'ఆ టేపులు ఎక్కడి నుంచి వచ్చాయో బయటపెట్టండి'
హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారంలో టేపులు ఎక్కడి నుంచి వచ్చాయో టీ న్యూస్ ఛానల్ వివరణ ఇవ్వాలని టీటీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు డిమాండ్ చేశారు. ఏపీ పోలీసులు ఇచ్చిన నోటీసులకు గగ్గోలు పెట్టకుండా జవాబు చెబితే సరిపోతుందన్నారు. గంటలో సంచలన వార్త వస్తుందన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాటల్లోనే టీ న్యూస్ ప్రమేయం ఉన్నట్లు స్పష్టమైందని విమర్శించారు.
తెలంగాణ రాష్ట్రంలో విలువలు, పత్రికా స్వేచ్ఛ గురించి మాట్లాడే అర్హత కేసీఆర్ కు లేదని ఎర్రబెల్లి తెలిపారు. తెలంగాణ కోసం పోరాడిన గౌరవం జర్నలిస్టులకు ఉందని.. టీ న్యూస్ కోసం ధర్నా చేసి తెలంగాణ జర్నలిస్టులు గౌరవం కోల్పోవద్దన్నారు.