not sanctioned
-
పింఛను రాలేదని ఆగిన వృద్ధుడి గుండె
-
ఆందోళనకు సిద్ధమవుతున్న పుష్కర కాంట్రాక్టర్లు
నరసాపురం : పనులు పూర్తి చేసి ఏడాది అయినా ప్రభుత్వం నుంచి సొమ్ములు రాకపోవడంతో పుష్కర పనుల కాంట్రాక్టర్లు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. నరసాపురం పురపాలక సంఘంలో పుష్కర పనులు పూర్తి చేసిన కాంట్రాక్టర్లు శుక్రవారం మునిసిపల్ కార్యాలయం వద్ద సమావేశమయ్యారు. భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకున్నారు. ముందుగా సబ్‌కలెక్టర్ కార్యాలయానికి చేకుకుని కొద్దిసేపు ఆందోళన నిర్వహించారు. అనంతరం సబ్ కలెక్టర్ ఏఎస్ దినేష్‌కుమార్‌ను కలిసి సమస్య వివరించారు. పుష్కరాల సమయంలో అప్పులు చేసి, పనులు చేశామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా నరసాపురంలో జరిగిన పుష్కరాల పనులు మెచ్చుకున్నారని అయితే, సొమ్ములు మాత్రం ఇవ్వలేదన్నారు. మునిసిపాలిటీలో రూ. 27 కోట్లు పనులు పూర్తి చేశామని, ఇంకా రూ.7 కోట్లు రావాల్సి ఉందని వివరించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ బకాయిల విషయాన్ని కలెక్టర్ భాస్కర్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. కాంట్రాక్టర్లు గుత్తుల సత్యనారాయణ, కోటిపల్లి దొరయ్య, అందే కృష్ణకిషోర్, గుగ్గిలపు శివరామకృష్ణ, కంబాల మామజీ, అడబాల బాబు పాల్గొన్నారు. నేటి నుంచి రిలే దీక్షలకు సన్నాహాలు 14 నెలలుగా సొమ్ములు ఇవ్వకుండా ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోందరని కాంట్రాక్టర్లు మండిపడ్డారు. ‘కానీ కానీ అన్నారు.. కాసుల ఊసు మరిచారు’ శీర్షికన ఈ నెల 15న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనాన్ని కాంట్రాక్టర్లు మునిసిపల్ కమిషనర్ పి.రమేష్, ఇతర అధికారులకు చూపించారు. మా కష్టాలు ఇలా ఉన్నాయి.. చూడండి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మాకు సొమ్ములు వచ్చే వరకూ ఆందోళన చేస్తామని పేర్కొన్నారు. మునిసిపల్ కార్యాలయం వద్ద శనివారం నుంచి రిలే దీక్షలు చేస్తామని అనుమతి ఇవ్వాలని కమిషనర్‌ను కోరారు. కాంట్రాక్టర్లు మాట్లాడుతూ సొమ్ములు ఇచ్చే విషయంలో ప్రజాప్రతినిధులు, అధికారుల నుంచి సరైన సమాధానం రావడంలేదని, శనివారం నుంచి ఆందోళనకు దిగుతామని చెప్పారు. -

ఒక్క ఇల్లిస్తే ఒట్టు!
ఎన్నికల హామీని తుంగలో తొక్కిన బాబు గతంలో నిర్మించిన గృహాలకూ బిల్లుల నిలిపివేత ప్రారంభం కాని ఇళ్ల రద్దు ఆందోళనలో లబ్ధిదారులు చిత్తూరు: అర్హులైన పేదలందరికీ ప్రభుత్వమే పక్కాగృహాలు నిర్మించి ఇస్తుందని ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టిన చంద్రబాబు ఆ హామీని తుంగలో తొక్కారు. ఏడాది పాలన ముగిసినా ఒక్క పక్కాగృహం కూడా మంజూరు చేయలేదు. పక్కా గృహాలు వస్తాయని ప్రజలు వాటికోసం ఎదురు చూసినా ఫలితం లేదు. ఎన్నికల ప్రచారంలో అడిగిన వారికల్లా పక్కాగృహం ఇస్తామని చంద్రబాబు నమ్మబలికారు. అంతేకాదు గృహ నిర్మాణ వ్యయం రూ.70 వేల నుంచి రూ లక్షకు పెంచుతున్నట్లు ప్రకటించారు. ఇల్లు కట్టుకోలేని నిరుపేదలకు ప్రభుత్వమే ఇళ్లు నిర్మిస్తుందని కూడా హామీ ఇచ్చారు. తీరా ఓట్లేయించుకుని గద్దెనెక్కి ఏడాది ముగిసినా ఒక్క పక్కాగృహం కూడా మంజూరు చేసిన పాపాన పోలేదు. ఇక కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఇందిరా ఆవాస్ యోజన పక్కాగృహాలదీ అదే పరిస్థితి. 2014-15 ఏడాదికి గాను 7112గృహాలు వచ్చాయన్నారు. ఆ తరువాత 2015-16కు గాను 5036 గృహాలు మంజూరయ్యాయని అధికారులు చెబుతున్నా ఒక్కటీ నిర్మాణానికి నోచుకోలేదు. గ్రామసభలు నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉందని, ఇంతలో ఎన్నికల కోడ్ వచ్చిందని సంబంధిత గృహనిర్మాణ శాఖ అధికారులు చెబుతున్నారు. మరోవైపు పక్కా గృహాల కోసం జిల్లా వ్యాప్తంగా దాదాపు 40వేల మంది పేదలు జన్మభూమి-మావూరు, గ్రీవెన్స్ డేల్లో వినతి పత్రాలు సమర్పించారు. రూ .15 కోట్ల పాత బకాయిలు పెండింగ్ కొత్త ఇళ్ల సంగతి దేవుడెరుగు గత ప్రభుత్వ హయాంలో ఇందిరమ్మ పథ కం కింద మూడు విడతలకు సంబంధించిన పలుగృహాలను లబ్ధిదారులు ఆలస్యంగా పూర్తి చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన రూ 15 కోట్ల రూపాయల బిల్లులను కూడా ప్రభుత్వం ఇవ్వలేదు. దీంతో లబ్ధిదారులు లబోదిబో మంటున్నారు. వైఎస్ హయాంలో అడిగినన్ని గృహాలు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ హయంలో పేదలకు అడినన్ని గృహాలు ఇచ్చారు. ఇంటి నిర్మాణం పూర్తయ్యేందుకు పేదలకు పూర్తి సహకారం అందించారు. 2006 నుంచి 2009 వరకు ఇందిరమ్మ గృహాల పేరుతో జిల్లాలోని 3,57,370 మందికి పక్కా గృహాలు మంజూరు చేసిన ఘనత వైఎస్‌దే. ఏడాదికి లక్ష గృహాలకు పైగా మూడు సంవత్సరాల్లో 3,57,370 గృహాలను వైఎస్ మంజూరు చేశారు. వైఎస్ మూడు విడతల్లో కేటాయించిన మొత్తం గృహాల్లో 2,62,222 గృహాలు పూర్తి కాగా, మరో 41 వేల గృహాలు వివిధ దశల్లో నిలిచి పోయాయి. ఆర్థిక కారణాలతో ఇంతవరకు పలుగృహాలు ప్రారంభానికి నోచుకోలేదు. వైఎస్ మరణానంతరం అధికారం చేపట్టిన రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి ఐదేళ్ల కాలంలో రచ్చబండ మూడు విడతల్లో 66,817 గృహాలను మాత్రమే మంజూరు చేశారు. అయితే ఇందులో 32,716 గృహాలు పూర్తి కాగా, 12వేలకు పైగా గృహాలు వివిధ దశల్లో నిలిచిపోయాయి. 21,868 గృహాల నిర్మాణం ప్రారంభంకాలేదు. వాటిని కూడా ప్రభుత్వం రద్దు చేసింది. -
పింఛన్ వస్తలేదు
29లక్షలు సామాజిక పింఛనుదారులు 2లక్షలు అభయహస్తం పెన్షనర్లు ఈనెల ఇప్పటిదాకా అందని పింఛన్లు వచ్చేనెల అందేది కూడా అనుమానమే ఉమ్మడి రాష్ట్రంలోని ఈ రెండు నెలల పెన్షన్లు ఇచ్చేది ఎవరు? గత నెలలో వివిధ కారణాలతో 9 లక్షల మందికి మొండిచే యి నిధుల విడుదలలో ఆర్థికశాఖ జాప్యమే కారణం! సాక్షి, హైదరాబాద్: నెల వచ్చిందంటే పింఛన్ కోసం ఆశగా ఎదురుచూసే వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు నిరాశే మిగులుతోంది. ప్రతినెలా ఠంఛన్‌గా వ స్తాయనుకునే పెన్షన్లు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ఈ నెలలో ఇప్పటిదాకా పింఛన్లు అందకపోవడంతో లక్షల సంఖ్యలో వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, అభయహస్తం లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. మే నెల పెన్షన్ నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు విడుదల చేయలేదు. ప్రతినెలా ముందస్తుగా విడుదల చేస్తేనే పెన్షన్ నిధులు సకాలంలో పింఛనుదారులకు అందుతాయి. అయితే ప్రభుత్వం నుంచి ఇప్పటిదాకా నిధులు తమకు రాలేదని అధికారులు పేర్కొంటున్నారు. ఫలితంగా వచ్చే నెలలో కూడా పింఛన్లు ఇవ్వడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో దాదాపు 29 లక్షల మంది సామాజిక పెన్షన్‌దారులు, 2 లక్షల వరకు అభయహస్తం పెన్షన్‌దారులు ఉన్నారు. వీరిలో 17.33 లక్షల మంది వృద్ధులు, 3.87 లక్షల మంది వికలాంగులు, 7.31 లక్షల మంది వితంతువులు, 1.76 లక్షల మంది అభయహస్తం, 60 వేల మంది చేనేత కార్మికులు, మిగిలిన వారు కల్లుగీత కార్మికులు ఉన్నారు. కిందటి నెలలో 9 లక్షల మందికి అందని పింఛన్లు.. ప్రభుత్వ ఉద్యోగల మాదిరి పింఛన్‌దారులకు కూడా పెన్షన్లు ప్రతీనెలా ఒకటో తేదీ నుంచి ఐదో తేదీలోగా ఇవ్వాలని దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి అప్పట్లో స్పష్టమైన ఆదేశాలిచ్చారు. చాలాకాలం ఇలాగే అమలైంది. ఐదో తేదీలోపే ఠంచన్‌గా పింఛన్ అందేది. కానీ ఈ మధ్యకాలంలో ఇది గాడి తప్పింది. పెన్షన్ నిధులను గ్రీన్‌ఛానెల్‌లో పెట్టామని గత ప్రభుత్వం చెప్పినా.. నిధుల విడుదల మాత్రం జాప్యమవుతూ వస్తోంది. తమకు వచ్చే రూ.200, రూ.500ల కోసం అధికారుల చుట్టూ చెప్పులరిగేలా తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. మార్చిలో పెన్షన్ల కోసం నిధులు విడుదల చేసినా ఎన్నికల కోడ్ కారణంగా... దాదాపు తొమ్మిది లక్షల మందికి పింఛన్లు అందలేదు. ఎన్నికల కోడ్ ఒకటైతే.. పింఛన్‌దారులు తమ ఇళ్లలో నివాసం లేరని, వలస వెళ్లారని, ఇలా పలు కారణాలు చూపి మొత్తం 31 లక్షల పెన్షన్లకుగాను.. 22 లక్షల కంటే తక్కువగానే పంపిణీ చేశారు. మిగిలిన తొమ్మిది లక్షల పెన్షన్లకు సంబంధించిన నిధులు తిరిగి రాష్ట్ర ఖజానాలోకి వచ్చి చేరుతున్నాయి. ఇక మే నెల పెన్షన్ నిధులు ఇవ్వాలని గ్రామీణాభివృద్ధి శాఖ యంత్రాంగం కోరినప్పటికీ.. ఇంకా విడుదల చేయలేదని తెలిసింది. ప్రస్తుతానికి ఇవి ఎప్పుడు విడుదలవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఆర్థికశాఖ జాప్యం వల్లే... సంక్షేమ పథకాలేవీ అగబోవని గవర్నర్ సైతం హామీ ఇచ్చారు. కానీ ఆర్థిక శాఖ నిధుల విడుదలలో విపరీతమైన జాప్యం చేయడం వల్లే పెన్షన్లు అందడంలో ఆలస్యమవుతోందని ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. మేలోనే ఇలా ఉంటే.. జూన్ 2 నుంచి రెండు రాష్ట్రాల ఏర్పాటైన తర్వాత పెన్షనర్లకు నిధుల విడుదల సక్రమంగా సాగుతుందా లేదా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జూన్‌లో సక్రవుంగా పంపిణీ జరగాలంటే ఇప్పుడే నిధులు విడుదల జరగాల్సి ఉంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో పింఛన్లను పట్టించుకునేవారే లేకుండా పోయూరు. పోయిన నెల నుంచి రాలేదు: సల ్లరాధమ్మ. సోమగూడెం, ఆదిలాబాద్ పోయిన నెల నుంచి ఫించన్ రాలేదు. నెలకు రూ.500 అభయహస్తం పించన్ వస్తేనే ఇళ్లు గడిచేది. ఈనెల ఇప్పటి వరకు రాలేదంటున్నారు. పించన్‌పై ఆధారపడి బతికే మాలాంటి వారిని వేధించడం సరికాదు. సమయానికి వస్తలేవు: మేడ శాంతమ్మ, కాసిపేట, ఆదిలాబాద్ గతంలో నెల మొదటి నుంచి ఐదో తేదీ లోపు ఫించన్ అందించేవారు. కొద్దిరోజులుగా మిషన్ ద్వారా ఇస్తున్నమని చెప్పి ఆలస్యం చేస్తున్నారు. అధికారులు పింఛన్ డబ్బులు సక్రమంగా అందేలా చూడాలి. పింఛన్ ఇయ్యకపోతే ఎట్ల..?: బాలమణి, వితంతువు, తీగుల్, జగదేవ్‌పూర్ మండలం, మెదక్ ప్రతినెల 5 తారీఖులోపు పెన్షన్ వొచ్చేది. ఏమైందో ఏమో ఈనెల ఇంతవరకు రాలేదు. రోజు పోద్దున పంచాయితీ కాడికి పోయి వస్తున్న. పింఛన్ ఇచ్చేటోట్లు వస్తలేరు.. ఆర్నెళ్ల సంది వస్తలేదు: పెద్దోళ్ల పోచమ్మ, కిష్టాపూర్, తూప్రాన్ మండలం, మెదక్ ఆరు నెలల సంది పింఛన్ వస్తలేదు. అంతకు ముందు నెల నెల రూ.200 ఇచ్చిండ్రు. ఇప్పుడు ఇస్తలేరు. ఇదేందని అడిగితే.. ఏదో మిషన్ మీద చేయి పెడితే నా పేరు వస్తలేదని అంటున్నరు. పేరు కూడ తప్పుగా ఉందంటుండ్రు. నడటానికి శాతగానీ ముసల్దాన్ని... రోగమొస్తే ఆసుపత్రికి పోదామంటే చేతిల చిల్లిగవ్వ లేదు.