సినీ పరిశ్రమ ఐకమత్యంగా లేదు
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ రేప్ వ్యాఖ్యలపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వస్తుండగా, సినీ ప్రముఖులు మౌనం పాటిస్తున్నారు. చాలా కొద్దిమంది మినహా బాలీవుడ్ సెలెబ్రిటీలు స్పందించలేదు. బాలీవుడ్ పరిశ్రమ ఐక్యమత్యంగా లేదని నటుడు ఇర్ఫాన్ ఖాన్ అన్నాడు.
సల్మాన్ వ్యాఖ్యలపై బాలీవుడ్ ఎందుకు మౌనంగా ఉందన్న ప్రశ్నకు స్పందిస్తూ.. ‘ఎవరైనా తమ అభిప్రాయాలు చెబితే ఇతరులు పట్టించుకోరు. సినీ పరిశ్రమగా మేం ఐక్యమత్యంగా లేము. ప్రతి ఒక్కరు వారి ప్రయోజనాల కోసం చూస్తున్నారు’ అని ఇర్ఫాన్ చెప్పాడు. సల్మాన్ ఏం మాట్లాడాడో తనకు తెలియదని, అయితే సెలెబ్రిటీల నుంచి ఎప్పుడు మంచివాటినే ఎందుకు అంచనా వేస్తామని ఇర్ఫాన్ అన్నాడు.