బాక్సింగ్ చాంప్ రాజు
ఎల్బీ స్టేడియం: తెలంగాణ రాష్ట్ర జూనియర్ కాలేజి బాక్సింగ్ సిరీస్ టోర్నమెంట్లో 49 కేజీల టైటిల్‌ను ఎన్. రాజు (హైదరాబాద్) కైవసం చే సుకున్నాడు. తెలంగాణ బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇక్కడి ఎల్బీ స్టేడియం బాక్సింగ్ హాల్లో శనివారం ఈ పోటీలు జరిగాయి. ఫైనల్లో రాజు.. మహబూబ్‌నగర్‌కు చెందిన అఖిల్ శ్రీగిరిపై గెలిచాడు. ఈపోటీల ముగింపు వేడుకలకు గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు పతకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ అంతర్జాతీయ బాక్సర్ ఆర్. ప్రవీణ్ కుమార్ సింగ్, కోచ్ ఓంకార్ యాదవ్ పాల్గొన్నారు.
ఫైనల్స్ ఫలితాలు:
52 కేజీలు: 1. పి. మహేందర్ (హైదరాబాద్), 2. సదానంద్ (రంగారెడ్డి జిల్లా). 56 కేజీలు: 1. సి.హెచ్. ధీరజ్ (హైదరాబాద్), 2. వివేక్ సింగ్ (నల్లగొండ). 60 కేజీలు: 1. వెంకటేశ్వర్లు (మహబూబ్‌నగర్), 2. ఎం.డి. ఇంతియాజ్(కరీంనగర్). 64 కేజీలు:1. ఎస్.డేవిడ్ (హైదరాబాద్), 2. వినయ్ కుమార్ (మెదక్). 69 కేజీలు: 1. ఎస్.సాయి (హైదరాబాద్), 2. ఎం.డి. మతీన్ (కరీంనగర్). 75 కేజీలు: 1. ఆర్. అశోక్ నాయక్ (నల్లగొండ), 2. మనోజ్‌రెడ్డి (రంగారెడ్డి జిల్లా).