ఎర్రకోటలో పేలుడు పదార్థాలు
న్యూఢిల్లీ: ఎర్రకోటలోని ఓ బావిలో మందుగుండు సామగ్రి, పేలుడు పదార్థాలు కనిపించడం కలకలం రేపింది. ఎర్రకోటలోని పబ్లికేషన్ భవనం వెనుక ఉన్న ఓ బావిని శనివారం సిబ్బంది శుభ్రం చేస్తుండగా ఐదు మోర్టార్లు, 44 ఉపయోగించని, 87 ఉపయోగించిన బుల్లెట్లు దొరికాయి. వెంటనే పోలీసులకు, ఎన్ ఎస్జీకి సమాచారం అందించారు.
ఆ ప్రాంతాన్ని పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నాక ఎన్ ఎస్జీ సిబ్బంది బాంబులను నిర్వీర్యం చేసే నిపుణులతో అక్కడికి చేరుకున్నారు. అవి ప్రభుత్వానికి చెందినవే అయ్యుంటాయని భావిస్తున్నారు.