్లు నిందితుడు తెలిపాడని సీఐ పేర్కొన్నారు. చాంద్ పాషా మాత్రం పరారీలో ఉన్నాడు. సిబ్బందికి అభినందనలు.. ఈ కేసులో మొదటినుంచి కష్టపడి కేసు చేధించడానికి పూర్తిగా సహకరించిన సిబ్బంది ఏఎస్ఐ కిష్టయ్య, సిబ్బంది జగన్, వెంకటేశం, శ్రీనివాస్, రమేష్, వీరేశంలను సీఐ ప్రత్యేకంగా అభినందించారు. -
ప్రియురాలి కోసం వేటకొడవలితో...
గీసుకొండ(పరకాల): తన ప్రియురాలిని వెంట తిప్పుకుంటున్నాడని టీఆర్ఎస్ నాయకుడిపై ఓ వ్యక్తి కొడవలితో హత్యా యత్నం చేసిన సంఘటన వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండలో ఆదివారం జరిగింది. బాధితుడు, పోలీసుల కథనం ప్రకారం.. గీసుకొండ మండలం గంగదేవిపల్లికి చెందిన టీఆర్ఎస్ పార్టీ నాయకుడు గోనె మల్లయ్య(మల్లారెడ్డి)ని గీసుకొండకు చెందిన ఓ ప్రభుత్వ కార్యాలయంలో పనిచేస్తున్న మహిళా అటెండర్ గ్యాస్ సేఫ్టీ డివైజ్ విక్రయానికి సంబంధించి ఏజెంట్‌గా చేర్పించింది. కాగా శని వారం మల్లారెడ్డితోపాటు టీమ్ లీడర్లు సదానందం, బాలిరెడ్డి, మహిళా అటెండర్ తమ కంపెనీ పనిపై కారులో సంగెం మండలం లోహిత గ్రామానికి బయల్దేరారు. వరంగల్ నగరంలోని అండర్‌బ్రిడ్జి దాటి వెళ్తుండగా గమనించిన మనుగొండ గ్రామానికి చెందిన బోయరాజు (ఊకల్ క్రాస్‌లో ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ యజమాని) బైక్‌పై వేగంగా వెళ్లి కారుకు అడ్డంగా పెట్టాడు. మహిళా అటెండర్‌ను ఎందుకు తీసుకెళ్తున్నారని గొడవపడ్డాడు. అదేరోజు రాత్రి ఆమె నిద్రిమాత్రలు మింగడంతో బంధువులు ఇచ్చిన సమాచారం మేరకు మల్లారెడ్డి తన కారులో తీసుకుని వెళ్లి ఆస్పత్రిలో చేర్పించాడు. ఆమె కోల్కోవడంతో ఆదివారం తెల్లవారుజామున ఇంటి వద్ద దింపి వెళ్లాడు. అక్కడికి బోయరాజు వచ్చి ఆమెతో గొడవపడి చంపుతానని బెదిరిం చాడు. వితంతువైన ఆమె, తాను ప్రేమించుకున్నామని, చాలా ఏళ్లుగా సహజీవనం చేస్తున్నామని, ఫొటోలు చూపుతూ ఆమెతో తిరగరాదని హెచ్చరించాడు. గీసుకొండలో ఎంపీపీ భర్త రాజ్‌కుమార్ వద్ద మాట్లాడుకుందామని చెప్పి మల్లారెడ్డి అక్కడికి వెళ్లాడు. ఉదయం గ్రామంలోని ఆంధ్రాబ్యాంకు ఎదురుగా హోటల్ వద్ద రాజ్‌కుమార్ ఉండగా అతడికి విషయం చెబుతుండగానే అక్కడే ఉన్న బోయ రాజు వెంట తెచ్చుకున్న వేట కొడవలితో మల్లారెడ్డి మెడపై వేటు వేయడానికి యత్నించాడు. అయితే చొక్కా కాలర్‌కు కొడవలి తగలటంతో మెడపై స్వల్ప గాయంతో ప్రాణాలతో బయటపడ్డాడు. రాజ్‌కుమార్ అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గీసుకొండ ఎస్సై విఠల్ తెలిపారు. -
పాపం పండింది..
సాక్షి, తిరువొత్తియూరు: భర్తను హత్య చేసి అదృశ్యమైన భార్య ఏడేళ్ల తరువాత గురువారం ప్రియుడితో సహా పోలీసులకు పట్టుబడింది. వివరాలు.. తూత్తుకుడి జిల్లా కులమన్‌కరిచల్ గ్రామానికి చెందిన సెంథిల్ కూలీ. ఇతని భార్య ముత్తులక్ష్మి(35). వీరికి ముగ్గురు పిల్లలు. ముత్తులక్ష్మి ఆ ప్రాంతంలోని దుకాణంలో పనిచేస్తుండేది. ఈ క్రమంలో దుకాణం యజమాని కుమారుడు మారిరామర్ (30)తో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న రెండు కుటుంబాల వారు వారిని మందలించారు. దీంతో ముత్తులక్ష్మి ప్రియుడితో కలిసి ఒట్టాన్ సత్రం సమీపంలోని వెల్లిమరత్తుపట్టికి ముగ్గురు పిల్లలతో కలిసి వచ్చేశారు. తన భార్య, పిల్లలు కనబడకపోవడంతో పలు చోట్ల గాలించిన సెంథిల్ చివరకు వారు ఉన్న చోటును తెలుసుకొని అక్కడికి వెళ్లి భార్యను ఇంటికి రమ్మని పిలిచాడు. దీనికి ముత్తులక్ష్మి తిరస్కరించింది. ఒత్తిడి చేయడంతో.. సెంథిల్ భార్యను ఇంటికి రమ్మని ఒత్తిడి చేయడంతో పథకం ప్రకారం భర్తను పోలియమ్మనూర్‌లోని తోట వద్దకు పిలిపించి ప్రియుడితో కలిసి హత్య చేసింది. తరువాత పిల్లలతో సహా కడలూర్‌కు పారిపోయారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఎనిమిది నెలలు తరువాత వారిని అరెస్టు చేసి, కోర్టులో హాజరు పరిచారు. తరువాత వారిద్దరూ బెయిల్‌పై విడుదలై అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ క్రమంలో వీరి కోసం గాలిస్తున్న పోలీసులు ఊలసత్రం ప్రాంతంలో దాగి ఉన్న ముత్తులక్ష్మి, మారిరామర్‌ను గురువారం అరెస్టు చేశారు. -
వివాహేతర సంబంధ నేపథ్యంలో మహిళ మృతి
వెంకటపాలెం (తుళ్లూరు రూరల్): వివాహేతర సంబంధం నేపథ్యంలో వివాహిత మృతి చెందిన సంఘటన తుళ్లూరు మండలం వెంకటపాలెం గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చీరాల వద్ద తోటావారిపాలెం గ్రామానికి చెందిన ప్రశాంతి కుమారి(25), ప్రకాశం జిల్లా సింగరాయకొండకు చెందిన బాపట్ల అశోక్ కుమార్ ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రశాంతి బీఎస్సీ నర్సింగ్ విద్యను పూర్తి చేసింది. దీంతో అశోక్ సింగరాయకొండలోనే ఉంటూ సిమెంట్ పని చేస్తూ భార్యను ప్రైవేటు ఆసుపత్రిలో జాయిన్ చేశాడు. అయితే రాజధానిలో పనులు అధికంగా ఉంటాయని వెంకటపాలెంకు వలస వచ్చారు. ఈ నేపథ్యంలో శనివారం పని ముగించుకుని అశోక్ భోజనానికి ఇంటికి వచ్చి తలుపు కొట్టగా భార్య తీయలేదు. ఈ క్రమంలో ఇంటిలో ఉన్న గ్రామ పంచాయతీ గుమస్తా పి.సత్యనారాయణ బయటకు వస్తూ అశోక్‌ను తోసుకుంటూ వెళ్లాడు. దీనిపై భార్యభర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. తీవ్ర మనస్తాపానికి గురైన ప్రశాంతి ఒంటిపై కిరోసిన్ పోసుకోగా, అశోక్ భార్యకు నిప్పు అంటించడంతో పెద్దగా కేకలు వేసింది. అశోక్ మంటలు ఆర్పి ఇంటి నుంచి బయటకు తీసుకొచ్చాడు. ఈ క్రమంలో భర్తకు కూడా స్వల్ప గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు ఇద్దరినీ విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తుళ్లూరు ఎస్సై సందీప్ ఆస్పత్రికి చేరుకుని బాధితురాలి వద్ద నుంచి వాగ్మూలాన్ని తీసుకున్నారు. చికిత్స పొందుతున్న ప్రశాంతి ఆదివారం తెల్లవారుజామున మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సందీప్ తెలిపారు.