నవోదయ జాతీయ సమైక్యతా సమ్మేళనం
కూచిపూడి.. కథక్.. యక్షగానం.. బంజారా డ్యాన్స్‌లు.. విభిన్న రాష్ట్రాల కళా ప్రదర్శనలు నవోదయ జాతీయ సమైక్యతా సమ్మేళనంలో ఆవిష్కృతమయ్యాయి. సెంట్రల్ యూనివర్శిటీలోని డీఎస్టీ ఆడి టోరియంలో జాతీయ స్థాయి కళల ప్రదర్శన శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైంది.దేశంలోని 8 నవోదయ విద్యాలయాల రీజియన్ల నుంచి 500 మంది విద్యార్థులు ఈ ప్రత్యేక సాంస్కృతిక సంబరాల్లో భాగస్వాములయ్యారు. దక్షిణ, ఈశాన్య, ఉత్తర భారతదేశ సంప్రదాయ, జానపద, గ్రామీణ కళలను విద్యార్థులు అద్భుతంగా ప్రదర్శించారు.