NRI student
-
అమెరికాలో ఏం జరుగుతోంది.. శ్రేయాస్ రెడ్డి మృతి
వాషింగ్టన్: అమెరికాలో భారతీయ విద్యార్థుల మరణాలు కలవరపెడుతున్నాయి. అగ్రరాజ్యంలో ఉన్నత విద్యకు వెళ్లిన విద్యార్థులు వరుసగా మృతి చెందుతున్నారు. ఈ ఏడాది మొదటి నుంచి నలుగురు విద్యార్థులు మృతిచెందడం ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా మరో విద్యార్థి శ్రేయాస్‌రెడ్డి మృతిచెందాడు. వివరాల ప్రకారం.. శ్రేయాస్‌రెడ్డి బెనిగెరి అనే మరో విద్యార్థి ఒహియోలోని సిన్సినాటిలో చనిపోయి కనిపించాడు. అయితే, శ్రేయాస్‌రెడ్డి మరణానికి కారణాలు తెలియాల్సి ఉంది. కాగా, శ్రేయాస్ లిండర్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో చదువుతున్నట్టు తెలుస్తోంది. అతడి మృతిపై న్యూయార్క్‌లోని భారత రాయబార కార్యాలయం ప్రగాఢ సానుభూతి తెలిపింది. బాధిత కుటుంబానికి అవసరమైన సాయం అందిస్తామని పేర్కొంది. Deeply saddened by the unfortunate demise of Mr. Shreyas Reddy Benigeri, a student of Indian origin in Ohio. Police investigation is underway. At this stage, foul play is not suspected. The Consulate continues to remain in touch with the family and is extending all possible… — India in New York (@IndiainNewYork) February 1, 2024 మరోవైపు.. వారం రోజుల వ్యవధిలోనే ఇలా విద్యార్థులు మృతి చెందడం కలవరానికి గురిచేస్తోంది. ఇప్పటి వరకు మృతిచెందిన భారత విద్యార్ధులు వీరే.. వివేక్ సైనీ ఇటీవలే వివేక్ సైనీ(25 ) అనే భారత విద్యార్థిని నిరాశ్రయుడై ఓ వ్యక్తి దుకాణంలో కొట్టి చంపాడు. సైనీ ఇటీవలే అమెరికాలో ఎంబీఏ పూర్తి చేశాడు. ఓ దుకాణంలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో దాడికి కొన్ని రోజుల ముందు నుంచి మాదకద్రవ్యాలకు బానిసైన జూలియన్ ఫాల్క్‌నర్ అనే నిరాశ్రయునికి సైనీ సహాయం చేశాడు. అయినప్పటికీ సైనీని ఫాల్క్‌నర్ హత్య చేశాడు. నీల్ ఆచార్య ఇండియానా రాష్ట్రంలోని పర్డ్యూ యూనివర్సిటీలో చదువుతున్న భారతీయ విద్యార్థి నీల్ ఆచార్య గత వారం శవమై కనిపించాడు. జాన్ మార్టిన్సన్ హానర్స్ కాలేజ్ ఆఫ్ పర్డ్యూ యూనివర్శిటీలో కంప్యూటర్ సైన్స్ చేస్తున్నాడు ఆచార్య. కాగా గత ఆదివారం ఆచార్య కనిపించడం లేదని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. మరుసటి రోజే ఆచార్య చనిపోయి ఉండటాన్ని గుర్తించారు. ఆదిత్య అద్లాఖా ఇటీవలే ఆదిత్య అద్లాఖా(26)అనే భారతీయ విద్యార్థిని హత్యకు గురయ్యారు. సిన్సినాటి యూనివర్శిటీలో ఆదిత్య అద్లాఖా పీహెచ్డీ విద్యార్థి. ఒహియోలోని కారులో ఆయన్ని దుండగులు కాల్చి చంపారు. మరో కేసులో ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయంలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదువుతున్న అకుల్ ధావన్(18) అనే భారత సంతతి విద్యార్థి కూడా మృతి చెందాడు. -
యనమలకుదురుకు చేరిన జయసూర్య మృతదేహం
పెనమలూరు: ఫిలిప్పీన్స్‌లో మెడిసిన్ చదువుతూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన యనమలకుదురుకు చెందిన అయోధ్య జయసూర్య (23) మృతదేహం ఎట్టకేలకు శుక్రవారం యనమలకుదురుకు చేరుకుంది. గత నెల 20వ తేదీన ఫిలిప్పీన్స్‌లో బైక్‌పై ప్రయాణిస్తూ రోడ్డు ప్రమాదంలో మరణించిన జయసూర్య మృతదేహం యనమలకుదురుకు తీసుకురావడానికి సాంకేతిక పరమైన సమస్యలు తలెత్తాయి. దీంతో మృతుడి కుటుంబ సభ్యులకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అండగా నిలిచింది. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి, ప్రభుత్వ అధికారుల కృషితో జయసూర్య మృతదేహం కార్గో విమానంలో హైదరాబాద్‌కు వచ్చింది. అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో యనమలకుదురుకు మృతదేహాన్ని తీసుకు వచ్చారు. నాలుగు నెలల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసి ఇంటికి రావల్సిన జయసూర్య విగతజీవిగా ఇంటికి రావటంతో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. వైఎస్సార్ సీపీ నేతలు, గ్రామస్తులు జయసూర్య మృతదేహానికి నివాళు లర్పించారు. శనివారం యనమలకుదురులో జయసూర్య అంత్యక్రియలు జరగనున్నాయి. -
ఒంటరితనం భరించలేక.. అమెరికాలో తెలుగు యువకుడు!
సాక్షి, పామూరు : ప్రకాశం జిల్లా పామూరుకు చెందిన దుగ్గినేని దీపక్, అమెరికాలో రైలు కిందపడి ఆత్మహత్య పాల్పడ్డాడు. దుగ్గినేని వెంకట్రావు, రమాదేవిల కుమారుడు దీపక్. ఎంఎస్ పూర్తిచేసి అమెరికాలో ఉద్యోగ వేటలో ఉన్నాడు. ఈ క్రమంలోనే ఒంటరితనం భరించలేక మనోవేదనకు గురయ్యేవాడని తెలుస్తుంది. టెక్సాస్ బిమౌంటులో రైలు కిందపడి దీపక్ సూసైడ్ చేసుకున్నట్లు అమెరికా నుంచి బంధువులకు సమాచారం అందింది. దీంతో పామూరులో విషాదఛాయలు అలుముకున్నాయి. -
ఈతకు వెళ్లి.. ఎన్నారై విద్యార్థి మృతి
స్నేహితులతో సరదాగా ఈతకు వెళ్లిన తెలుగు విద్యార్థి మృతి చెందాడు. విశాఖపట్నానికి చెందిన అనుదీప్ ఎంఎస్ చేసేందుకు ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ యూనివర్సిటీలో సీటు సంపాదించి ఈ సంవత్సరం మార్చిలో ఆస్ట్రేలియా వెళ్లాడు. బుధవారం సాయంత్రం స్నేహితులతో కలిసి మెల్బోర్న్లోని ఒక చెరువులో ఈతకు వెళ్లాడు. అయితే.. ప్రస్తుతం అక్కడ ఉష్ణోగ్రత మైనస్ డిగ్రీలలో ఉంటోంది. ఆ విషయం గుర్తించలేని అనుదీప్.. అలాగే చెరువులో ఈతకు దిగాడు. దాంతో అక్కడున్న మంచుగడ్డల్లో ఇరుక్కుపోయి మరణించాడు. ఈ విషయాన్ని విశాఖపట్నంలో ఉంటున్న అతడి కుటుంబ సభ్యులకు గురువారం తెల్లవారుజామున చెప్పారు. అతడి తండ్రి నేవీలో ఉద్యోగం చేస్తున్నారు. కుమారుడి మరణవార్త విని తల్లిదండ్రులు హతాశులయ్యారు. -
అంతర్జాతీయ స్కేటింగ్ పోటీలకు ఎన్ఆర్ఐ విద్యార్థి
తిరుచానూరు : థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో జరగబోవు అంతర్జాతీయ స్పీడ్ స్కేటింగ్ చాంపియన్‌షిప్ పోటీలకు తిరుచానూరులోని శ్రీఎన్‌ఆర్‌ఐ ఇంగ్లిష్ మీడియం పాఠశాల 4వ తరగతి విద్యార్థి జి.చంద్రగణేష్ ఎంపికయ్యాడు. బుధవారం ఆ పాఠశాలలో అభినందన కార్యక్రమం ఏర్పాటు చేసి డైరెక్టర్ బుజ్జిరెడ్డి ఆ విద్యార్థిని అభినందించి మాట్లాడారు. గత ఏడాది నవంబర్‌లో చెన్నైలో జరిగిన 800 మీటర్ల స్కేటింగ్ రిలేలో బంగారు, రింగ్–3లో కాంస్య పతకాలు సాధించాడని పేర్కొన్నారు. అదే ఏడాది జూన్‌లో గోవాలో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో 3బంగారు పతకాలు, నాగ్‌పూర్‌లో జరిగిన పోటీల్లో 3బంగారు, 1వెండి, 1కాంస్య పతకం, ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన జాతీయ రోలర్ స్కేటింగ్ చాంపియన్‌షిప్‌లో బంగారు పతకం సాధించాడని తెలిపారు. బ్యాంకాక్‌లో జరగనున్న అంతర్జాతీయ పోటీల్లో ఇన్లైన్ క్యాటగిరిలో పాల్గొననున్నాడని, అంతర్జాతీయ స్థాయిలోనూ పసిడి పతకాలు సాధించి దేశానికి, పాఠశాలకు పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. -
ఎన్నారై విద్యార్థి హత్య కేసులో బెయిల్‌కు మరో ఇద్దరి పిటిషన్
న్యూఢిల్లీ: ఎన్నారై విద్యార్థి అన్మోల్ శర్న(21) హత్య కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఇద్దరు నిందితులు శనివారం బెయిల్ కోసం పిటిషన్ వేశారు. కాగా ఈ పిటిషన్ సోమవారం విచారణకు రానుంది. నిందితులు మాధవ్ భండారీ, ప్రనిల్ షా ఇంతకుముందు కూడా బెయిల్ కోసం పిటిషన్ వేయగా వారిపైన ఉన్న ఫిర్యాదులు బలమైనవని భావిస్తూ ఢిల్లీ కోర్టు పిటిషన్‌ను తిరస్కరించింది. మళ్లీ ఇప్పుడు వారిద్దరూ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. గత నెల 13వ తేదీన తన స్నేహితుడి ఫ్లాట్‌లో జరిగిన డ్రగ్ పార్టీకి హాజరైన అన్మోల్ శర్న అర్ధరాత్రి తర్వాత గొడవ చేస్తుండటంతో సెక్యూరిటీ గార్డులిద్దరూ అతడిని చితకబాది బయటకు తోసేశారు. అనంతరం శర్న అనుమానస్పదస్థితిలో మరణించాడు. అన్మోల్ తన హైస్కూల్ విద్యను న్యూయార్క్‌లో పూర్తిచేశా డు. పైచదువుల కోసం కెనడా వెళ్లాల్సి ఉండగా, డ్రగ్పార్టీ అనంతరం మృతి చెందాడు. -
'ఎన్నారై విద్యార్థిని శృతి బరాల్ది ఆత్మహత్యే'
ఇంగ్లండ్‌లో అనుమానాస్పద స్థితిలో మరణించిన భారతీయ విద్యార్థినిది ఆత్మహత్యేనని అక్కడి అధికారులు తేల్చారు. శృతి బరాల్ (22) అనే విద్యార్థిని ఇటీవల మరణించగా, ఆమె మణికట్టు మీద 'నా శరీర అవయవాలు తీసుకోండి' అని రాసి ఉంది. తీవ్రమైన డిప్రెషన్‌తో బాధపడుతున్న ఆమె కొకైన్ అధిక మోతాదులో తీసుకోవడం వల్లే మరణించినట్లు పోస్టుమార్టంలో తేలింది. ఆమె మరణించాలనే ఉద్దేశంతోనే అలా చేసినట్లు వైద్యాధికారి పాట్రీషియా హార్డింగ్ తెలిపారు. యూకే నుంచి హాంకాంగ్ వెళ్లిన బరాల్, డ్రగ్స్ అధిక మోతాదులో తీసుకోవడం వల్లే మరణించినట్లు పాథాలజిస్టు డాక్టర్ డేవిడ్ రౌస్ కూడా నిర్ధరించారు. ఆమె రక్తంలో కొంత ఆల్కహాల్ ఆనవాళ్లు కూడా కనిపించాయి. శృతి తన బెడ్రూంలో నేల మీద పడి ఉండగా ఆమె తమ్ముడు గమనించాడు. యూనివర్సిటీ ఆఫ్ లండన్‌లో జియోగ్రఫీ చదువుతున్న ఆమె చాలా తెలివైన విద్యార్థిని అని, అసలు డ్రగ్స్ తీసుకునే అలవాటు ఏమాత్రం లేదని విచారణలో తేలింది. ఫిబ్రవరి 17న ఆమె మరణించగా, అంతకుముందు ఫేస్బుక్లో ఓ సందేశం పెట్టింది. ఒకవేళ తాను చనిపోతే తనను గుర్తుపెట్టుకుంటారా అని ఆ సందేశంలో అందరినీ అడిగింది. డిప్రెషన్‌తో బాధపడుతున్న ఆమె, తన యూనివర్సిటీలోని మానసిక వైద్య విభాగాన్ని కూడా సంప్రదించింది.