norton
-
అక్కడ డొక్కు డొక్కు.. ఇక్కడ డుగ్గు డుగ్గు
రాయల్ ఎన్ఫీల్డ్.. యెజ్డీ.. జావా.. నార్టన్... బీఎస్ఏ.. విశ్వ విఖ్యాత బైక్ బ్రాండ్లు ఇవి. విదేశాల్లో మనుగడ సాధించలేక చేతులెత్తేసిన ఈ బ్రాండ్లన్నీ భారతీయుల చేతిలో మళ్లీ ప్రాణం పోసుకున్నాయి. అమ్మకాల్లో దుమ్మురేడమే కాదు.. మళ్లీ వాటిని గ్లోబల్ బ్రాండ్లుగా నిలబెట్టి మనోళ్లు సత్తా చాటుతున్నారు!మహీంద్రా కంపెనీ క్లాసిక్ లెజెండ్స్ తాజాగా ప్రఖ్యాత బ్రిటిష్ మోటార్‌సైకిల్ బ్రాండ్ బీఎస్ఏను భారత్‌లో ప్రవేశపెట్టడం తెలిసిందే. అక్కడ మూసేసిన ఈ కంపెనీని కొనుగోలు చేసి, మన మార్కెట్లో లాంచ్ చేసింది. విదేశీ బ్రాండ్లకు మన దగ్గర తిరిగి జీవం పోస్తూ... 1994లో ప్రారంభమైన ఈ ట్రెండ్ ఇప్పటికీ నాన్‌స్టాప్‌గా కొనసాగుతూనే ఉంది. ఇంగ్లాండ్‌లో కార్యకలాపాలను నిలిపేసిన బ్రిటిష్ మోటార్ సైకిల్ కంపెనీ రాయల్ ఎన్ఫీల్డ్ను ఐషర్ గ్రూప్ 1994లో చేజిక్కించుకుంది. అయితే, మన దగ్గర ఈ బ్రాండ్‌ను మళ్లీ జనాల్లోకి తీసుకెళ్లేందుకు ఆ కంపెనీకి 15 ఏళ్లు పట్టింది. 2009లో క్లాసిక్ 350, క్లాసిక్ 500 మోటార్ సైకిళ్లు డుగ్గు డుగ్గు మంటూ మళ్లీ మన రోడ్లపై పరుగులు తీయడం మొదలైంది. ఇప్పుడు యువతకు ఈ మోటార్ సైకిల్స్ అంటే ఎంత క్రేజో చెప్పాల్సిన పని లేదు! ‘2009లో విడుదల చేసిన క్లాసిక్‌తో రాయల్ ఎన్ఫీల్డ్ గ్లోబల్ కంపెనీగా అపూర్వ విజయం సొంతం చేసుకుంది. మొదట్లో ఏడాదికి 50,000 బుల్లెట్లను అమ్మడమే గగనంగా ఉన్న స్థాయి నుంచి ప్రస్తుతం అనేక మోడల్స్ దన్నుతో వార్షిక సేల్స్ 8.5 లక్షలకు ఎగబాకాయి’ అని కంపెనీ సీఈఓ గోవిందరాజన్ పేర్కొన్నారు. 2009 నుంచి ఇప్పటిదాకా రాయల్ ఎన్ఫీల్డ్ 75 లక్షల మోటార్ సైకిళ్లను విక్రయించగా అందులో 40 లక్షలు క్లాసిక్ మోడల్ కావడం మరో విశేషం. ఈ నెల 12న కూడా కంపెనీ కొత్త క్లాసిక్‌ను ప్రవేశపెట్టింది.యెజ్డీ.. కుర్రకారు హార్ట్ ‘బీట్’ అనుపమ్ తరేజా సారథ్యంలోని క్లాసిక్ లెజెండ్.. గ్లోబల్ బైక్ బ్రాండ్స్ జావా, యెజ్డీ, బీఎస్ఏలను భారతీయులకు మళ్లీ పరిచయం చేసింది. 1970లో మార్కెట్ నుంచి వైదొలగిన చెక్ కంపెనీ జావా.. 2018లో మనోళ్ల చేతికి చిక్కింది. అప్పటి నుంచి 1.4 లక్షల జావాలు రోడ్డెక్కాయి. గత నెల 13న జావా 42 మోడల్‌ను సైతం రంగంలోకి దించింది. ఇక అప్పట్లో అదిరిపోయే బీట్తో కుర్రోళ్ల మనను కొల్లగొట్టిన యెజ్డీ కూడా 1996లో అస్తమించి.. 2022లో లెజెండ్స్ ద్వారా తిరిగి ప్రాణం పోసుకుంది. 60 వేల బైక్‌లు ఇప్పటిదాకా అమ్ముడవ్వడం విశేషం. బీఎస్ఏ అయితే, 1973లోనే మూతబడింది. దాన్ని ఆనంద్ మహీంద్రా పోటాపోటీగా దక్కించుకుని యూకేతో పాటు భారత్‌లోనూ మళ్లీ ప్రవేశ పెట్టారు.అదే బాటలో టీవీఎస్, హీరో... ఇక దేశీ దిగ్గజం టీవీఎస్ కూడా మరో విఖ్యాత బ్రిటిష్ బైక్ బ్రాండ్ నార్టన్‌ను కేవలం రూ.153 కోట్లకు కొనుగోలు చేసింది. 2025 నాటికి తొలి మోడల్‌ను ప్రవేశపెట్టడంతో పాటు మూడేళ్లలో ఆరు కొత్త నార్టన్ బైక్‌లను తీసుకొచ్చే సన్నాహాల్లో ఉంది. ఈ ప్రఖ్యాత బ్రాండ్లను దక్కించుకోవడంతో పాటు వాటి చారిత్రక నేపథ్యాన్ని అలాగే కొనసాగించడం ద్వారా ఒరిజినాలిటీని కాపాడుతున్నామని తరేజా వ్యాఖ్యానించారు. బీఎస్ఏను భారత్‌లోనే తయారు చేస్తున్నా, దాని బ్రిటిష్ బ్రాండ్ ప్రాచుర్యం పదిలంగా ఉందన్నారు. ఇక భారత్‌లో నేరుగా ప్లాంట్ పెట్టి, చేతులెత్తేసిన హార్లీ డేవిడ్సన్కు హీరో మోటోకార్ప్ దన్నుగా నిలిచింది. ఆ కంపెనీతో జట్టుకట్టి మళ్లీ హార్లీ బైక్‌లను భారతీయులకు అందిస్తోంది. ఎక్స్440 బైక్‌ను ఇక్కడే అభివృద్ధి చేయడం విశేషం. దీన్ని దేశీయంగా హీరో ఉత్పత్తి చేస్తున్పప్పటికీ, ప్రామాణిక హార్లీ బైక్ బ్రాండ్ విలులో ఎలాంటి మార్పులు చేయలేదని కంపెనీ ప్రెసిడెంట్, సీఈఓ జోషెన్ జీట్స్ పేర్కొన్నారు. భారత్‌లో నేరుగా విక్రయాల్లో వెనుకబడ్డ బీఎండబ్ల్యూ మోటోరాడ్, టీవీఎస్‌తో జట్టుకట్టింది. టీవీఎస్ రూపొందించిన 500 సీసీ లోపు బైక్‌లు 60 వేలకు పైగా అమ్ముడవ్వడం మనోళ్ల సత్తాకు నిదర్శనం! → 2015లో మహీంద్రా మెజారిటీ పెట్టుబడితో ఫై క్యాపిటల్ ఓనర్ అనుపమ్ తరేజా క్లాసిక్ లెజెండ్స్ అనే కంపెనీని నెలకొల్పారు. జావా, యెజ్డీ, బీఎస్ఏ వంటి గ్లోబల్ ఐకాన్లను దక్కించుకుని, పునరుద్ధరించారు.→ 2013లో టీవీఎస్ బీఎండబ్ల్యూ మోటోరాడ్‌తో డీల్ కుదుర్చుకుంది, తద్వారా ప్రపంచ మార్కెట్ కోసం 500 సీసీ లోపు బైక్‌లను అభివృద్ధి చేసి, ఇంటా బయటా విక్రయిస్తోంది. 2020లో టీవీఎస్ మోటార్ కంపెనీ ప్రఖ్యాత బ్రిటిష్ మోటార్‌సైకిల్ బ్రాండ్ నార్టన్‌ను కొనుగోలు చేసింది; వచ్చే మూడేళ్లలో ఆరు కొత్త మోడల్స్‌ను ప్రవేశపెట్టే పనిలో ఉంది.→ 1994లో ఐషర్ గ్రూప్ ఇంగ్లాండ్‌లో పూర్తిగా అమ్మకాలను నిలిపేసిన బ్రిటిష్ బైక్ దిగ్గజం రాయల్ ఎన్ఫీల్డ్ను చేజిక్కించుకుంది. 2009లో ‘క్లాసిక్’ బ్రాండ్‌కు తిరిగి జీవం పోయడంమే కాదు.. గ్లోబల్ కంపెనీగా దీన్ని మళ్లీ నిలబెట్టింది.→ 2023లో హీరో మోటోకార్ప్ భారత్‌లో విఫలమై షట్టర్ మూసేసిన హార్లే డేవిడ్సన్కు మళ్లీ ఇక్కడ ప్రాణం పోసింది. ఎక్స్440 మోడల్‌ను విడుదల చేసి సక్సెస్ కొట్టింది.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
టీవీఎస్ చేతికి ఐకానిక్ బ్రిటిష్ బైక్ కంపెనీ
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ద్విచక్ర వాహన సంస్థ టూవీలర్ తయారీదారు టీవీఎస్ మోటార్స్ లిమిటెడ్, ఐకానిక్ బ్రిటిష్ బైక్ తయారీదారు నార్టన్ మోటార్ సైకిల్స్ (యుకె) లిమిటెడ్‌ను సొంతం చేసుకుంది. ఈ డీల్ మొత్తం విలువ రూ.153.12 కోట్లు అని టీవీఎస్ మోటార్స్ శుక్రవారం సాయంత్రం రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. కంపెనీకి చెందిన సింగపూర్ అనుబంధ సంస్థ ఈ మేరకు నార్టన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. నార్టన్‌కు చెందిన అన్ని ఆస్తులు, నార్టన్, దానికి సంబంధించిన అన్ని బ్రాండ్లను సోంతం చేసుకున్నామని వెల్లడించింది. ఈ డీల్ తమ స్థాయిని ప్రపంచవ్యాప్తంగా పెంచడానికి, కస్టమర్ల ఆకాంక్షలను తీర్చడానికి అపారమైన అవకాశాన్నిస్తుందని టీవీఎస్ మోటార్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సుదర్శన్ వేణు తెలిపారు. అంకితమైన వ్యాపార ప్రణాళికలతో నార్టన్ తన విలక్షణమైన గుర్తింపును నిలుపుకుంటుందని, బ్రిటిష్ కంపెనీ కస్టమర్లు, ఉద్యోగులతో టీవీఎస్ మోటార్ కలిసి పనిచేస్తుందన్నారు. ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్‌కు చెందిన జేమ్స్ లాన్స్‌డౌన్ నార్టన్ 122 సంవత్సరాల క్రితం(1898లో)నార్టన్ మోటార్‌సైకిల్స్‌ను ప్రారంభించారు. వీ4 ఆర్ఆర్, డామినేటర్, కమాండో 961 కేఫ్ రేసర్ ఎంకే-2, కమాండో 961 స్పోర్ట్ ఎంకే-2లు నార్టన్ మోడల్స్ బైక్ ప్రేమికులను ఆకట్టుకున్నాయి. TVS Motor Company announces the successful acquisition of Britain’s most iconic sporting motorcycle @Norton_Moto https://t.co/dBQsla0WKk pic.twitter.com/hv4CAUlRZE — TVS Motor Company (@tvsmotorcompany) April 18, 2020 -
ఆన్లైన్ షాపింగా.. అవి క్లిక్ చేయొద్దు..
కలెక్టరేట్: పండగల సీజన్ వచ్చేసింది. ఆన్లైన్లో పలు రకాల వెబ్సైట్లు డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్ ఆఫర్లతో ఆకర్షిస్తుంటాయి. ఇటీవల ఆన్లైన్ షాపింగ్ చాలామందికి క్రేజీగా మారింది. బిజీలైఫ్‌లో సమయం లేక నట్టింట్లో కూర్చుని షాపింగ్ చేస్తుంటారు. పలు కంపెనీలు ఇస్తున్న ఈఎంఐ ఆఫర్స్ కోసం ఆన్లైన్ షాపర్స్ ఆసక్తి కనబరుస్తున్నారు. దసరా, దీపావళి పండగలను పురస్కరించుకుని ప్రముఖ ఈ–కామర్స్ వెబ్సైట్లు సరికొత్త ఆఫర్లు ప్రకటించనున్నాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండకపోతే ఆన్లైన్ వినియోగదారులు నష్టపోయే ప్రమాదం పొంచి ఉంది. ఫామ్జాకింగ్తో పారాహుషార్... సాధారణంగా ఆన్లైన్ షాపింగ్ పండగల సమయాల్లో ఎక్కువగా జరుగుతుంటాయి. ఇదే సమయంలో హ్యాకర్స్ చేతివాటం ప్రదర్శిస్తుంటారు. ఆన్లైన్ షాపర్స్‌ను మాయ చేసి పేమెంట్ వివరాలను దొంగిలించే క్రమంలో హ్యాకర్లు రకరకాల ఎత్తుగడలతో ముందుకు వస్తున్నారు. తాజాగా వారు అనుసరిస్తున్న వ్యూహాల్లో ’ఫామ్‌జాకింగ్’ ఒకటి. ప్రముఖ సైబర్ సెక్యూరిటీ కంపెనీ నార్టాన్ వెల్లడించిన వివరాల ప్రకారం దసరా, దీపావళి పండగల రద్దీని పురస్కరించుకొని హ్యాకర్లు ఆన్లైన్ షాపర్స్‌గా మారి ‘ఫామ్‌జాకింగ్’ దాడులకు పాల్పడబోతున్నారు. ఈ ప్రమాదకర హ్యాకింగ్ దాడి నుంచి ఏ విధంగా బయటపడవచ్చనే దానిపై నార్టాన్ సెక్యూరిటీ రీసెర్చర్లు కొన్ని కీలక సూచనలు చేశారు. ఇలా తస్కరణ... ’ఫామ్‌జాకింగ్’లో భాగంగా హ్యాకర్లు ఓ ప్రమాదకర జావా స్క్రిప్ట్‌ను ఈ–కామర్స్ వెబ్సైట్లకు సంబంధించిన చెక్ అవుట్ వెబ్ పేజీలలో లోడ్ చేస్తారు. దీంతో ఈ పేజీలలో ఎంటర్ కాగానే నగదుకు సంబంధించిన వివరాలు హ్యాకర్ల సర్వర్స్‌లోకి వెళ్లిపోతాయి. ఈ హ్యాకింగ్ ఉచ్చులో బ్రిటిష్ ఎయిర్వేస్, టికెట్ మాస్టర్ వంటి ప్రముఖ వెబ్సైట్లు చిక్కుకున్నాయి. పర్యవసానంగా 3.8 లక్షల యూజర్లకు సంబంధించిన క్రెడిట్ కార్డుల వివరాలు హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లిపోయాయి. పాస్వర్డ్స్ ముఖ్యం... ’ఫామ్‌జాకింగ్’ దాడుల నుంచి ఆన్లైన్ అకౌంట్లను కాపాడుకునే క్రమంలో శక్తిమంతమైన, విభిన్నమైన పాస్‌వర్డ్‌లను సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఎంపిక చేసుకునే పాస్‌వర్డ్‌లో అప్పర్‌కేస్, లోయర్ కేస్ సింబల్స్ ఇంకా నెంబర్స్ తప్పకుండా ఉండేలా చూసుకోవాలి. ఒకే రకమైన పాస్‌వర్డ్‌ను మల్టీపుల్ అకౌంట్లకు ఉపయోగించవద్దు. అవి క్లిక్ చేయొద్దు... పరిచయం లేని వ్యక్తుల నుంచి వచ్చే మెసేజెస్ లేదా అటాచ్‌మెంట్స్‌ను ఓపెన్ చేసే ముందు ఒకటికి రెండుసార్లు క్రాస్ చెక్ చేసుకోవాలి. ఇదే సమయంలో ర్యాండమ్ లింక్స్‌పై క్లిక్ చేయొద్దు. సైబర్ నేరగాళ్లు మీ మిత్రులకు చెందిన ఈ–మెయిల్ లేదా సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కూడా మాలీషియస్ లింక్స్‌ను పంపించే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా వెబ్ లింక్‌పై క్లిక్ చేసే ముందు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవటం మంచిది. వైర్లెస్ కనెక్షన్స్తో జాగ్రత్త... కొత్త నెట్వర్క్ కనెక్టెడ్ డివైస్‌ను ఇన్స్టాల్ చేస్తున్నపుడు డీఫాల్ట్ పాస్‌వర్డ్‌ను కొత్త పాస్‌వర్డ్‌తో అప్డేట్ చేసుకోవాలి. ఇదే సమయంలో మీ వైర్లెస్ కనెక్షన్లను శక్తిమంతమైన పాస్‌వర్డ్‌లతో ప్రొటెక్ట్ చేసుకోవడం ఎంతో మంచిదని రీసెర్చర్స్ సూచిస్తున్నారు. -
పైసలతో పాటు ప్రశాంతత పోయే..
ఢిల్లీ: ఆన్లైన్ మోసాల బారిన పడే భారతీయుల సంఖ్య భారీగా పెరిగిపోతుంది. దీని ద్వారా నగదును కోల్పోవడమే కాకుండా మానసికంగా కూడా తీవ్ర ఒత్తిడిలను ఎదుర్కొంటున్నారు. ప్రముఖ సాఫ్ట్వేర్ సెక్యురిటీ సంస్థ నార్టన్ ఇండియా ఇటీవల వెల్లడించిన సర్వే ప్రకారం ఇండియాలోని సుమారు 11 కోట్ల మంది సైబర్ క్రైం బారినపడ్డారు. వారు ఒక్కొక్కరు సరాసరి రూ. 16,500 కోల్పోయారని వెల్లడించింది. ఇండియాలో ఈ తరహా మోసాలకు గురైన వారిలో 36 శాతం తీవ్ర నిరాశతో కుంగుబాటుకు లోనవుతుండగా, ప్రపంచవ్యాప్తంగా ఇలా మానసిక ఒత్తిడికి లోనవుతున్న వారు 19 శాతంగా ఉన్నట్లు నివేదిక తెలిపింది. సైబర్ క్రైం ద్వారా మోసపోయిన వారు తీవ్రమైన ఆగ్రహావేశాలకు లోనవుతున్నారని తద్వారా మానసిక పరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నార్టన్ ఇండియా మేనేజర్ రితీష్ చోప్రా వెల్లడించారు. ఇంటర్ నెట్ వినియోగదారుల్లో కేవంలం 40 శాతం మందికి మాత్రమే ఆన్లైన్ మోసాలలో బాధితులుగా ఉన్నప్పుడు ఎలా స్పందించాలో అన్న విషయం తెలుసు అని సర్వే పేర్కొంది. ఆన్లైన్ మోసాలలో ఎక్కువగా తమ క్రెడిట్ కార్డుకు సంబంధించిన సమాచారం తస్కరించబడటం ద్వారా బాధితులుగా మారుతున్నట్లు తెలిపింది. పాస్‌వర్డ్‌ల వివరాలతో పాటు మిగతా విషయాలలో జాగ్రత్తగా వ్యవహరించి ఆన్లైన్ మోసాల బారిన పడకుండా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.