NPS account
-
NPS ఖాతాను తిరిగి ఎలా యాక్టివేట్ చేయాలి
-
ఎన్పీఎస్ మొత్తాన్ని వెనక్కి తీసుకోవడమెలా?
నేను 2019లో పన్ను ఆదా కోసం ఎన్పీఎస్ సాధనంలో రూ.50,000 ఇన్వెస్ట్ చేశాను. ఇప్పుడు ఈ మొత్తాన్ని వెనక్కి తీసుకుందామని అనుకుంటున్నాను. ఎలా ఉపసంహరించుకోవాలి? – కల్పేష్ వర్మ ఎన్పీఎస్ టైర్–1 పెట్టుబడులకు 60 ఏళ్లు వచ్చే వరకు లాకిన్ ఉంటుంది. ఈ లోపే ఎన్పీఎస్ నుంచి బ్యాలన్స్‌ను ఉపసంహరించుకోవాలంటే, అందుకు కొన్ని షరతులు వరిస్తాయి. ఉన్నత విద్య, వివాహం, ఇంటి కొనుగోలు వంటి అవసరాలకు ఎన్పీఎస్ నిధి నుంచి కేవలం 25 శాతాన్ని వెనక్కి తీసుకోవచ్చు. అది కూడా ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించి మూడేళ్లు పూర్తి కావాలి. మీరు 2019లో ఇన్వెస్ట్ చేశారంటున్నారు. మూడేళ్ల కాలం పూర్తయింది. కనుక సమకూరిన నిధి నుంచి 25 శాతాన్ని ఉపసంహరించుకోవచ్చు. ఎన్పీఎస్ ఖాతాను శాశ్వతంగా మూసివేయదలిస్తే, ఆరంభించి పదేళ్లు ముగిసిన తర్వాతే అది సాధ్యపడుతుంది. పదేళ్లలో ఏర్పడిన నిధి నుంచి 20 శాతాన్నే వెనక్కి తీసుకోగలరు. మిగిలిన 80 శాతంతో నెలవారీ పెన్షన్ ఇచ్చే యాన్యుటీ ప్లాన్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కాకపోతే ఎన్పీఎస్ ఖాతాలో పదేళ్ల తర్వాత కూడా మొత్తం నిధి రూ.5 లక్షల్లోపే ఉంటే, అప్పుడు నూరు శాతం మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చు. ఎన్పీఎస్ నుంచి వైదొలిగేందుకు సీఆర్ఏ వెబ్సైట్లో లాగిన్ అవ్వాలి. ఉపసంహరణకు కారణాన్ని పేర్కొనాలి. బ్యాంక్ అకౌంట్, కాంటాక్ట్ వివరాలను ధ్రువీకరించాలి. మీ మొబైల్‌కు వచ్చిన ఓటీపీ నమోదు చేయాలి. అప్పటి నుంచి ఐదు పనిదినాల్లో మీ ఉపసంహరణ దరఖాస్తు ప్రాసెస్ అవుతుంది. ఇతర మార్గాలు లేకపోతే తప్ప, ముందస్తు ఉపసంహరణను ఎంపిక చేసుకోవద్దన్నదే మా సలహా. విశ్రాంత జీవనం కోసం ఉద్దేశించిన నిధిని ఉపసంహరించుకోకుండా నిరాశ పరచడమే ఈ పథకంలోని షరతుల ఉద్దేశ్యం. ఎన్పీఎస్ పెట్టుబడుల్లో గరిష్టంగా 75 శాతం వరకు ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. రిటైర్మెంట్ కోసం ఈక్విటీలకు ఈ మాత్రం కేటాయింపులు సహేతుకమేనని చెప్పుకోవాలి. - ధీరేంద్ర కుమార్ (సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్) -
నేషనల్ పెన్షన్ స్కీమ్: నేరుగా జమ చేస్తే కమీషన్
న్యూఢిల్లీ: జాతీయ పింఛను పథకం (నేషనల్ పెన్షన్ స్కీమ్-ఎన్పీఎస్) పరిధిలోని సభ్యులు తమ స్వచ్ఛంద పింఛను జమలకు డైరెక్ట్ రెమిట్ (నేరుగా జమ) మార్గాన్ని ఎంపిక చేసుకుంటే, పీవోపీలకు వచ్చే నెల నుంచి రూ.15-10,000 వరకు కమీషన్ లభిస్తుందని పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) ప్రకటించింది. పీఎఫ్ఆర్డీఏ కొత్త నిబంధన కింద ఎన్పీఎస్ చందాదారులు నేరుగా జమ మార్గాన్ని ఎంపిక చేసుకోవడం వల్ల ఫీజుల రూపంలో నష్టపోయే పాయింట్ ఆఫ్ ప్రెజెన్స్ (పీవోపీలు) సంస్థలకు పరిహారాన్ని ఇవ్వడమే దీని లక్ష్యమని పేర్కొంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, కార్పొరేట్ రంగం, అటల్ పెన్షన్ యోజన పౌరులు ఎన్పీఎస్ చందాదారులుగా ఉంటారు. అయితే ఎన్పీఎస్కు, చందాదారులకు మధ్య అనుసంధానకర్తలను పీవోపీలుగా పేర్కొంటారు. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు, ఫిన్‌టెక్ కంపెనీలు పీవోపీల కిందకు వస్తాయి. ఎన్పీఎస్ ఖాతాలను తీసుకొచ్చేందుకు ఎంతగానో కృషి చేస్తున్న పీవోపీలకు తమ నిర్ణయం మద్దతుగా నిలుస్తుందని పీఎఫ్ఆర్డీఏ పేర్కొంది. -
బ్యాంక్‌తో పనిలేదు,మొబైల్ నుంచే ఎన్పీఎస్ అకౌంట్ ఓపెన్ చేయోచ్చు!
న్యూఢిల్లీ: బ్యాంకు ఆఫ్ ఇండియా (బీవోఐ), పింఛను నిధి నియంత్రణ సంస్థ (పీఎఫ్ఆర్డీఏ) సంయుక్తంగా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించాయి. కే–ఫిన్‌టెక్ సాయంతో నూతన ఎన్పీఎస్ చందాదారుల చేరిక కోసం దీన్ని తీసుకొచ్చాయి. బ్యాంకు ఆఫ్ ఇండియా ఎండీ, సీఈవో ఏకే దాస్ సమక్షంలో పీఎఫ్ఆర్డీఏ చైర్మన్ సుప్రతిమ్ బందోపాధ్యాయ దీన్ని ప్రారంభించారు. దీంతో మొబైల్ ఫోన్ నుంచే ఎన్పీఎస్ ఖాతా (స్వచ్ఛంద పింఛను ఖాతా) తెరవొచ్చు. ఎటువంటి పేపర్లు అవసరం లేకుండా, మొబైల్ ఫోన్‌తో క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా ఎన్పీఎస్ ఖాతాను తెరవొచ్చని పీఎఫ్ఆర్డీఏ, బీవోఐ ఉమ్మడి ప్రకటనలో తెలిపాయి. ఎంతో సులభంగా, వేగంగా కేవలం కొన్ని క్లిక్‌లతో ఖాతా ప్రారంభించొచ్చని ప్రకటించాయి. ఫోన్‌తో క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయాలి. అది వెబ్ పేజీకి తీసుకెళుతుంది. అక్కడి డిజిటల్ దరఖాస్తును వివరాలతో పూర్తి చేయాలి. ఆధార్ నంబర్ ఇవ్వాలి. దీంతో డిజీలాకర్ సాయంతో ఫొటో, ఇతర వివరాలను ప్లాట్‌ఫామ్ తీసుకుని ప్రక్రియను పూర్తి చేస్తుంది. -
రెండో ఎన్పీఎస్ ఖాతాకు వీలుంటుందా?
పన్ను ఆదా మ్యూచువల్ ఫండ్స్‌లో లాక్–ఇన్ పీరియడ్ వరకే ఇన్వెస్ట్ చేయడం మంచిదా ? – వైష్ణవి, హైదరాబాద్ పన్ను ఆదా మ్యూచువల్ ఫండ్స్‌ను రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. పనితీరు దూకుడుగా ఉండేవి. పనితీరు సామాన్యంగా ఉండేవి. ట్యాక్స్ సేవింగ్స్ ఫండ్స్ అన్నీ పూర్తిగా ఈక్విటీలోనే ఇన్వెస్ట్ చేస్తాయి. వీటిల్లో లార్జ్‌క్యాప్ కంపెనీల్లో అధికంగా ఇన్వెస్ట్ చేసే ఫండ్స్ ఉన్నాయి. కొన్ని ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో ప్రయోగాలు చేస్తాయి. ఈ తరహా ఫండ్స్ చిన్న కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసి గరిష్ట లాభాలను సాధించాలని ప్రయత్నాలు చేస్తాయి. ట్యాక్స్ సేవింగ్స్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు, మీ ఇన్వెస్ట్మెంట్స్ మూడేళ్ల వరకూ లాక్–ఇన్ అవుతాయి కాబట్టి, దూకుడుగా ఉండే ఫండ్స్‌లోనే ఇన్వెస్ట్ చేయడం మంచిది. మూడేళ్ల లాక్–ఇన్ పీరియడ్ గురించి ఆలోచించకండి. కనీసం ఐదు, అంతకు మించిన కాలానికి ఇన్వెస్ట్ చేయడమే సబబు. ఇక సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్)ల ద్వారా ఇన్వెస్ట్ చేస్తే దీర్ఘకాలంలో మంచి రాబడులు పొందవచ్చు. నేను కొన్ని ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్(ఈఎల్ఎస్ఎస్)లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఈ ఫండ్స్ నుంచి ఇన్వెస్ట్‌మెంట్స్‌ను వేరే ఫండ్స్‌లోకి (వీటి లాక్–ఇన్ పీరియడ్ ముగిసిన తర్వాత)బదిలీ చేయాలనుకుంటున్నాను. నాది సరైన నిర్ణయమేనా? – రాజా, విశాఖపట్టణం ఈఎల్ఎస్ఎస్ల నుంచి ఇన్వెస్ట్‌మెంట్స్‌ను వేరే ఫండ్స్‌లోకి మార్చడం సరైన నిర్ణయం కాదు. మీరు ఇన్వెస్ట్ చేసిన ఈఎల్ఎస్ఎస్ మంచి పనితీరు చూపించకపోతేనే లాక్–ఇన్ పీరియడ్ ముగిసిన తర్వాత ఈ ఫండ్స్ నుంచి ఇన్వెస్ట్‌మెంట్స్‌ను వేరే ఫండ్స్‌లోకి బదిలీ చేసుకోవచ్చు. లేదా మీకు డబ్బులు అవసరమైనప్పుడు మాత్రమే అదీనూ బయట ఎక్కడైనా అప్పు పుట్టని పరిస్థితుల్లో మాత్రమే ఈ ఫండ్స్ నుంచి వైదొలగవచ్చు. అలా కాని పక్షంలో ఈఎల్ఎస్ఎస్ల నుంచి వేరే ఫండ్స్‌లోకి ఇన్వెస్ట్‌మెంట్స్‌ను బదిలీ చేయడం పెట్టుబడుల వ్యూహం పరంగా సరైన నిర్ణయం కాదు. నేను ఒక ప్రభుత్వ ఉద్యోగిని. నేషనల్ పెన్షన్ సిస్టమ్(ఎన్పీఎస్) ఖాతా మాకు తప్పనిసరి. నా వేతనంతో అనుసంధానమై ఉన్న ఎన్పీఎస్ ఖాతాను ప్రారంభించాను. అయితే ఈ ఖాతాలో ఈక్విటీ కేటాయింపులు పెంచుకోవడానికి లేదు. అందుకని నేను మరో ఎన్పీఎస్ ఖాతాను ప్రారంభించవచ్చా? – దత్తాత్రేయ, విజయవాడ మీరు ఒకటికి మించి నేషనల్ పెన్షన్ సిస్టమ్(ఎన్పీఎస్) ఖాతాలు తెరవడానికి వీలు లేదు. ఈక్విటీలో 50 శాతానికి మించి ఇన్వెస్ట్ చేసే వెసులుబాటు ఎన్‌పీఎస్‌లో లేదు. ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్స్ పెంచుకోవాలనుకుంటే, మీరు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. ఆదాయపు పన్ను చట్టం, సెక్షన్ 80 సీ కింద పన్ను మినహాయింపులు పొందాలంటే, ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్(ఈఎల్ఎస్ఎస్)లో ఇన్వెస్ట్ చేయవచ్చు. సెక్షన్ 80 సీ కింద మీరు రూ.1.5 లక్ష వరకూ ఆదాయపు పన్ను మినహాయింపులు పొందవచ్చు. ఇప్పటికే సెక్షన్ 80సీ పరిమితి పూర్తయితే, ఈక్విటీ ఆధారిత బ్యాలెన్స్డ్ స్కీమ్స్‌లో గానీ, డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో గానీ ఇన్వెస్ట్ చేయవచ్చు. ఈ ఫండ్స్‌లో సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేస్తే దీర్ఘకాలంలో మంచి రాబడులు పొందవచ్చు. రిటైర్మెంట్ నిధి ఏర్పాటు, పిల్లల ఉన్నత చదువులు, సొంత ఇల్లు సమకూర్చుకోవడం తదితర దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల సాధన కోసం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేయడమే ఉత్తమమైన విధానం. నేను నెలకు రూ. లక్ష వరకూ ఇన్వెస్ట్ చేయగలను. కనీసం 15–20 ఏళ్ల వరకూ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. మిడ్ క్యాప్, స్మాల్–క్యాప్ ఫండ్స్‌నే ఇన్వెస్ట్మెంట్ కోసం ఎంచుకోవాలనుకుంటున్నాను. తగిన సలహా ఇవ్వండి. – రంజిత్, నిజామాబాద్ నెలకు రూ. లక్ష చొప్పున కనీసం 15–20 ఏళ్ల పాటు మిడ్–క్యాప్, స్మాల్–క్యాప్ ఫండ్స్‌లో నిరభ్యంతరంగా ఇన్వెస్ట్ చేయవచ్చు. మార్కెట్ అధ్వాన పరిస్థితుల్లో ఉన్నా కూడా చాలా మిడ్–క్యాప్, స్మాల్–క్యాప్ ఫండ్స్ మంచి పనితీరు చూపించాయి. మిడ్–క్యాప్, స్మాల్–క్యాప్ ఫండ్స్ పనితీరు భవిష్యత్తులో కూడా అదే విధంగా ఉండవచ్చు. మీరు 15–20 ఏళ్లు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. కాబట్టి, మంచి రాబడులు పొందే అవకాశాలు అధికంగా ఉన్నాయి. అయితే ఇలా మిడ్–క్యాప్, స్మాల్–క్యాప్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలి. ఆయా ఫండ్స్ పనితీరును కనీసం రెండేళ్లకొకసారైనా సమీక్షించాలి. ఈ రెండేళ్ల కాలంలో ఎన్నో మార్పు చేర్పులు జరుగుతుంటాయి. మీ పోర్ట్‌ఫోలియోలోని ఏ ఫండ్ పనితీరు, అదే కేటగిరీలోని మరే ఇతర ఫండ్ పనితీరు కన్నా అధ్వానంగా ఉంటే.. ఆ ఫండ్ నుంచి మరో ఫండ్‌లోకి మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను మార్చండి. ఏదైనా ఒక ఫండ్‌ను నిర్వహించే ఫండ్ మేనేజర్ మారిపోయినా, లేదా మీరు ఇన్వెస్ట్ చేస్తున్న ఫండ్ నిర్వహణ ఆస్తులు భారీగా పెరిగినా..ఫండ్ పనితీరు ప్రభావితం అవుతుంది. ఇలాంటి విషయాల పట్ల అప్రమత్తంగా ఉంటే, మిడ్–క్యాప్, స్మాల్–క్యాప్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఎంపిక చేసిన ఫండ్స్‌లో సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించండి. మార్కెట్ పెరుగుదల, క్షీణతలతో సంబంధం లేకుండా మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగించండి. కనీసం రెండేళ్లకొకసారైనా మీ పోర్ట్‌ఫోలియోను మాత్రం సమీక్షించడం మరచిపోకండి. - ధీరేంద్ర కుమార్ ,సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
ఎన్పీఎస్ ఖాతాల నిబంధనలు సడలింపు
న్యూఢిల్లీ: జాతీయ పింఛన్ విధానం (ఎన్పీఎస్) ఖాతా ప్రారంభించడానికి ఉన్న నిబంధనలను కేంద్రం సడలించింది. ఎన్పీఎస్ ఖాతాలు తెరవడానికి ఇదివరకు ఉన్న నిబంధనల్లో పలు మార్పులు చేస్తూ పింఛన్ నిధులు నియంత్రణ,అభివృధ్ధి మండలి (పీఎఫ్ఆర్డీఏ) నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఆధార్‌తో తెరిచిన ఎన్పీఎస్ ఖాతాలకు బ్యాంక్‌ల్లో ఫిజికల్ అప్లికేషన్ ఫామ్ ఇవ్వవలసిన అవసరం లేదంటూ ఆదివారం ప్రకటించింది. ఇదివరకు ఖాతాలు ప్రారంభించిన వాళ్లు ఎలక్ట్రానిక్ సంతకం చేయడానికి బ్యాంకులకు కచ్చితంగా వెళ్లాల్సి వచ్చేది. ఆధార్ సంఖ్య ద్వారా ఖాతాలు తెరిచేవారు ఇక నుంచి బ్యాంకులకు వెళ్లి ఎలక్ట్రానిక్ సంతకం పెట్టాల్సిన అవసరం లేదంటూ పీఎఫ్ఆర్డీఏ తాజాగా వెల్లడించింది.