న్యూఢిల్లీ: జాతీయ పింఛన్ విధానం (ఎన్పీఎస్) ఖాతా ప్రారంభించడానికి ఉన్న నిబంధనలను కేంద్రం సడలించింది. ఎన్పీఎస్ ఖాతాలు తెరవడానికి ఇదివరకు ఉన్న నిబంధనల్లో పలు మార్పులు చేస్తూ పింఛన్ నిధులు నియంత్రణ,అభివృధ్ధి మండలి (పీఎఫ్‌ఆర్డీఏ) నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఆధార్‌తో తెరిచిన ఎన్పీఎస్ ఖాతాలకు బ్యాంక్‌ల్లో ఫిజికల్ అప్లికేషన్ ఫామ్ ఇవ్వవలసిన అవసరం లేదంటూ ఆదివారం ప్రకటించింది.
ఇదివరకు ఖాతాలు ప్రారంభించిన వాళ్లు ఎలక్ట్రానిక్ సంతకం చేయడానికి బ్యాంకులకు కచ్చితంగా వెళ్లాల్సి వచ్చేది. ఆధార్ సంఖ్య ద్వారా ఖాతాలు తెరిచేవారు ఇక నుంచి బ్యాంకులకు వెళ్లి ఎలక్ట్రానిక్ సంతకం పెట్టాల్సిన అవసరం లేదంటూ పీఎఫ్‌ఆర్డీఏ తాజాగా వెల్లడించింది.
ఎన్పీఎస్ ఖాతాల నిబంధనలు సడలింపు
Published Mon, Jan 2 2017 8:48 AM | Last Updated on Tue, Sep 5 2017 12:12 AM
Advertisement
Advertisement