nro
-
అమెరికాకు ‘స్పేస్ ఎక్స్’ నిఘా ఉపగ్రహాలు!
వాషింగ్టన్: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ స్థాపించిన ‘స్పేస్ ఎక్స్’ కంపెనీ కేవలం అంతరిక్ష ప్రయోగాలే కాదు, నిఘా ఉపగ్రహాల తయారీకి సైతం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు స్పేస్ ఎక్స్‌తో అమెరికా ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ‘ఎన్ఆర్ఓ’ డీల్ కుదుర్చుకున్నట్లు విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. 2021లోనే ఒప్పందం కుదిరిందని, ఈ కాంట్రాక్టు విలువ 1.8 బిలియన్ డాలర్లు అని తెలియజేశాయి. దీనిప్రకారం ఎలాన్ మస్క్ సంస్థ వందలాది నిఘా ఉపగ్రహాలను తయారు చేసి, ఎన్ఆర్ఓకు అప్పగించాల్సి ఉంటుంది. అమెరికా భద్రతా సంస్థలు, ఎలాన్ మస్క్ కంపెనీ మధ్య బలపడుతున్న బంధానికి ఈ ఒప్పందమే నిదర్శనమని చెబుతున్నారు. ఈ ఉపగ్రహాలు. భూగోళంపై ప్రతి ప్రాంతంపై డేగ కన్నేస్తాయి. అమెరికా సైనిక ఆపరేషన్లకు తోడ్పాటునందిస్తాయి. లక్ష్యాలను కచ్చితంగా గుర్తించడానికి సహకరిస్తాయి. వీటితో అమెరికా ప్రభుత్వానికి, సైన్యానికి చాలా ప్రయోజనాలే ఉంటాయిని నిపుణులు పేర్కొంటున్నారు. -
ఎస్బీహెచ్ డిపాజిట్ పథకానికి అనూహ్య స్పందన
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ‘ఎస్బీహెచ్-150 రోజులు’ పేరుతో ప్రవేశపెట్టిన పరిమిత కాల డిపాజిట్ పథకానికి అనూహ్య స్పందన లభించింది. కేవలం పది రోజుల్లో ఈ పథకం ద్వారా రూ. 1,500 కోట్లకు పైగా డిపాజిట్లను సేకరించినట్లు ఎస్బీహెచ్ మేనేజింగ్ డెరైక్టర్ ఎం. భగవంతరావు ‘సాక్షి’కి తెలిపారు. డిమాండ్ బాగుండటంతో ఈ పథకాన్ని ఈ నెలాఖరు వరకు పొడిగించుతున్నట్లు తెలిపారు. కేవలం 150 రోజుల కాల పరిమితి గల ఈ డిపాజిట్ పథకంపై ఎస్బీహెచ్ 9.15 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది. డిసెంబర్ 9న ప్రవేశపెట్టిన ఈ పథకంలో ఇన్వెస్ట్ చేయడానికి తొలుత డిసెంబర్ 31 చివరి తేదీ అని ప్రకటించినా ఇప్పుడు దీన్ని మరో నెల రోజులు పొడిగించారు. ఈ పథకంలో ప్రవాస భారతీయులు (ఎన్ఆర్ఐ) కూడా ఇన్వెస్ట్ చేయచ్చు.