not paid
-
ఫీజు చెల్లించలేక తనువు చాలించింది
బెలగావి: అసలే కరోనా కాలం. ఆ కుటుంబాన్ని ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. కుమార్తె కాలేజీ ఫీజు రూ.40 వేలు చెల్లించే స్థోమత కూడా లేకుండాపోయింది. తల్లిదండ్రులు పడుతున్న కష్టాలు చూసి తట్టుకోలేక తనువు చాలించింది. ఈ విషాద ఘటన కర్ణాటక రాష్ట్రం బెలగావి జిల్లా బిడీ గ్రామంలో చోటుచేసుకుంది. షకీల్ సంగోలి కుమార్తె మెహెక్ (20) ఓ ప్రైవేట్ కాలేజీలో బీసీఏ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. లాక్డౌన్ కారణంగా షకీల్ ఉద్యోగం కోల్పోయాడు. ఆర్థిక సమస్యలు ఎక్కువయ్యాయి. ఫీజు రూ.40 వేలు చెల్లించాలని కాలేజీ యాజమాన్యం ఇటీవల మెహెక్ను ఆదేశించింది. షకీల్ డబ్బు సర్దుబాటు చేయలేకపోయాడు. తల్లిదండ్రుల పరిస్థితిని చూసి ఆవేదనకు గురైన మెహెక్ ఇంట్లోనే ఉరి వేసుకుని మృత్యు ఒడికి చేరుకుంది. ఆమె తల్లి గృహిణి. 4, 6వ తరగతి చదువుతున్న ఇద్దరు సోదరులు ఉన్నారు. ఢిల్లీలోని లేడీ శ్రీరామ్ కాలేజీలో చదువుతున్న తెలంగాణ విద్యార్థిని ఐశ్వర్యారెడ్డి(19) ఇటీవల ఫీజు చెల్లించలేక ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. -
బకాయి వేతనాలు చెల్లించాలని ధర్నా
ఎంజీఎం : వరంగల్లోని ప్రాంతీయ నేత్ర వైద్యశాలలో విధులు నిర్వస్తున్న సెక్యూరిటీ, శానిటేషన్ కార్మికులకు మూడు నెలలుగా వేతనాలు చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని గురువారం కార్మికులు ఆస్పత్రిలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ బకాయి వేతనాలు చెల్లించాలని సదరు కాం ట్రాక్టర్ను అడగగా తమపై దురుసుగా ప్రవర్తించడంతో పాటు ఉద్యోగాల నుంచి తొలగిస్తామని బెదిరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. రెండేళ్లుగా కార్మికులకు ఈఎస్ఐ, ఈఫీఎఫ్ చెల్లించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ శ్రమదోపిడి చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఉద్యోగ సంఘాల నాయకులు యాదగిరి, నాగరాజుతో పాటు కార్మికులు పాల్గొన్నారు.